తెలంగాణ
ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే తీర్పు ఖాయం.. ఉపఎన్నికపై దానం ధీమా!
హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో జరగబోయే ఉప ఎన్నికపై మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అత్యంత భారీ విజయాన్ని సాధిస్తుందని, ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే రీతిలో ప్రజలు నిర్ణయాత్మకమైన తీర్పు ఇవ్వబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.
