ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు..!
ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపుల కేసులో అరెస్టు అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. కోర్టు అనుమతుల మేరకు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అరెస్టుకు ముందు ట్రైనీ ఐపీఎస్ రాసిన సూసైడ్ నోట్లో తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని.. కావాలనే తన మీద తప్పుడు ఆరోపణలు చేశారని.. సాక్ష్యాలన్నీ ఐఫోన్లో ఉన్నాయని పేర్కొన్న ఉదయ్.. ఇప్పుడు ఆ నోట్, మొబైల్ కూడా మాయం చేసినట్టు సమాచారం.దీంతో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఎపిసోడ్ కీలక మలుపులు తీసుకుంటున్నది.దర్యాప్తులో భాగంగా అతని రూంలో తనిఖీలు చేపట్టిన పోలీసులకు కీలక ఆధారాలైన సూసైడ్ నోట్ , ఐఫోన్ కనిపించలేదు. అవి ఎక్కడ మాయమైనట్లు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదే విషయమై కస్టడీలో ఉన్న ఉదయ్‌ను ప్రశ్నించగా.. పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్టు తెలిసింది.
