వైరల్ న్యూస్
రోబోటిక్ టెక్నాలజీతో అద్భుతం.. 12ఏళ్ల తర్వాత నడిచిన యువతి!
సాంకేతికత మనిషి సౌకర్యాలకే పరిమితం కాకుండా, ఎంతోమంది నిరాశలో కూరుకుపోయిన జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. దీనికి లెబనాన్‌కు చెందిన జెస్సికా టవిల్ (Jessica Tawil) ఉదంతం చక్కటి ఉదాహరణగా నిలిచింది. 2014లో సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జెస్సికా వెన్నుపూస దెబ్బతినడంతో పారాప్లీజియా (Paraplegia) బారిన పడ్డారు. అప్పటి నుంచి శరీర కింది భాగం పనిచేయక పూర్తిగా వీల్‌చైర్‌కే పరిమితమైన ఆమె జీవితంలో, అత్యాధునిక టెక్నాలజీ తాజాగా అద్భుతమైన మార్పును తెచ్చింది.
