తెలంగాణ

22-A పెద్ద కుట్ర.. మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలి- తెలంగాణ సమాఖ్య డిమాండ్

22ఏ పెద్ద కుట్ర అని తెలంగాణ సమాఖ్య ఆరోపించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్షమాపణలు చెప్పడం కాదు రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. తప్పు చేసిన ఆఫీసర్లందరినీ వెంటనే సస్పెండ్ చేయాలంది. భూ యజమానులకు ఇచ్చిన 22ఏ నోటీసులు అన్నింటిని వెంటనే రద్దు చేయాలంది. భూ బాధితులు టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి బకరాలు కావొద్దని సూచించింది. పౌర సమాజం మేల్కోవాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ సమాఖ్య విజ్ఞప్తి చేసింది.