స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్
పోలీసు సేవల్లో సాంకేతిక విప్లవం
పోలీసు సేవలను మరింత పారదర్శకంగా, వేగంగా, సమర్థంగా అందించేందుకు తెలంగాణ పోలీసు శాఖ సాంకేతికతకు పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా నేర పరిశోధన విభాగం (సీఐడీ) రూపొందించిన ఏడు డిజిటల్ సేవలను డీజీపీ సీ.వీ.ఆనంద్ డీజీపీ కార్యాలయంలో ప్రారంభించారు. పోలీసు సేవలను ఇటీవల వినియోగించుకున్న ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు తెలుసుకునేందుకు సిటిజన్ ఫీడ్‌బ్యాక్ సెంటర్ (సీఎఫ్‌సీ)ను ఏర్పాటు చేశారు. పిటిషన్లు, ఎఫ్‌ఐఆర్‌ల నమోదు, ఈ-చలాన్లు, పాస్‌పోర్టు వెరిఫికేషన్ సేవలపై ప్రజల స్పందనను ఈ కేంద్రం సేకరిస్తుంది.
