తెలంగాణ
175 ఎకరాల భూవివాదం.. ఎంపీ రఘునందన్ రావు కుటుంబంపై సంచలన ఆరోపణలు!
రాష్ట్రంలో మరోసారి భూ అన్యాక్రాంతం, ప్రభుత్వ భూముల ప్రైవేట్ పట్టాల మార్పిడి వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. సిద్దిపేట జిల్లా చౌడర్పల్లి గ్రామం సర్వే నంబర్ 294 పరిధిలోని సుమారు 175 ఎకరాల భూమికి సంబంధించిన చారిత్రక రికార్డులు, తదనంతరం జరిగిన భూ బదలాయింపులపై స్వతంత్ర దర్యాప్తు జరగాలంటూ తీవ్రస్థాయిలో డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈ వివాదంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు (MP) మాధవనేని రఘునందన్ రావు కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.
