[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-the-sounds-of-the-krishna-river-on-parched-lands-cm-chandrababu-inaugurates-the-first-phase-of-the-veligonda-project":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":34,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":100},4629,1480,"the-sounds-of-the-krishna-river-on-parched-lands-cm-chandrababu-inaugurates-the-first-phase-of-the-veligonda-project","కరవు నేలపై కృష్ణమ్మ సవ్వడులు.. వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ప్రారంభించిన సీఎం చంద్రబాబు!","ఉమ్మడి ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాల ప్రజలు గత మూడు దశాబ్దాలుగా కంటున్న కల ఎట్టకేలకు సాకారమైంది. కరవుతో అల్లాడుతున్న పశ్చిమ ప్రకాశం నేలలకు సంజీవని లాంటి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. నల్లమల గిరులను చీల్చుకుంటూ నిర్మించిన సొరంగాల ద్వారా ఉరకలెత్తుతూ వస్తున్న కృష్ణా జలాలను చూసి ఆ ప్రాంత రైతాంగం సంతోషంతో ఉప్పొంగిపోయింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F2feccd5c-9d87-4e86-9fb9-a42c1bbe42bd.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F2feccd5c-9d87-4e86-9fb9-a42c1bbe42bd.jpg","Mamatha puppala","ap","routine",[19,20,21,22,23,24],"ChandrababuNaidu","VeligondaProject","APNewsTelugu","KrishnaWater","AndhraPradeshNews","NDAAllianceGovt","6 నిమిషాల పఠనం","2026-08-31T07:52:04+00:00","2026-08-31T07:58:09+00:00",106,"\u003Cp>ఉమ్మడి ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాల ప్రజలు గత మూడు దశాబ్దాలుగా కంటున్న కల ఎట్టకేలకు సాకారమైంది. కరవుతో అల్లాడుతున్న పశ్చిమ ప్రకాశం నేలలకు సంజీవని లాంటి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. నల్లమల గిరులను చీల్చుకుంటూ నిర్మించిన సొరంగాల ద్వారా ఉరకలెత్తుతూ వస్తున్న కృష్ణా జలాలను చూసి ఆ ప్రాంత రైతాంగం సంతోషంతో ఉప్పొంగిపోయింది. దశాబ్దాల తరబడి తాము ఎదురుచూసిన సాగు, తాగునీటి కష్టాలు శాశ్వతంగా తీరబోతున్నాయన్న ఆనందం రైతుల ముఖాల్లో స్పష్టంగా కనిపించింది.\u003C\u002Fp>\u003Cp>ఈ చారిత్రక ఘట్టంలో భాగంగా ప్రకాశం జిల్లా దోర్నాల మండలం గంటవానిపల్లె ఫీడర్ కెనాల్‌లోకి స్వయంగా చంద్రబాబు అడుగుపెట్టారు. పరవళ్లు తొక్కుతున్న కృష్ణా జలాలకు ఆయన భక్తిశ్రద్ధలతో నమస్కరించి, పసుపు, కుంకుమ, పట్టుచీరలను కానుకగా సమర్పించి శాస్త్రోక్తంగా జలహారతి ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎంకు అటవీ ప్రాంత గిరిజన మహిళలు తమదైన సంప్రదాయ నృత్యాలతో, మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. వేద పండితులు మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీశైల మల్లికార్జున స్వామి చిత్రపటాన్ని బహూకరించి ఆశీర్వచనాలు అందించారు.\u003C\u002Fp>\u003Cp>వెలిగొండ ప్రాజెక్టు భారీ సొరంగాల నుంచి ఉద్భవించిన జలధారలు ముందుగా గంటవానిపల్లె ఆక్విడెక్టును చేరుకుని, అక్కడి నుంచి అత్యంత వేగంగా నల్లమల సాగర్ రిజర్వాయర్‌లోకి పరుగులు తీశాయి. ఈ అద్భుతమైన దృశ్యాన్ని సభా ప్రాంగణం నుంచి ప్రత్యక్షంగా వీక్షించిన మార్కాపురం రైతులు, స్థానిక మహిళలు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ ప్రాజెక్టు తొలిదశ అందుబాటులోకి రావడం వల్ల సుమారు 1.19లక్షల ఎకరాల ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు అందనుంది. \u003C\u002Fp>\u003Cp>అంతేకాకుండా, దాదాపు 4లక్షల మందికి నిరంతరం తాగునీరు లభించనుండటంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న ఫ్లోరైడ్ మహమ్మారికి శాశ్వత చెక్ పడినట్లయింది. ప్రజల దశాబ్దాల నిరీక్షణకు ముగింపు పలికిన ఈ విశేష కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు భారీ సంఖ్యలో మంత్రులు, ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, డీబీవీ స్వామి, పార్ధసారధితో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బీజేపీ నాయకుడు మాధవ్ ఈ ప్రారంభోత్సవంలో భాగస్వాములయ్యారు.\u003C\u002Fp>\u003Cp>ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఎంతో భావోద్వేగంతో ట్విట్టర్ (X) వేదికగా ఓ పోస్ట్ చేశారు. 1996లో తానే శ్రీకారం చుట్టిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను పూర్తి చేసి జాతికి అంకితం చేసే అరుదైన అవకాశం తనకు దక్కడం ఎంతో సంతోషాన్ని, తృప్తిని ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. వెలిగొండ అంటే కేవలం నీటి ప్రాజెక్టు మాత్రమే కాదని, అది రైతన్నకు ఇచ్చే భరోసా, ఫ్లోరైడ్ రహిత తాగునీరు, ప్రగతికి బాట అని వ్యాఖ్యానించారు. ఈ మహాయజ్ఞం కోసం తమ ఊళ్లను, భూములను త్యాగం చేసిన 11 గ్రామాల నిర్వాసితులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలుపుతూ, 'వెలిగొండ పండుగ'కు ప్రజలంతా తరలిరావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"Screenshot 2026-08-31 132101.jpg",[],"https:\u002F\u002Fx.com\u002Fncbn\u002Fstatus\u002F2093994309611593905?s=20",{"title":36,"description":37},"వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ప్రారంభించిన సీఎం చంద్రబాబు!","ఉమ్మడి ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాల ప్రజలు గత మూడు దశాబ్దాలుగా కంటున్న కల ఎట్టకేలకు సాకారమైంది. కరవుతో అల్లాడుతున్న పశ్చిమ ప్రకాశం నేలలకు సంజీవని లాంటి..",[39,47,56,62,67,72,77,85,90,95],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":44,"read_time":45,"published_at":46,"public_read_count":28},"we-are-okay-if-konda-wants-to-join-mp-arvind","TG : ‘కొండా’ వస్తానంటే మాకు ఓకే : ఎంపీ అర్వింద్","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F4123d107-2981-4aa4-abce-2fc8a0675eff.jpg","Kumar","5 నిమిషాల పఠనం","2026-08-31T08:19:45+00:00",{"slug":48,"title":49,"category":50,"image":51,"author":52,"read_time":53,"published_at":54,"public_read_count":55},"ram-pothineni-rajinikanth","Ram Pothineni: సూపర్ స్టార్ సినిమాలో విలన్‌గా రామ్ పోతినేని?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff8779977-4541-424a-b33d-358c7eb14715.jpg","Anshu","4 నిమిషాల పఠనం","2026-08-31T08:19:46+00:00",157,{"slug":57,"title":58,"category":59,"image":60,"author":15,"read_time":53,"published_at":61,"public_read_count":28},"family-disputes-tension-at-the-wedding-venue-wife-along-with-her-family-attacks-husband","FamilyDisputes: పెళ్లి మండపంలో ఉద్రిక్తత.. ఫ్యామిలీతో కలిసి భర్తపై దాడి!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F55c0a394-f3ba-4b8f-958c-f0911b7078cd.jpg","2026-08-31T08:29:14+00:00",{"slug":63,"title":64,"category":42,"image":65,"author":44,"read_time":53,"published_at":66,"public_read_count":28},"israel-kondal-reddy-company-deals-made-at-revanths-behest-manne-krishank","TG : రేవంత్ చెబితే కొండల్ రెడ్డి కంపెనీతో ఇజ్రాయెల్ ఒప్పందాలు :  మన్నె క్రిశాంక్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fc920d4c2-05ac-442c-b7e0-a85a00643c42.jpg","2026-08-31T08:36:48+00:00",{"slug":68,"title":69,"category":42,"image":70,"author":15,"read_time":53,"published_at":71,"public_read_count":55},"ministers-in-revanths-cabinet-have-no-freedom-cpi-mla-kunamnenis-sensational-comments","‘రేవంత్ క్యాబినెట్‌లో మంత్రులకు స్వేచ్ఛ లేదు..’ సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సంచలన కామెంట్స్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fbf8e15a1-e589-4fc9-a155-854667cde020.jpg","2026-08-31T08:52:33+00:00",{"slug":73,"title":74,"category":59,"image":75,"author":44,"read_time":53,"published_at":76,"public_read_count":28},"a-mothers-shocking-act-strapping-her-daughter-to-her-waist","TG : కూతురిని నడుముకు కట్టుకుని ఓ తల్లి దారుణం..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F9e236cc7-0cf1-4608-88e8-625dba0875cf.jpg","2026-08-31T07:25:58+00:00",{"slug":78,"title":79,"category":42,"image":80,"author":81,"read_time":82,"published_at":83,"public_read_count":84},"konda-future-in-delhi-hands","కొండాకు ఢిల్లీ పిలుపు..! రేవంత్‌ శిబిరం లెక్క ఏంటి?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6281e11c-7901-49aa-9094-31592eb6272a.jpg","Kashi","9 నిమిషాల పఠనం","2026-08-31T07:23:53+00:00",259,{"slug":86,"title":87,"category":59,"image":88,"author":44,"read_time":53,"published_at":89,"public_read_count":28},"nurse-assaulted-after-intruder-enters-through-window-followed-by-a-brutal-act","Crime : కిటికి నుంచి దూరి నర్సుపై అఘాయిత్యం.. ఆపై కిరాతకం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F17016785-6569-4d36-a759-3cd2e8e1c49d.jpg","2026-08-31T07:11:43+00:00",{"slug":91,"title":92,"category":50,"image":93,"author":52,"read_time":53,"published_at":94,"public_read_count":28},"king-100-aishwarya-rajesh","King 100: నాగ్ సరసన ఐశ్వర్య రాజేష్ కన్‌ఫర్మ్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6c15b7bc-4001-4768-9744-056e3e8d9f8b.webp","2026-08-31T07:06:59+00:00",{"slug":96,"title":97,"category":50,"image":98,"author":15,"read_time":53,"published_at":99,"public_read_count":28},"rgv-ram-gopal-varma-schools-young-directors-a-sensational-analysis-of-dhurandhar","RGV: యంగ్ డైరెక్టర్లకు రాంగోపాల్ వర్మ క్లాస్.. : ‘ధురంధర్’పై సంచలన విశ్లేషణ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F385c38c3-a82c-4213-86d3-3140813681a5.jpg","2026-08-31T06:59:57+00:00",[101,106,109,111,113,115],{"title":102,"sponsor":103,"image":104,"url":105},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":107,"sponsor":108,"image":104,"url":105},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":110,"sponsor":108,"image":104,"url":105},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":112,"sponsor":108,"image":104,"url":105},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":114,"sponsor":108,"image":104,"url":105},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":116,"sponsor":108,"image":104,"url":105},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]