స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్
ముఖ్యనేత పీఏ బూతు పురాణం?
ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమే. కానీ, హద్దులు మీరితే ఎవరైనా ఒకటే. డీజీపీ అయినా, కానిస్టేబుల్ అయినా ఒకటే రూల్. కానీ, ముఖ్య నేత వద్ద పీఏగా ఉంటున్న ఆర్టీఏ కానిస్టేబుల్ తనకు రూల్స్ పట్టవు. నా రూటే సపరేటు అన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్య నేతకు దగ్గరి బంధువు కావడం, పీఏగా అధికారికంగా నియమకం కావడంతో ఫోన్ కాల్స్ తప్పనిసరి అవుతోంది. వర్క్ ప్రెజరా లేక ఇలానే ఉంటేనే పనులు అవుతాయనే వైఖరో కానీ, బూతులతో కుమిలిపోయిన వాళ్లు బయటపడుతున్నారు.
