తెలంగాణ
22A Lands: స్వేచ్ఛ ఎఫెక్ట్.. తప్పు ఒప్పుకున్న మంత్రి పొంగులేటి
22A Lands: నిషేధిత భూముల (Section 22-A) అంశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తప్పు ఒప్పుకున్నారు. 22ఏ భూముల వివాదంపై గత వారం రోజులుగా స్వేచ్ఛ అనేక కథనాలు రాసింది. 22ఏ పై స్వేచ్ఛ ఛైర్మన్ దేవేందర్ రెడ్డి చింతకుంట్ల బీబీసీకి కూడా ఆర్టికల్ ఇచ్చారు. ఈ కథనాలతో రెవెన్యూ యంత్రాంగంలో కదలిక వచ్చింది. స్వయంగా మంత్రి పొంగులేటి రంగంలోకి దిగారు. 22-A భూముల అంశంపై ఉదయం నుంచి సచివాలయంలో సమీక్షలు నిర్వహించారు. అనంతరం తప్పు జరిగినట్లు ప్రెస్ మీట్లో ఆయన ఒప్పుకున్నారు.
