[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-vijay-future-pm-of-india":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":35,"published_at":36,"updated_at":37,"public_read_count":38,"body":39,"images":40,"video_url":5,"video_urls":43,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":44,"read_next":47,"sponsored_content":109},4428,1382,"vijay-future-pm-of-india","మోదీ, రాహుల్ తర్వాత విజయ్..! ద‌ళ‌ప‌తి మాయ ఏంటి?","విజయ్ ఫార్ములా.. స్టార్ ఇమేజ్ + యూత్ కనెక్ట్ + కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం. ఈ మూడు కలిస్తే సోషల్ మీడియాలో ఒక నాయకుడి ఇమేజ్ ఎంత వేగంగా జాతీయ స్థాయికి వెళ్లగలదో విజయ్ ఉదాహరణగా మారుతున్నారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7e120f14-aab9-4b7f-88f0-0ab9e5a66ecb.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7e120f14-aab9-4b7f-88f0-0ab9e5a66ecb.jpg","Kashi","national","routine",[19,20,21,22,23,24,25,26,27,28,29,30,31,32,33,34],"Vijay","Thalapathy Vijay","Vijay Politics","TVK","Tamil Nadu Politics","Tamil Nadu CM Vijay","Indian Politics","Modi","Rahul Gandhi","India Today Survey","Mood of the Nation","Vijay Political Strategy","Youth Politics","Tamil Nadu Elections","TVK Party","Vijay PM Aspirations","11 నిమిషాల పఠనం","2026-08-29T07:22:29+00:00","2026-08-29T07:29:40+00:00",565,"\u003Cp>సీఎంగా కాదు.. పీఎంగా కూడా పాపులారిటీ\u003C\u002Fp>\u003Cp>ఎవ‌రికీ సాధ్యం కానిది విజ‌య్‌కి ఎలా అయ్యింది..?\u003C\u002Fp>\u003Cp>జెన్ జీ మ‌ద్ద‌తా లేక కొత్త స‌మీక‌ర‌ణాలా..?\u003C\u002Fp>\u003Cp>ఇండియా టుడే స‌ర్వేలో ఇదే హైలెట్\u003C\u002Fp>\u003Cp>ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే.. ఈసారి ఒక పేరును అనూహ్యంగా దేశ రాజకీయ చర్చలోకి తీసుకొచ్చింది. ప్రధాని మోదీకి 48.7 శాతం, రాహుల్ గాంధీకి 27.1 శాతం.. ఆ తర్వాత 9.2 శాతంతో విజయ్ మూడో స్థానంలో నిలిచారు. అసలు ఆశ్చర్యం ఏంటంటే.. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నేతల మధ్యలోకి విజ‌య్ ఎలా వ‌చ్చారు..? రాజకీయాల్లోకి వచ్చి రెండేళ్లు కూడా పూర్తికాని ఒక వ్యక్తి ఇలా ఎలా హైలెట్ అయ్యారు? విజయ్ చేసిన మాయ ఏంటి?\u003C\u002Fp>\u003Cp>సినిమా స్టార్ నుంచి పొలిటికల్ బ్రాండ్‌గా..\u003C\u002Fp>\u003Cp>విజయ్‌కు ఉన్న సినిమా క్రేజ్ కొత్త విషయం కాదు. కానీ ఆ క్రేజ్‌ను రాజకీయ గుర్తింపుగా మార్చడమే ఆయన అసలు స్ట్రాటజీ. 2024లో TVKని ప్రారంభించిన విజయ్.. మొదటి ఎన్నికకే తమిళనాడు రాజకీయాల్లో బలమైన శక్తిగా నిలిచారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో TVK 108 స్థానాలు గెలుచుకోవడం ద్వారా తొలి ఎన్నికలోనే పెద్ద రాజకీయ ప్రభావాన్ని చూపింది. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంటే విజయ్ విషయంలో సినిమా ఫ్యాన్ బేస్ నుంచి వోటర్ బేస్ కు ట్రాన్సిషన్ చాలా వేగంగా జరిగింది.\u003C\u002Fp>\u003Cp>అసలు ప్లస్.. యాంటీ-ఎస్టాబ్లిష్‌మెంట్ ఇమేజ్\u003C\u002Fp>\u003Cp>విజయ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన ముందున్న అతిపెద్ద అడ్వాంటేజ్.. పాత రాజకీయ వ్యవస్థలో భాగం కాకపోవడం. తమిళనాడులో దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకే చుట్టూ తిరిగిన రాజకీయ పోటీలో.. విజయ్ తనను ఒక కొత్త ఆప్షన్‌గా ప్రొజెక్ట్ చేసుకున్నారు. యువతలో కొత్త నాయకత్వం కావాలి అనే భావనతో ఆయన ఇమేజ్ కలిసిపోయింది. 2026 ఎన్నికల ముందు నిర్వహించిన కొన్ని స్ట‌డీలు, మీడియా విశ్లేషణలు కూడా యువ ఓటర్లలో TVKకి గణనీయమైన ఆసక్తి కనిపించిందని సూచించాయి.\u003C\u002Fp>\u003Cp>ఇక్కడే విజయ్ రాజకీయ మోడల్‌లో మొదటి మిస్టరీ కనిపిస్తుంది. ఆయన కేవలం నేను కొత్త నాయకుడిని అని చెప్పలేదు. తన సినిమా ఫ్యాన్ నెట్‌వర్క్‌ను క్రమంగా రాజకీయ ఆర్గనైజేషన్‌గా మార్చే ప్రయత్నం చేశారు. పార్టీ నిర్మాణం, క్యాడర్ యాక్టివేషన్, నియోజకవర్గ స్థాయి విస్తరణ.. ఇవన్నీ ఎన్నికలకు ముందే చేపట్టారు. అందుకే విజయ్ ఎదుగుదలను కేవలం సినిమా పాపులారిటీతో వివరించడం పూర్తి విశ్లేషణ కాదు.\u003C\u002Fp>\u003Cp>యువత.. విజయ్‌కి అతిపెద్ద ఇంజిన్?\u003C\u002Fp>\u003Cp>విజయ్ రాజకీయ బ్రాండ్‌లో యువత కీలకమైన ఫ్యాక్టర్‌గా కనిపిస్తోంది. సినిమా ద్వారా ఇప్పటికే యువతలో భారీ రీచ్ ఉన్న విజయ్.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అదే కనెక్ట్‌ను మార్పు అనే నేరేటివ్‌తో లింక్ చేశారు. ఉద్యోగాలు, విద్య, భవిష్యత్ అవకాశాలు, కొత్త తరానికి రాజకీయ ప్రాధాన్యం వంటి అంశాలు ఆయన ప్రచారంలో కనిపించాయి. 2026 ఎన్నికలపై వచ్చిన విశ్లేషణల్లో కూడా యువ ఓటర్లలో TVKకి బలమైన మద్దతు కనిపించిందని నివేదికలు పేర్కొన్నాయి.\u003C\u002Fp>\u003Cp>అంటే విజయ్ ఫార్ములా.. స్టార్ ఇమేజ్ + యూత్ కనెక్ట్ + కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం. ఈ మూడు కలిస్తే సోషల్ మీడియాలో ఒక నాయకుడి ఇమేజ్ ఎంత వేగంగా జాతీయ స్థాయికి వెళ్లగలదో విజయ్ ఉదాహరణగా మారుతున్నారు.\u003C\u002Fp>\u003Cp>మహిళలు, అర్బన్ ఓటర్‌ కూడా కీలకమే..\u003C\u002Fp>\u003Cp>విజయ్ ఎదుగుదలలో మరో ఆసక్తికరమైన అంశం మహిళలు, పట్టణ ఓటర్లు. 2026 తమిళనాడు ఎన్నికలపై వచ్చిన ఎన్నికల విశ్లేషణల్లో TVKకి మహిళలు, పట్టణ ప్రాంతాల్లో కూడా గణనీయమైన మద్దతు లభించిందని తేలింది. \u003C\u002Fp>\u003Cp>అయితే ఈ ట్రెండ్స్ ఒక విషయాన్ని మాత్రం చెబుతున్నాయి. విజయ్ రాజకీయ ఆకర్షణ కేవలం తన అభిమాన సంఘాలకే పరిమితం కాలేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి.\u003C\u002Fp>\u003Cp>మోదీ, రాహుల్ తర్వాత ఎందుకు విజయ్?\u003C\u002Fp>\u003Cp>ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే. మోదీకి దాదాపు సగం మంది మద్దతు ఉంది. రాహుల్ గాంధీకి కూడా 27.1 శాతం ఉంది. వారి తర్వాత మూడో స్థానంలో విజయ్ రావడం.. ఆయనకు దేశవ్యాప్తంగా 2029లో ప్రధాని అయ్యే అవకాశాలు వచ్చేశాయని అర్థం కాదు. కానీ జాతీయ రాజకీయాల్లోకి ఆయన పేరు ప్రవేశించింది అన్నది మాత్రం ఈ సర్వే ఇచ్చిన ముఖ్యమైన సిగ్నల్.\u003C\u002Fp>\u003Cp>ఇంకో ఆసక్తికరమైన విషయం.. ప్రస్తుత ప్రతిపక్ష నేతల్లో ఎవరిని ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించడానికి అనుకూలంగా భావిస్తున్నారని అడిగిన ప్రశ్నలో కూడా విజయ్ 12.2 శాతంతో రెండో స్థానంలో నిలిచారు. రాహుల్ గాంధీ 29 శాతంతో ముందున్నారు. అంటే విజయ్‌పై ఉన్న ఆసక్తి కేవలం ప్రధాని ఎవరు? అనే ఒక్క ప్రశ్నకే పరిమితం కాలేదని ఈ సర్వే సూచిస్తోంది.\u003C\u002Fp>\u003Cp>విజయ్ మాయా.. లేక మారుతున్న రాజకీయ‌మా?\u003C\u002Fp>\u003Cp>ఇక్కడే అసలు ఎనాలిసిస్ ఉంది. విజయ్ ఏదో ఒక్క మాయ చేసి ఈ స్థాయికి వచ్చారని చెప్పడం కంటే.. దేశ రాజకీయాల్లో ఒక కొత్త రకం స్పేస్ తయారవుతుందా అన్నది చూడాలి. ఒకవైపు పాత రాజకీయ నాయకత్వంపై విసుగు ఉన్న ఓటర్లు ఉన్నారు. మరోవైపు సోషల్ మీడియా, సినిమా, పాపులర్ కల్చర్ ప్రభావం పెరిగింది. మూడో వైపు యువత కొత్త ముఖాలను పరీక్షించడానికి సిద్ధంగా ఉంది. విజయ్ ఈ మూడు ట్రెండ్స్‌ను ఒకేసారి ట్యాప్ చేసినట్టు కనిపిస్తున్నారు.\u003C\u002Fp>\u003Cp>అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న కూడా ఉంది. పాపులారిటీని ఓట్లుగా మార్చడం ఒకటి.. ఆ ఓట్లను జాతీయ స్థాయి రాజకీయ శక్తిగా మార్చడం మరోటి. 2029 లోక్‌సభ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. జాతీయ స్థాయిలో ఒక పార్టీని నిర్మించడం, వివిధ రాష్ట్రాల్లో సంస్థాగత బలం పెంచడం, ఎంపీలను గెలిపించడం, ఇతర పార్టీలతో పొలిటికల్ అలయన్స్‌లు నిర్మించడం.. ఇవన్నీ పూర్తిగా వేరే ఛాలెంజ్‌లు.\u003C\u002Fp>\u003Cp>అందుకే ప్రస్తుతం విజయ్‌ను నెక్స్ట్ PM అని ఫిక్స్ చేయడం తొందరపాటు. కానీ నెక్స్ట్ PM రేస్‌లో మూడో పేరుగా జాతీయ సర్వేలో కనిపించడం మాత్రం చిన్న విషయం కాదు.\u003C\u002Fp>\u003Cp>కాంగ్రెస్‌కూ.. ఇతర పార్టీలకూ కొత్త ప్రశ్న!\u003C\u002Fp>\u003Cp>విజయ్ ఎదుగుదల తమిళనాడు రాజకీయాలకే పరిమితమా? లేక జాతీయ రాజకీయాల్లో కొత్త పొలిటికల్ బ్రాండ్‌గా ఎదగగలరా? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న. TVKలోని కొందరు నేతలు విజయ్‌ను 2029 ప్రధాని అభ్యర్థిగా చూడాలని ఇప్పటికే మాట్లాడుతున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం రాహుల్ గాంధీయే తమ ప్రధానమంత్రి అభ్యర్థి అని స్పష్టం చేస్తోంది. కాంగ్రెస్ నేత కార్తి చిదంబరం కూడా ప్రధాని కావాలంటే కనీసం 272 మంది ఎంపీల మద్దతు అవసరమని వ్యాఖ్యానించారు.\u003C\u002Fp>\u003Cp>అంటే విజయ్ పేరు ఇప్పుడు రాజకీయ చర్చలోకి వచ్చింది. కానీ ఆ పేరు ఎలక్ష‌న్ మ్యాథ‌మెటిక్స్‌లో ఎంత దూరం వెళ్తుందో చెప్పడానికి ఇంకా చాలా సమయం ఉంది.\u003C\u002Fp>\u003Cp>విజయ్ కథలో అసలు ట్విస్ట్ ఇదే!\u003C\u002Fp>\u003Cp>విజయ్ ఇప్పటివరకు చేసిన అతిపెద్ద ప్రయోగం.. ఫ్యాన్ క్లబ్‌ను క్యాడర్‌గా, స్టార్ ఇమేజ్‌ను పొలిటికల్ బ్రాండ్‌గా, ప్రజాదరణను ఎన్నికల శక్తిగా మార్చడం. మొదటి ఎన్నికలోనే TVK బలమైన ఫలితాలు సాధించడం ఆ ప్రయోగానికి బలం ఇచ్చింది. ఇప్పుడు India Today-CVoter సర్వే ఆయన పేరును మోదీ, రాహుల్ తర్వాత జాతీయ స్థాయిలో నిలబెట్టింది.\u003C\u002Fp>\u003Cp>అందుకే విజయ్‌కి వచ్చిన 9.2 శాతాన్ని కేవలం ఒక సర్వే నంబర్‌గా చూడాల్సిన అవసరం లేదు. అది ఒక పొలిటికల్ సిగ్నల్. భారత రాజకీయాల్లో కొత్త తరం నాయకత్వానికి ఎంత స్పేస్ ఉందో చూపించే సిగ్నల్. కానీ ఈ సిగ్నల్‌ను 2029లో నిజమైన రాజకీయ శక్తిగా మార్చాలంటే విజయ్ ఇంకా చాలా దూరం వెళ్లాలి.\u003C\u002Fp>\u003Cp>సినిమా థియేటర్‌లో చప్పట్లు కొట్టించే స్టార్ నుంచి.. దేశ రాజకీయాల్లో ఓటు వేయించే నాయకుడిగా విజయ్ మారగలరా? అదే ఇప్పుడు అసలు ప్రశ్న. అదే విజయ్ చేసిన మాయకు అసలు పరీక్ష.\u003C\u002Fp>",[41],{"url":13,"name":42},"vijay_mantram_1mb.jpg",[],{"title":45,"description":46},"Vijay’s Political Mantra: Why He’s Rising After Modi & Rahul","Why is Vijay emerging as a major political force after Modi and Rahul? Explore his youth appeal, strategy, popularity and national political rise.",[48,57,66,71,77,83,89,94,100,105],{"slug":49,"title":50,"category":51,"image":52,"author":53,"read_time":54,"published_at":55,"public_read_count":56},"hyderabad-tragic-incident-at-jubilee-hills-peddamma-temple","Hyderabad: జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయంలో విషాద ఘటన!..","Crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3bdc1012-53a6-4ebd-9de8-ac99f6bd3d25.webp","Venu","4 నిమిషాల పఠనం","11 నిమిషాలు క్రితం",1,{"slug":58,"title":59,"category":60,"image":61,"author":62,"read_time":63,"published_at":64,"public_read_count":65},"no-room-for-leniency-in-brs-30-rs-praveen-kumar","'బీఆర్ఎస్ 3.0లో దయాదాక్షిణ్యాలు ఉండవు': ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F96e81e79-0ba3-4fd7-a5c9-37c4a03905b7.jpg","Mamatha puppala","5 నిమిషాల పఠనం","30 నిమిషాలు క్రితం",106,{"slug":67,"title":68,"category":60,"image":69,"author":62,"read_time":54,"published_at":70,"public_read_count":65},"immediate-changes-needed-in-the-state-cabinet-legislative-council-chairman-gutta-sukhender-reddy-makes-key-remarks","రాష్ట్ర క్యాబినెట్‌లో తక్షణ మార్పులు అవసరం.. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F03f7c625-9717-4a2a-9a60-25e79d1028dc.jpg","49 నిమిషాలు క్రితం",{"slug":72,"title":73,"category":74,"image":75,"author":62,"read_time":54,"published_at":76,"public_read_count":65},"good-news-gold-prices-have-dropped-significantly-what-is-the-reason","గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. కారణం ఏంటంటే?","Business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa3e26375-cde1-46fc-aa50-6423741cdcc4.jpg","1 గంట క్రితం",{"slug":78,"title":79,"category":60,"image":80,"author":53,"read_time":81,"published_at":76,"public_read_count":82},"singer-mangli-overseas-trip-creates-a-sensation-what-are-the-answers-to-these-questions","Singer Mangli: సంచలనంగా మారిన మంగ్లీ విదేశీ ప్రయాణం.. ఈ ప్రశ్నలకు సమాధానం ఏది?..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fb0494e1e-24b0-4194-81fc-a9165ed4fd02.webp","6 నిమిషాల పఠనం",55,{"slug":84,"title":85,"category":86,"image":87,"author":88,"read_time":54,"published_at":76,"public_read_count":82},"deepika-padukone-raaka","Deepika Padukone: 'రాకా' రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నారు మాడమ్..అల్లు అర్జున్ క్రేజ్ నీకంటే తక్కువా?","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F763276a8-e363-4412-a933-397949f5676c.jpg","Anshu",{"slug":90,"title":91,"category":92,"image":93,"author":62,"read_time":54,"published_at":76,"public_read_count":65},"trump-needs-mental-treatment-irans-sarcastic-barbs","ట్రంప్‌నకు 'మెంటల్ ట్రీట్‌మెంట్' అవసరం.. ఇరాన్ వ్యంగ్యాస్త్రాలు!","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F4aa8bb39-1e83-42e6-9026-afc6bcc9b7f8.jpg",{"slug":95,"title":96,"category":97,"image":98,"author":53,"read_time":54,"published_at":99,"public_read_count":82},"delhi-big-shock-for-motorists-cng-prices-hiked-sharply-in-delhi","Delhi: పశ్చిమాసియా సెగ.. సామాన్యుడిపై మరో భారం!..","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fed0318d2-33cd-43b5-9a3d-7fd77e6a9ee9.webp","2 గంటలు క్రితం",{"slug":101,"title":102,"category":103,"image":104,"author":62,"read_time":54,"published_at":99,"public_read_count":65},"england-batter-joe-root-sets-a-new-record-breaks-pontings-record","ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ సరికొత్త రికార్డు.. పాంటింగ్ రికార్డు బ్రేక్!","Sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe74deeda-00fe-4073-9957-e95f7c1b14e8.jpg",{"slug":106,"title":107,"category":86,"image":108,"author":88,"read_time":54,"published_at":99,"public_read_count":82},"king-100-glimps","King 100: డబ్బు లేనప్పుడు లూజర్..ఉన్నప్పుడు కింగ్..అదిరిపోయిన గ్లింప్స్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3f418420-329e-4385-83b9-e270c90998c4.jpg",[110,115,118,120,122,124],{"title":111,"sponsor":112,"image":113,"url":114},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":116,"sponsor":117,"image":113,"url":114},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":119,"sponsor":117,"image":113,"url":114},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":121,"sponsor":117,"image":113,"url":114},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":123,"sponsor":117,"image":113,"url":114},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":125,"sponsor":117,"image":113,"url":114},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]