[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-vijay-war-mode":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":32,"published_at":33,"updated_at":34,"public_read_count":35,"body":36,"images":37,"video_url":5,"video_urls":40,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":41,"read_next":44,"sponsored_content":110},5424,1868,"vijay-war-mode","ద‌ళ‌ప‌తి విజ‌య్ విశ్వ‌రూపం! డీఎంకేనే మెయిన్ టార్గెట్‌?","తమిళనాడు అసెంబ్లీలో విజయ్‌ వేసిన తాజా అడుగు చూస్తే.. ఇది కేవలం ఒక సీఎం ప్రసంగంలా కనిపించడం లేదు. ప్రధాన ప్రత్యర్థి డీఎంకేపై నేరుగా దాడి చేయడానికి ఆయన సిద్ధమయ్యారన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb499367a-2f1b-4dfb-b905-065e90d95142.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb499367a-2f1b-4dfb-b905-065e90d95142.jpg","Kashi","national","routine",[19,20,21,22,23,24,25,26,27,28,29,30,31],"Vijay","Thalapathy Vijay","TVK","Tamil Nadu Politics","DMK","MK Stalin","Vijay Politics","Tamil Nadu CM","TVK Party","Tamil Politics","Political News","DMK vs Vijay","Vijay News","9 నిమిషాల పఠనం","2026-09-08T05:52:01+00:00","2026-09-08T05:52:10+00:00",55,"\u003Cp>స్టైల్ మార్చిన ద‌ళ‌ప‌తి విజ‌య్\u003C\u002Fp>\u003Cp>విశ్వ‌రూపం చూపిస్తున్న త‌మిళ‌నాడు సీఎం\u003C\u002Fp>\u003Cp>డీఎంకేపై డైర‌క్ట్ ఎటాక్\u003C\u002Fp>\u003Cp>త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో స‌రికొత్త సంచ‌ల‌నం\u003C\u002Fp>\u003Cp>తమిళనాడు రాజకీయాల్లో విజయ్‌ పేరు కొత్త కాదు.. కానీ విజయ్‌ రాజకీయ శైలి మాత్రం ఇప్పుడు కొత్తగా కనిపిస్తోంది. ఇన్నాళ్లూ సభలో పెద్దగా మాట్లాడరనే విమర్శలు.. రాజకీయ అనుభవం లేదనే కామెంట్లు.. ప్రత్యర్థులను ఎదుర్కోగలరా అనే అనుమానాలు.. ఇవన్నీ ఒక్కొక్కటిగా వెనక్కి వెళ్లిపోతున్నాయా? అన్న చర్చ మొదలైంది.\u003C\u002Fp>\u003Cp>ఎందుకంటే.. తమిళనాడు అసెంబ్లీలో విజయ్‌ వేసిన తాజా అడుగు చూస్తే.. ఇది కేవలం ఒక సీఎం ప్రసంగంలా కనిపించడం లేదు. ప్రధాన ప్రత్యర్థి డీఎంకేపై నేరుగా దాడి చేయడానికి ఆయన సిద్ధమయ్యారన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.\u003C\u002Fp>\u003Cp>ఒక్క ప్రసంగం.. డీఎంకేపై నేరుగా గురి!\u003C\u002Fp>\u003Cp>సెప్టెంబర్‌ 7న అసెంబ్లీలో మాట్లాడిన విజయ్‌.. డీఎంకే గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చే ప్రయత్నంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ పత్రాలను, సర్కారియా కమిషన్‌ నివేదికను ప్రస్తావించారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో పార్టీ ఫండ్స్‌ పేరుతో డబ్బులు వసూలు చేశారంటూ కూడా ఆయన ఆరోపించారు. కొన్ని కాంట్రాక్టుల విలువలో 7.5 నుంచి 10 శాతం వరకు వసూళ్లకు సంబంధించిన ఆరోపణలను సభలో ప్రస్తావించారు. ఇక్కడే విజయ్‌ రాజకీయ స్టైల్‌లో మార్పు కనిపిస్తోందన్న విశ్లేషణ మొదలైంది.\u003C\u002Fp>\u003Cp>ఎందుకంటే.. ఇప్పటివరకు విజయ్‌ రాజకీయ ప్రసంగాల్లో ఎక్కువగా ప్రజా సమస్యలు, పాలన, తన ప్రభుత్వ విధానాలే ప్రధానంగా కనిపించాయి. కానీ ఇప్పుడు ఆయన నేరుగా డీఎంకే గత పాలనను టార్గెట్ చేస్తున్నారు. అది కూడా సాధారణ రాజకీయ విమర్శలతో కాదు.. పాత నివేదికలు, అధికారిక సంస్థల పత్రాలను ప్రస్తావిస్తూ.\u003C\u002Fp>\u003Cp>‘మీ గతం ఇదీ..’ అంటూ డీఎంకేకు సవాల్‌!\u003C\u002Fp>\u003Cp>విజయ్‌ అక్కడితో ఆగలేదు. డీఎంకే పాలనలో జరిగినట్టు తాను చెబుతున్న పలు అవకతవకలు, టెండర్లు, పార్టీ ఫండ్స్‌, మద్యం వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలను సభలో ప్రస్తావించారు. గతంలో డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన విధానాలు, రద్దు చేసిన పథకాలు, నిలిపివేసిన ప్రాజెక్టులను కూడా విజయ్‌ ప్రశ్నించారు.\u003C\u002Fp>\u003Cp>అంటే.. విజయ్‌ ఇప్పుడు ఒక కొత్త రాజకీయ ఫార్ములాను ముందుకు తీసుకొస్తున్నట్టుగా కనిపిస్తోంది. మీరు మా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. మీ గత పాలనను మేము ప్రశ్నిస్తాం అనే క్లారిటీ ఇచ్చారు. ఇది డీఎంకేకు రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టించే అవకాశం ఉంది.\u003C\u002Fp>\u003Cp>అసెంబ్లీలో డీఎంకే వర్సెస్ విజయ్‌!\u003C\u002Fp>\u003Cp>విజయ్‌ ఆరోపణలపై డీఎంకే సభ్యులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ స్పందించేందుకు అవకాశం ఇవ్వలేదని ఆరోపిస్తూ డీఎంకే సభ్యులు సభలో నినాదాలు చేసి చివరకు వాకౌట్‌ చేశారు. ఇదంతా విజ‌య్ విశ్వ‌రూపంలో భాగంగా టీవీకే పార్టీ చూస్తోంది.\u003C\u002Fp>\u003Cp>ఇక తమిళనాడు రాజకీయాల్లో డీఎంకేకు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉంది. కరుణానిధి నుంచి స్టాలిన్‌ వరకు బలమైన నాయకత్వం.. కేడర్‌.. సంస్థాగత నిర్మాణం.. రాజకీయ అనుభవం.. ఇవన్నీ డీఎంకేకు ఉన్నాయి. అలాంటి పార్టీని ఎదుర్కోవాలంటే కేవలం పాపులారిటీ సరిపోదు. రాజకీయంగా కథను కూడా తన చేతుల్లోకి తీసుకోవాలి. జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తుంటే.. విజయ్‌ ఇప్పుడు అదే పని చేస్తున్నారా? అనే విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. \u003C\u002Fp>\u003Cp>మెల్లిమెల్లిగా మారుతున్న ‘విజయ్‌ బ్రాండ్‌’!\u003C\u002Fp>\u003Cp>విజయ్‌ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన చుట్టూ ఉన్న ప్రధాన బలం అభిమానులే. సినిమాల్లో సంపాదించిన భారీ క్రేజ్‌ రాజకీయాల్లోకి ఎంతవరకు మారుతుందనే ప్రశ్న ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తోంది.\u003C\u002Fp>\u003Cp>అసెంబ్లీలో మాట్లాడే విధానం.. ప్రత్యర్థులపై నేరుగా దాడి చేయడం.. ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించుకోవడం.. గత పాలనను ప్రశ్నించడం.. అవసరమైనప్పుడు రాజకీయంగా కఠినమైన భాష ఉపయోగించడం.. ఇవన్నీ చూస్తే విజయ్‌ తనను తాను కేవలం స్టార్‌ పొలిటీషియన్ గా కాకుండా పవర్‌ పాలిటిక్స్‌లో సీరియస్‌ ప్లేయర్‌గా ప్రొజెక్ట్‌ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్న భావన కలుగుతోంది.\u003C\u002Fp>\u003Cp>డీఎంకేనే ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు?\u003C\u002Fp>\u003Cp>తమిళనాడులో తన పార్టీని ప్రధాన రాజకీయ శక్తిగా నిలబెట్టుకోవాలంటే.. విజయ్‌కు ఒక స్పష్టమైన ప్రత్యర్థి అవసరం. ఆ పాత్రను డీఎంకే తీసుకుంటే.. రాజకీయ పోరు కూడా ప్రజలకు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే డీఎంకే గత పాలనను పదేపదే ప్రస్తావించడం ద్వారా.. నేను ప్రత్యామ్నాయం.. అనే రాజకీయ సందేశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.\u003C\u002Fp>\u003Cp>విజయ్‌ ముందున్న అసలు పరీక్ష ఇదే!\u003C\u002Fp>\u003Cp>విజయ్‌ ఇప్పుడు ఒక కీలక దశలో ఉన్నారు. సినిమా స్టార్‌గా ఉన్న ఇమేజ్‌ను రాజకీయ నాయకుడి ఇమేజ్‌గా మార్చుకోవడం ఒక ఎత్తయితే.. ఆ ఇమేజ్‌ను ఎన్నికల రాజకీయాల్లో ఓట్లుగా మార్చుకోవడం మరో ఎత్తు. అసెంబ్లీలో ఎంత పవర్‌ఫుల్‌గా మాట్లాడినా.. చివరకు ప్రజల మధ్య పార్టీకి ఎంత బలం ఉంది? కేడర్‌ ఎంత బలంగా ఉంది? నియోజకవర్గ స్థాయిలో నాయకత్వం ఎలా ఉంది? మిత్రపక్షాలతో సంబంధాలు ఎలా ఉంటాయి? ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే రాజకీయ వ్యూహం ఎంతకాలం కొనసాగుతుంది? అన్నదే విజయ్‌ భవిష్యత్తును నిర్ణయించబోతోంది.\u003C\u002Fp>\u003Cp>ఇది ‘విశ్వరూపం’కి ట్రైలరేనా?\u003C\u002Fp>\u003Cp>విజయ్‌ రాజకీయ ప్రయాణాన్ని గమనిస్తే.. ఆయన ఒక్కసారిగా దూకుడుగా వెళ్ల‌డం కంటే మెల్లిమెల్లిగా తన పరిధిని పెంచుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. మొదట పార్టీ నిర్మాణం.. ఆ తర్వాత అధికారంలోకి రావడం.. ఇప్పుడు అసెంబ్లీలో ప్రత్యర్థిపై నేరుగా దాడి చేయడం.. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా తన పార్టీని బలమైన రాజకీయ శక్తిగా నిలబెట్టే ప్రయత్నం..\u003C\u002Fp>\u003Cp>ఇదంతా చూస్తే సీఎం విజయ్‌ తన స్టార్‌ ఇమేజ్‌ను దాటి స్టేట్‌ లెవల్‌ పవర్‌ సెంటర్‌గా మారాలనుకుంటున్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. సినిమా స్టార్ కాబ‌ట్టి ఓసారి అవ‌కాశ‌మిచ్చార‌నే భావ‌న‌ను చెరిపేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు విజ‌య్. త‌మిళ రాజ‌కీయాల్లో వెళ్లూనుకుపోయిన ద్ర‌విడ పార్టీల‌కు భిన్నంగా టీవీకేను స్థాపించి విక్ట‌రీ కొట్టారు. ఇప్పుడు మ‌రింత దూకుడుగా ఆ పార్టీని టాప్ ప్లేస్‌లో నిల‌బెట్ట‌లాని విశ్వ ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అసెంబ్లీలో డీఎంకేపై ఆయన చేసిన తాజా దాడి కూడా ఈ ప్రయాణంలో మరో కీలక అడుగుగా కనిపిస్తోంది.\u003C\u002Fp>",[38],{"url":13,"name":39},"vijay_war_mode_under_1mb.jpg",[],{"title":42,"description":43},"Vijay Goes Into War Mode, Targets DMK in Tamil Nadu","Tamil Nadu CM Vijay takes an aggressive political stand, directly targeting the DMK and signaling a new phase in state politics.",[45,54,61,67,73,81,87,93,99,104],{"slug":46,"title":47,"category":48,"image":49,"author":50,"read_time":51,"published_at":52,"public_read_count":53},"congress-calls-for-siege-of-kcrs-farmhouse-high-tension-prevails-in-erravalli","Congress : కేసీఆర్ ఫాంహౌస్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపు.. ఎర్రవల్లిలో  టెన్షన్ టెన్షన్","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7bee6eb9-7db1-4569-a607-d9ea2d4ff467.jpg","Kumar","4 నిమిషాల పఠనం","2026-09-08T06:00:05+00:00",106,{"slug":55,"title":56,"category":48,"image":57,"author":58,"read_time":59,"published_at":60,"public_read_count":53},"brs-mlas-express-anger-at-the-assembly-kaushik-reddy-and-dr-sanjay-lash-out-at-the-revanth-government","అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం.. రేవంత్ ప్రభుత్వంపై కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్ నిప్పులు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fad89405f-9e35-4108-bbb1-2f56abb342ad.jpg","Mamatha puppala","5 నిమిషాల పఠనం","2026-09-08T06:04:48+00:00",{"slug":62,"title":63,"category":48,"image":64,"author":58,"read_time":51,"published_at":65,"public_read_count":66},"what-do-you-have-to-say-about-the-insult-to-my-mother-speaker-directly-confronts-harish-rao","‘నా తల్లిని అవమానించడంపై ఏం చెబుతారు?’.. హరీశ్‌రావును సూటిగా నిలదీసిన స్పీకర్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff332a049-6252-4723-9637-9f7759ff475a.jpg","2026-09-08T06:21:49+00:00",361,{"slug":68,"title":69,"category":48,"image":70,"author":50,"read_time":51,"published_at":71,"public_read_count":72},"ias-officer-naveen-mittals-personal-secretary-collapsed-even-though-the-minister-performed-cpr","Breaking : కుప్పకూలిన ఐఏఎస్ నవీన్ మిట్టల్ పర్సనల్ సెక్రెటరీ.. మంత్రి సీపీఆర్ చేసినా..!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2b3b2b48-c6e5-4579-9b67-ddc96fa67893.jpg","2026-09-08T06:24:37+00:00",310,{"slug":74,"title":75,"category":76,"image":77,"author":78,"read_time":51,"published_at":79,"public_read_count":80},"the-paradise-anirudh","The Paradise: రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్ చేసినా అనిరుధ్ పట్టించుకోడా?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe0236dec-140a-44aa-8cb6-26e0d82816b5.webp","Anshu","2026-09-08T06:27:39+00:00",157,{"slug":82,"title":83,"category":48,"image":84,"author":50,"read_time":51,"published_at":85,"public_read_count":86},"cases-and-arrests-are-meant-to-suppress-voices-that-question-harish-rao","BRS : ప్రశ్నించే గొంతులను అణగదొక్కడానికే కేసులు, అరెస్టులు : హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9a1d598c-0222-40e4-a0a9-3d0e774db04a.jpg","2026-09-08T05:35:37+00:00",208,{"slug":88,"title":89,"category":90,"image":91,"author":58,"read_time":51,"published_at":92,"public_read_count":53},"viral-this-is-what-a-room-costing-30000-in-dubai-looks-like-video-goes-viral-online","VIRAL: దుబాయ్‌లో రూ.30వేలకు దొరికే అద్దెగది ఇంతే మరి.. నెట్టింట వీడియో వైరల్‌!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F66a07c78-b85c-47a9-9376-7c16d33e97d1.jpg","2026-09-08T05:32:20+00:00",{"slug":94,"title":95,"category":48,"image":96,"author":97,"read_time":59,"published_at":98,"public_read_count":53},"telangana-will-the-strategy-adopted-by-the-brs-against-the-congress-work","Telangana: కాంగ్రెస్ పై బీఆర్‌ఎస్ వ్యూహం వర్కౌట్ అవుతుందా!?..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff1275c2a-3df6-4760-9dad-3aaed42322f2.webp","Venu","2026-09-08T05:25:03+00:00",{"slug":100,"title":101,"category":48,"image":102,"author":58,"read_time":51,"published_at":103,"public_read_count":72},"appalling-situation-in-the-ministers-constituency-principal-beats-female-students-for-asking-about-the-lack-of-water","మంత్రి ఇలాకాలో దారుణ దుస్థితి.. నీళ్లు లేవని అడిగినందుకు విద్యార్థినులను కొట్టిన ప్రిన్సిపాల్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4f640825-d9d7-40a2-8ada-89d0fb3b20d5.jpg","2026-09-08T04:52:23+00:00",{"slug":105,"title":106,"category":76,"image":107,"author":78,"read_time":59,"published_at":108,"public_read_count":109},"sai-pallavi-telugu-movies","Sai Pallavi: \"తండేల్\" తర్వాత తెలుగులో గ్యాప్ ఎందుకు వచ్చింది?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd47846cc-5aa3-41e7-8c97-87d62bf59c58.webp","2026-09-08T04:50:50+00:00",259,[111,116,119,121,123,125],{"title":112,"sponsor":113,"image":114,"url":115},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":117,"sponsor":118,"image":114,"url":115},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":120,"sponsor":118,"image":114,"url":115},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":122,"sponsor":118,"image":114,"url":115},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":124,"sponsor":118,"image":114,"url":115},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":126,"sponsor":118,"image":114,"url":115},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]