National
ప్రభుత్వ స్కూల్లో కలకలం.. 36 మంది విద్యార్థులకు అస్వస్థత!..
బిహార్‌లోని నలంద జిల్లాలో మిడ్ డే మీల్ ఘటన కలకలం రేపింది. పరసి ప్రభుత్వ మిడిల్ స్కూల్లో ఉప్పుకు బదులుగా పొరపాటున డిటర్జెంట్ పౌడర్‌ను ఆహారంలో కలిపారు. ఈ భోజనం తిన్న 36 మంది విద్యార్థులు తల తిరగడం, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని నలంద సదర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్థులంతా ప్రమాదం నుంచి బయటపడ్డారని వైద్యులు తెలిపారు. ఘటనపై బిహార్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రవణ్ కుమార్ ఆరా తీశారు. మిడ్ డే మీల్ తయారీ నుంచి వడ్డించే వరకు జరిగిన పరిణామాలపై సమగ్ర విచారణకు అధికారులు ఆదేశించారు.
