తెలంగాణ

మాక్ అసెంబ్లీలో తలసాని సెటైర్లు.. '100 రోజుల్లో హామీలు అన్నాం.. కానీ ఏ 100 రోజుల్లో చెప్పామా?'

శాసనసభ సమావేశాల సందర్భంగా తమ పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో 'మాక్ అసెంబ్లీ' (నకిలీ సభ) నిర్వహించింది. ఈ మాక్ అసెంబ్లీలో బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి పాత్ర పోషించగా, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు స్పీకర్ స్థానంలో వ్యవహరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, హామీల అమలు తీరుపై సీఎం పాత్రలో ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ పదునైన వ్యంగ్యాస్త్రాలు విసిరారు.