National
కంపించిన హిమాలయ ప్రాంతం.. టిబెట్లో 5.3 తీవ్రతతో భారీ భూకంపం!
హిమాలయ పర్వత ప్రాంతమైన టిబెట్లో బుధవారం మరోసారి బలమైన భూకంపం సంభవించి స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. దీని ప్రభావంతో పొరుగు దేశమైన నేపాల్లోని పలు ప్రాంతాల్లో కూడా తీవ్ర భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.3గా నమోదైనట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ (EMSC) అధికారికంగా వెల్లడించింది. భూమి అంతర్భాగంలో సుమారు 35కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉన్నట్లు భౌగోళిక శాస్త్రవేత్తలు గుర్తించారు.
