International
అంతర్జాతీయ చెస్‌లో అద్భుతం.. చరిత్ర సృష్టించిన 11ఏళ్ల భారత సంతతి బాలిక!
విశ్వ చెస్ వేదికపై భారత సంతతికి చెందిన బ్రిటన్ చిచ్చరపిడుగు బోధన శివానందన్(11) సరికొత్త చరిత్ర లిఖించింది. చెస్ క్రీడా ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఇంటర్నేషనల్ మాస్టర్’ (IM) హోదాను దక్కించుకున్న అతిపిన్న వయస్కురాలైన అమ్మాయిగా బోధన ప్రపంచ రికార్డు నెలకొల్పింది. కేవలం 11 ఏళ్ల 7 నెలల 16 రోజుల వయసులోనే ఆమె ఈ అరుదైన ఘనతను సాధించి అంతర్జాతీయ క్రీడా ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. దశాబ్దాల క్రితం చెస్ దిగ్గజం జుడిత్ పోల్గర్ నెలకొల్పిన చారిత్రక రికార్డును దాటి బోధన కొత్త చరిత్ర సృష్టించింది.
