International
ఫిలిప్పీన్స్లో ఘోర బోటు ప్రమాదం: 76కు చేరిన మృతుల సంఖ్య
ఫిలిప్పీన్స్ దేశంలో సంభవించిన భయంకరమైన టూరిస్ట్ బోటు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. రాజధాని మనీలా నుంచి సుమారు 130 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఒక పర్యాటక బోటులో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించడంతో క్షణాల్లో మంటలు దట్టంగా వ్యాపించాయి. అనూహ్యంగా చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ప్రయాణికులు బయటకు రావడానికి సరైన ద్వారాలు, మార్గాలు లేకపోవడంతో చాలామంది బోటులోనే చిక్కుకుని సజీవ దహనమయ్యారు.
