తెలంగాణ

స్పీకర్‌పై దూషణలు వీడియోల్లో స్పష్టంగా ఉన్నాయి.. ఆధారాలతో బయటపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు!

 తెలంగాణ శాసనసభలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అత్యున్నత రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉన్న స్పీకర్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్‌రావు బెదిరింపు ధోరణిలో మాట్లాడటం ప్రజాస్వామ్య వ్యవస్థలకే తీవ్ర ప్రమాదకరమని హెచ్చరించారు. సభను ఏ రకంగా నడపాలి, ఏ అంశాలపై నిర్ణయాలు తీసుకోవాలి అనే దానిపై స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వడానికి లేదా ఇలా చేయొద్దు.. అలా చేయొద్దని శాసించడానికి ప్రతిపక్ష నేతలకు ఎలాంటి హక్కు లేదని సభా వేదికగా సూటిగా నిలదీశారు.