తెలంగాణ
9 సెక్యూరిటీ ఫీచర్లతో కొత్త రేషన్ కార్డులు.. ఆ రహస్య సాంకేతికత ఏంటో తెలుసా?
TG: రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీడీఎస్ వ్యవస్థలో చోటుచేసుకుంటున్న అక్రమాలకు స్వస్తి పలికేందుకు, నకిలీ కార్డుల వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నూతన ఆహార భద్రతా కార్డులను పంపిణీ చేయడానికి వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. అర్హులైన పేద కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందాలనే ముఖ్య ఉద్దేశంతో ఏకంగా తొమ్మిది రకాల సెక్యూరిటీ ఫీచర్లను ఈ కొత్త కార్డులలో పొందుపరుస్తున్నారు. ఈ నూతన కార్డుల తయారీలో భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక రూపాకల్పన చేశారు.
