క్రైమ్
పసిపాపను కబళించిన చిన్న నిర్లక్ష్యం: బోరున విలపిస్తున్న కుటుంబ సభ్యులు!
తల్లిదండ్రుల చిన్నపాటి నిర్లక్ష్యం, విద్యుత్ పరికరాల పట్ల అవగాహన లోపం పసికందు ప్రాణాలను బలిగొంది. ఇంట్లో చార్జింగ్‌లో ఉన్న ఎలక్ట్రిక్ కాంటాను (వేయింగ్ స్కేల్) పట్టుకోవడంతో తీవ్రమైన విద్యుత్ షాక్‌కు గురై 10 నెలల పసిపాప అక్కడికక్కడే మృతిచెందింది. ఈ హృదయ విదారక ఘటన జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఇంట్లో తల్లిదండ్రులు తమ దైనందిన పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో, పాప నేలపై ఆడుకుంటూ పాకుతూ వెళ్లి చార్జింగ్ పెట్టి ఉన్న ఎలక్ట్రిక్ కాంటా వైర్లను పట్టుకుంది.
