రేపటి నుంచి మళ్లీ అసెంబ్లీ సమావేశాలు.. 22ఏ కీలక చర్చ..! (22A)

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి మళ్లీ మొదలు కానున్నాయి. 3 రోజుల వరుస సెలవుల తర్వాత బుధవారం ఉదయం 10 గంటలకు సభ మొదలు కానుంది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి రెండ్ల తిరుపతి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో స్టార్ గుర్తు ఉన్న ప్రశ్నలు, ఆపై షార్ట్ డిస్కషన్‌లో రిజిష్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏ పై చర్చ కొనసాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలపై ప్రభావం చూపిన ఎల్‌నినోపై, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై చర్చ ఉంటుందని అసెంబ్లీ కార్యదర్శి రెండ్ల తిరుపతి తెలిపారు.

కాగా, బుధవారం అసెంబ్లీలో 22A పై చర్చించాల్సిన అంశాలపై సీఎం రేవంత్ జూబ్లీహిల్స్‌లోని MCRHRDలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. 22A జాబితాపై సీఎం రేవంత్‌కు రెవెన్యూ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్, సీఎస్ సంజయ్ జాజుతోపాటు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. బుధవారం అసెంబ్లీలో 22ఏ, ఎల్ నినోపై చర్చ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించినట్లు సమాచారం.