Spirituality
సరయూ తీరంలో సరికొత్త ప్రపంచ రికార్డు.. 36లక్షల ప్రమిదల వెలుగుల్లో అయోధ్య!
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని పవిత్ర పుణ్యక్షేత్రం అయోధ్యలో నిర్వహించిన 10వ విడత 'దీపోత్సవం' కనులపండువగా, అత్యంత వైభవంగా ముగిసింది. చారిత్రాత్మక సరయూ నదీ తీరంలోని 56 ఘాట్లలో ఏకంగా 36లక్షలకు పైగా మట్టి ప్రమిదలను వెలిగించి నిర్వాహకులు సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. వీటితో పాటు భవ్యమైన శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రాంగణంలో సైతం ప్రత్యేకంగా లక్ష దీపాలను వెలిగించారు. ఈ ఆధ్యాత్మిక ఘట్టం కోసం సుమారు 35వేల మందికి పైగా స్వచ్ఛంద వలంటీర్లు అహోరాత్రులు శ్రమించి ప్రమిదలను క్రమపద్ధతిలో పేర్చి వెలుగులు నింపడం విశేషం.
