క్రైమ్

డీఎస్పీ భీమ్ రెడ్డి కేసులో ఏసీబీ దూకుడు.. బినామీల ఇళ్లలో మెరుపుదాడులు!

 ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ భీమ్ రెడ్డి కేసు దర్యాప్తులో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు తమ వేగాన్ని మరింత పెంచారు. ఈ కేసు విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు కీలక పరిణామాన్ని వెలుగులోకి తెచ్చారు. డీఎస్పీ భీమ్ రెడ్డికి సంబంధించినవిగా భావిస్తున్న ఎనిమిది మంది అనుమానిత బినామీలను అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్‌లోని పుప్పాలగూడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ బినామీల నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ బృందాలు నేడు(గురువారం) ఏకకాలంలో మెరుపు సోదాలు చేపట్టాయి. ఏసీబీ డీఎస్పీ జి.శ్రీధర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఈ తనిఖీలను నిర్వహిస్తున్నాయి.