సినిమా
'ది ప్యారడైజ్'లో KCRను పోలిన పాత్ర.. ట్రెండింగ్‌గా ప్రియదర్శి గెటప్, పవర్ఫుల్ డైలాగ్స్!
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ రూపొందిన 'ది ప్యారడైజ్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై థియేటర్లలో రికార్డు స్థాయి స్పందనను రాబడుతోంది. పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో వర్సటైల్ నటుడు ప్రియదర్శి పోషించిన 'ఎమ్మెల్యే శంకర్' పాత్ర ప్రస్తుతం సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ రాజకీయ నాయకుడి గెటప్‌లో కనిపించిన ప్రియదర్శి నటనపై నెటిజన్లు, సినీ ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
