వైరల్ న్యూస్
గణనాథుని పూజలో వింత.. విగ్రహంపై ప్రత్యక్షమైన మూషికం.. ఆశ్చర్యంలో భక్తులు!
అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరులోని ట్రైబల్ గర్ల్స్ స్కూల్లో వినాయక చవితి పూజా వేడుకల్లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. పాఠశాల ఆవరణలో విద్యార్థినులు, ఉపాధ్యాయులు భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించిన గణేశుడి మండపంలోకి హఠాత్తుగా ఒక ఎలుక ప్రవేశించింది. సాధారణంగా చిన్న అలికిడికే పరుగులు తీసే మూషికం అక్కడ ఉన్న మైకుల హోరు, విద్యార్థినుల భజనల కోలాహలం మధ్య కూడా ఏమాత్రం భయపడకుండా నేరుగా గణపతి విగ్రహం పాదాల వద్దకే చేరుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
