తెలంగాణ
దీపావళి కానుక.. ఆర్టీసీ, మెట్రో కామన్ పాస్ ధరలు భారీగా తగ్గింపు!
హైదరాబాద్లోని రోజూవారీ ప్రయాణికుల రవాణా భారాన్ని తగ్గించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. నగరంలో ఆర్టీసీ (TGSRTC) బస్సులు, హైదరాబాద్ మెట్రో రైళ్లలో ఉమ్మడిగా ప్రయాణించేందుకు వీలుగా తీసుకొచ్చిన 'ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్' (RTC-Metro Common Pass) ధరలను ప్రభుత్వం భారీగా కుదించింది. గతంలో నిర్ణయించిన పాస్ ధరలు సామాన్య, మధ్యతరగతి ఉద్యోగులకు ఆర్థికంగా భారంగా మారాయన్న విమర్శలు, ప్రజా విజ్ఞప్తులపై సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించారు.
