క్రైమ్
ఓఆర్ఆర్పై ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ దుర్మరణం!
హైదరాబాద్ నగర శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డు(ORR)పై తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నగరంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల సంబరాల్లో పాల్గొని తిరుగు ప్రయాణమైన ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ(40) ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. కళాకారుడిగా ఎంతోమందిని అలరించిన ఆయన అకాల మరణంతో కుటుంబ సభ్యులు, తోటి కళాకారులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన నగర వ్యాప్తంగా ఉన్న కళాభిమానులను తీవ్రంగా కలిచివేసింది.
