ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేశారు.. రూ.8లక్షల కోట్ల అప్పు మా నెత్తిన పెట్టారు
Ponguleti Srinivas Reddy: బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన విధ్వంసాన్ని సరిదిద్దేందుకు పదేళ్లు పడుతుందని అంటారా? అంటూ బీఆర్ఎస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి విధ్వంసం చేసింది బీఆర్ఎస్ అని ఆయన ఎదురుదాడికి దిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిందని.. రూ.8.21 లక్షల కోట్ల అప్పు చేసి మా నెత్తిన పెట్టిందని ధ్వజమెత్తారు. ఆర్థిక సంక్షోభం ఉన్నా అభివృద్ధి, సంక్షేమాన్ని అందిస్తున్నామని వివరించారు.
