తెలంగాణ

మత సామరస్యం అంటే ఇదే.. రూ.1.45లక్షలకు గణేశ్ లడ్డూను దక్కించుకున్న ముస్లిం దంపతులు!

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో మానవత్వానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఒక అరుదైన సన్నివేశం ఆవిష్కృతమైంది. వినాయక నిమజ్జనోత్సవాల సందర్భంగా నిర్వహించిన స్వామివారి లడ్డూ వేలంలో చాందిని, మస్తాన్‌ వలి అనే ముస్లిం దంపతులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ పోటీపడిన ఈ దంపతులు ఏకంగా రూ.1,45,000 చెల్లించి గణనాథుని దివ్య ప్రసాదాన్ని తమ వశం చేసుకున్నారు. విశ్వాసాలు, ఆచారాలు వేరైనా సోదరభావం, భక్తి భావన ఒకటేనని చాటిచెప్పిన ఈ సంఘటన స్థానిక ప్రజల హృదయాలను విశేషంగా ఆకట్టుకుంది.