International

కొలంబియాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం.. 100 మందికి పైగా మృతి!

దక్షిణ అమెరికా దేశమైన పశ్చిమ కొలంబియాలో సంభవించిన అత్యంత తీవ్రమైన భూకంపం ఆ ప్రాంతాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. రిక్టర్ స్కేలుపై 7.4తీవ్రతతో నమోదైన ఈ మహా విపత్తు కారణంగా ఇప్పటివరకు 100మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. భూకంప ధాటికి అనేక బహుళ అంతస్తుల భవనాలు, నివాస గృహాలు పేకమేడల్లా కూలిపోయాయి. శిథిలాల కింద ఇంకా చాలామంది చిక్కుకుని ఉండే అవకాశం ఉందని, దాంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం ఉందని స్థానిక అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) నివేదిక ప్రకారం, చోకో ప్రాంతంలోని శాన్ జోస్ డెల్ పల్మార్ పట్టణానికి సమీపంలో భూమికి సుమారు 107 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది.