వినియోగదారుడిపై గుది ‘బండ’..మళ్లీ పెరిగిన గ్యాస్ ధరలు!
వినియోగదారులకు మరోసారి షాక్ తగిలింది.ఊహించని విధంగా గ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. ప్రతినెలా మొదటి వారంలో చమురు సంస్థలు ధరలను రివైజ్ చేస్తాయనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కమిర్షియల్ ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.తాజా పెంపుతో హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపార సంస్థలపై ఆర్థిక భారం మరింత పడనుంది. పండుగల ఆర్డర్స్ వచ్చే సమయంలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై ఒక్కసారిగా రూ.62.50 పెంచారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.2,837.50కి చేరుకుంది. ఇక ముంబై నగరంలో రూ.2,764, చెన్నైలో రూ.2,983, బిహార్‌లోని పాట్నాలో రూ.3,100, హైదరాబాద్ నగరంలో రూ.3,065కి, విజయవాడలో 2,932.50, విశాఖపట్నంలో రూ.2,827.50కి ధరలు పలుకుతున్నాయి.
