[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-viral-this-is-what-a-room-costing-30000-in-dubai-looks-like-video-goes-viral-online":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":34,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":104},5425,1866,"viral-this-is-what-a-room-costing-30000-in-dubai-looks-like-video-goes-viral-online","VIRAL: దుబాయ్‌లో రూ.30వేలకు దొరికే అద్దెగది ఇంతే మరి.. నెట్టింట వీడియో వైరల్‌!","విలాసవంతమైన భవనాలు, ఖరీదైన షాపింగ్ మాల్స్, ఆకర్షణీయమైన జీతాలకు చిరునామా అయిన దుబాయ్‌లో సామాన్య ప్రవాసుల బతుకుచిత్రం ఎంత కష్టతరంగా ఉంటుందో తెలిపే దృశ్యమిది. దుబాయ్‌లో తక్కువ, మధ్యస్థ ఆదాయ వర్గాలు చెల్లించే భారీ అద్దెలు, వారు నివసించే చిన్నపాటి గదులకు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఓ భారతీయ మహిళ వీడియో ద్వారా వెల్లడించింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F66a07c78-b85c-47a9-9376-7c16d33e97d1.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F66a07c78-b85c-47a9-9376-7c16d33e97d1.jpg","Mamatha puppala","viral","routine",[19,20,21,22,23,24],"DubaiRent","OffbeatNews","ViralVideo","DubaiLife","DubaiExpats","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-08T05:32:20+00:00","2026-09-08T05:35:37+00:00",106,"\u003Cp>\u003Cspan>&nbsp;విలాసవంతమైన భవనాలు, ఖరీదైన షాపింగ్ మాల్స్, ఆకర్షణీయమైన జీతాలకు చిరునామా అయిన దుబాయ్‌లో సామాన్య ప్రవాసుల బతుకుచిత్రం ఎంత కష్టతరంగా ఉంటుందో తెలిపే దృశ్యమిది. దుబాయ్‌లో తక్కువ, మధ్యస్థ ఆదాయ వర్గాలు చెల్లించే భారీ అద్దెలు, వారు నివసించే చిన్నపాటి గదులకు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఓ భారతీయ మహిళ వీడియో ద్వారా వెల్లడించింది. తాను దుబాయ్‌లో నివాసముంటున్న అతి చిన్న అద్దె గదిని చూపిస్తూ ఆమె తీసిన షార్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;‘దుబాయ్‌లో రూ.30వేలు ఖర్చు చేస్తే మీకు ఎలాంటి గది దొరుకుతుంది?’ అంటూ ప్రారంభమైన ఆ వీడియోలో గది పరిమాణాన్ని చూసి నెటిజన్లు దిగ్భ్రాంతి చెందుతున్నారు. ఒక ఇరుకైన మార్గం నుంచి లోపలికి వెళ్లగానే డ్యూప్లెక్స్ తరహాలో రూపుదిద్దుకున్న చిన్న పార్టిషన్ గది కనిపిస్తుంది. పైభాగంలో పడుకోవడానికి ఒక మంచం, కింద లగేజీ పెట్టుకోవడానికి మాత్రమే చాలా స్వల్ప స్థలం అందుబాటులో ఉంది. దుస్తులు, ఇతర నిత్యావసర సామాన్లు దాచుకోవడానికి కూడా సరైన వసతి లేని ఆ గదిలో కేవలం ఏసీ సదుపాయం మాత్రమే కల్పించారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;అద్దె వివరాలను సదరు మహిళ వివరిస్తూ.. ఈ చిన్న గదిలో ఒక్కరు నివసించాలంటే నెలకు 1,200 నుంచి 1,300 దిర్హామ్‌లు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. భారతీయ కరెన్సీలో ఇది దాదాపు రూ.30,000 నుంచి రూ.33,000 వరకు ఉంటుంది. ఒకవేళ ఇద్దరు కలిసి షేరింగ్‌లో ఉండాలనుకుంటే అద్దె 1,400 నుంచి 1,500 దిర్హామ్‌లకు పెరుగుతుందని, అంటే దాదాపు రూ.36,000 నుంచి రూ.39,000 వరకు ఖర్చవుతుందని ఆమె స్పష్టం చేశారు. దుబాయ్ నగరంలో పెరిగిన నివాస వ్యయం ప్రవాస ఉద్యోగులకు ఏ స్థాయిలో భారంగా మారిందో ఈ వీడియో అద్దం పడుతోంది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;ఈ వీడియోపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. అంత చిన్న గదిలో ఉంటే ఊపిరాడనట్లుగా అనిపిస్తుందని కొందరు కామెంట్ చేయగా, మరికొందరు మాత్రం దుబాయ్‌కి కొత్తగా వచ్చే ప్రతి ఒక్కరూ ప్రారంభంలో బెడ్ స్పేస్‌లు, చిన్న పార్టిషన్ రూమ్‌లలోనే గడుపుతారని తమ అనుభవాలను గుర్తు చేసుకున్నారు. విలాసవంతమైన జీవితానికి కేరాఫ్ అడ్రస్‌గా కనిపించే దుబాయ్‌లో అధిక శాతం జీతం అద్దెలు, నిత్య జీవిత ఖర్చులకే కరిగిపోతోందనడానికి ఈ క్లిప్ ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;\u003C\u002Fspan>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"WhatsApp Image 2026-09-08 at 10.59.05 AM.jpeg",[],"https:\u002F\u002Fwww.instagram.com\u002Freel\u002FDc3d_SbKeJx\u002F?utm_source=ig_web_copy_link&stkn=NTc4MTIwNjQ2YQ==",{"title":36,"description":37},"VIRAL: దుబాయ్‌లో రూ.30వేలకు దొరికే గది ఇంతే మరి.. !!","విలాసవంతమైన భవనాలు, ఖరీదైన షాపింగ్ మాల్స్, ఆకర్షణీయమైన జీతాలకు చిరునామా అయిన దుబాయ్‌లో సామాన్య ప్రవాసుల బతుకుచిత్రం ఎంత కష్టతరంగా ఉంటుందో తెలిపే దృశ్యమిది. దుబ",[39,46,55,60,66,72,78,84,92,97],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":44,"read_time":25,"published_at":27,"public_read_count":45},"cases-and-arrests-are-meant-to-suppress-voices-that-question-harish-rao","BRS : ప్రశ్నించే గొంతులను అణగదొక్కడానికే కేసులు, అరెస్టులు : హరీశ్ రావు","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9a1d598c-0222-40e4-a0a9-3d0e774db04a.jpg","Kumar",208,{"slug":47,"title":48,"category":49,"image":50,"author":51,"read_time":52,"published_at":53,"public_read_count":54},"vijay-war-mode","ద‌ళ‌ప‌తి విజ‌య్ విశ్వ‌రూపం! డీఎంకేనే మెయిన్ టార్గెట్‌?","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb499367a-2f1b-4dfb-b905-065e90d95142.jpg","Kashi","9 నిమిషాల పఠనం","2026-09-08T05:52:01+00:00",55,{"slug":56,"title":57,"category":42,"image":58,"author":44,"read_time":25,"published_at":59,"public_read_count":28},"congress-calls-for-siege-of-kcrs-farmhouse-high-tension-prevails-in-erravalli","Congress : కేసీఆర్ ఫాంహౌస్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపు.. ఎర్రవల్లిలో  టెన్షన్ టెన్షన్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7bee6eb9-7db1-4569-a607-d9ea2d4ff467.jpg","2026-09-08T06:00:05+00:00",{"slug":61,"title":62,"category":42,"image":63,"author":15,"read_time":64,"published_at":65,"public_read_count":28},"brs-mlas-express-anger-at-the-assembly-kaushik-reddy-and-dr-sanjay-lash-out-at-the-revanth-government","అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం.. రేవంత్ ప్రభుత్వంపై కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్ నిప్పులు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fad89405f-9e35-4108-bbb1-2f56abb342ad.jpg","5 నిమిషాల పఠనం","2026-09-08T06:04:48+00:00",{"slug":67,"title":68,"category":42,"image":69,"author":15,"read_time":25,"published_at":70,"public_read_count":71},"what-do-you-have-to-say-about-the-insult-to-my-mother-speaker-directly-confronts-harish-rao","‘నా తల్లిని అవమానించడంపై ఏం చెబుతారు?’.. హరీశ్‌రావును సూటిగా నిలదీసిన స్పీకర్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff332a049-6252-4723-9637-9f7759ff475a.jpg","2026-09-08T06:21:49+00:00",361,{"slug":73,"title":74,"category":42,"image":75,"author":76,"read_time":64,"published_at":77,"public_read_count":28},"telangana-will-the-strategy-adopted-by-the-brs-against-the-congress-work","Telangana: కాంగ్రెస్ పై బీఆర్‌ఎస్ వ్యూహం వర్కౌట్ అవుతుందా!?..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff1275c2a-3df6-4760-9dad-3aaed42322f2.webp","Venu","2026-09-08T05:25:03+00:00",{"slug":79,"title":80,"category":42,"image":81,"author":15,"read_time":25,"published_at":82,"public_read_count":83},"appalling-situation-in-the-ministers-constituency-principal-beats-female-students-for-asking-about-the-lack-of-water","మంత్రి ఇలాకాలో దారుణ దుస్థితి.. నీళ్లు లేవని అడిగినందుకు విద్యార్థినులను కొట్టిన ప్రిన్సిపాల్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4f640825-d9d7-40a2-8ada-89d0fb3b20d5.jpg","2026-09-08T04:52:23+00:00",310,{"slug":85,"title":86,"category":87,"image":88,"author":89,"read_time":64,"published_at":90,"public_read_count":91},"sai-pallavi-telugu-movies","Sai Pallavi: \"తండేల్\" తర్వాత తెలుగులో గ్యాప్ ఎందుకు వచ్చింది?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd47846cc-5aa3-41e7-8c97-87d62bf59c58.webp","Anshu","2026-09-08T04:50:50+00:00",259,{"slug":93,"title":94,"category":42,"image":95,"author":44,"read_time":25,"published_at":96,"public_read_count":28},"brs-mlas-intercepted-adjournment-motion-moved-in-the-assembly","BRS : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అడ్డగింత.. అసెంబ్లీలో వాయిదా తీర్మానం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd39b43c8-6363-4695-99fc-792cfc92a150.jpg","2026-09-08T04:40:29+00:00",{"slug":98,"title":99,"category":100,"image":101,"author":76,"read_time":102,"published_at":103,"public_read_count":28},"paris-gender-discrimination-in-paris-employees-protest-at-the-eiffel-tower","Paris: పారిస్‌లో లింగ వివక్ష.. ఈఫిల్ టవర్ వద్ద ఉద్యోగుల ఆందోళన!!..","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6d2305fa-9c23-4e14-a9a7-6bc88ac7fbe6.webp","7 నిమిషాల పఠనం","2026-09-08T04:27:43+00:00",[105,110,113,115,117,119],{"title":106,"sponsor":107,"image":108,"url":109},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":111,"sponsor":112,"image":108,"url":109},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":114,"sponsor":112,"image":108,"url":109},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":116,"sponsor":112,"image":108,"url":109},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":118,"sponsor":112,"image":108,"url":109},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":120,"sponsor":112,"image":108,"url":109},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]