International
సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌పై లాడెన్ కన్ను!
అల్ ఖైదా మాజీ అధినేత ఒసామా బిన్ లాడెన్ 2001 సెప్టెంబర్ 11న అమెరికాపై జరిపిన భీకర ఉగ్రదాడులకు కంటే ముందే భారత్‌ను తన దాడి లక్ష్యాల (హిట్ లిస్ట్) జాబితాలో చేర్చినట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా నిఘా సంస్థ సీఐఏ (CIA) తాజాగా విడుదల చేసిన అత్యంత రహస్య పత్రాల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. 9/11 దాడులకు సంబంధించిన 100 పేజీలకు పైగా నిఘా సమాచారంతో కూడిన 70కి పైగా ప్రెసిడెన్షియల్ డైలీ బ్రీఫ్లను CIA ప్రజల ముందుకు ఉంచడంతో ఈ చారిత్రక నిజాలు బయటపడ్డాయి.
