క్రైమ్

DSPBheemReddy: దేశంలోనే తొలిసారి.. భీమ్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో కీల‌క ప‌రిణామం!

అక్రమాస్తుల వ్యవహారంలో సస్పెండైన తెలంగాణ మాజీ డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డి కేసులో దర్యాప్తు సంస్థలు వేగాన్ని పుంజుకున్నాయి. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) జరుపుతున్న విచారణకు తోడుగా తాజాగా ఐటీ సైతం ఈ కేసులో నేరుగా రంగంలోకి దిగింది. భీమ్‌రెడ్డికి బినామీలుగా వ్యవహరించినట్లు బలమైన ఆధారాలు లభించిన 8 మందిపై 'బినామీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ యాక్ట్' కింద ఐటీ శాఖ కేసులు నమోదు చేయడం సంచలనం సృష్టిస్తోంది. దేశంలోనే ఈ స్థాయి అధికారి బినామీ నెట్‌వర్క్‌పై బినామీ చట్టం కింద ఈ తరహా కేసులు నమోదు కావడం అత్యంత అరుదైన పరిణామంగా అధికారులు పేర్కొంటున్నారు. డీజీపీ కార్యాలయ పరిధిలోని పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగంలో డీఎస్పీగా పని చేసిన సమయంలో భీమ్‌రెడ్డిపై ఏసీబీ అధికారులు ప్రాథమిక కేసు నమోదు చేశారు.