తెలంగాణ

ఎకరం రూ.264 కోట్లు.. రికార్డులు బద్దలు కొట్టిన రాయదుర్గం భూములు

రాయదుర్గంలోని పీ1 ప్లాట్‌కు ఎకరాకు రూ.175 కోట్ల రిజర్వ్ ధర నిర్ణయించారు. పోటాపోటీగా సాగిన వేలంలో చివరకు ఎకరాకు రూ.264 కోట్ల ధర పలికింది. ఇది రిజర్వ్ ధర కంటే దాదాపు 51 శాతం అధికమని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌పై ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు, జాతీయ స్థాయి డెవలపర్ల విశ్వాసం ఎంతగా పెరిగిందో ఈ వేలం ఫలితం స్పష్టం చేస్తోందని అధికారులు పేర్కొన్నారు. రాయదుర్గంలో భూముల విలువ వేగంగా పెరుగుతున్న దానికి ఈ వేలం మరో ఉదాహరణగా నిలిచిందని స్పష్టం చేస్తున్నారు.