ఏపీ
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం!
కలియుగ దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎలాంటి ప్రత్యేక టికెట్లు లేని సామాన్య భక్తులకు స్వామివారి సర్వదర్శనం లభించడానికి కనీసం 18గంటల సుదీర్ఘ సమయం పడుతోంది. ఆలయ ప్రాంగణంలో పెరిగిన తాకిడి కారణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 లోని 31కంపార్టుమెంట్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. దీనికి తోడు నారాయణగిరి ఉద్యానవనంలోని తొమ్మిది రక్షణ షెడ్లు కూడా సర్వదర్శన యాత్రికులతో పూర్తిగా నిండిపోయాయి.
