[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-tgrtc-telangana-rtcs-new-initiative-metro-style-features-in-buses":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":104},4744,1535,"tgrtc-telangana-rtcs-new-initiative-metro-style-features-in-buses","TGSRTC: తెలంగాణ ఆర్టీసీ కొత్త ప్రయోగం.. బస్సుల్లో మెట్రో తరహా ఏర్పాట్లు!","తెలంగాణ ఆర్టీసీ(TGSRTC) ప్రయాణికులకు అందించే సేవలను మరింత ఆధునికీకరించడంతో పాటు, సంస్థకు అదనపు ఆదాయ మార్గాలను సమకూర్చుకోవడానికి ఒక నూతన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. కేవలం టికెట్ల విక్రయం ద్వారా వచ్చే ఆదాయంపైనే ఆధారపడకుండా నాన్-ఫేర్ రెవెన్యూ విధానంలో భాగంగా నగరంలోని ఎలక్ట్రిక్ బస్సుల్లో డిజిటల్ అడ్వర్టైజింగ్, ఇన్ఫోటైన్‌మెంట్ తెరలను అమర్చుతోంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F64dc7449-3f54-4449-8dc6-c0c18210ad88.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F64dc7449-3f54-4449-8dc6-c0c18210ad88.jpg","Mamatha puppala","telangana","routine",[19,20,21,22,23,24],"TGSRTC","RTCElectricBuses","MetroStyleRTC","HyderabadBuses","TelanganaNews","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-01T07:22:07+00:00","2026-09-01T07:25:13+00:00",106,"\u003Cp>\u003Cspan>&nbsp;తెలంగాణ ఆర్టీసీ(TGSRTC) ప్రయాణికులకు అందించే సేవలను మరింత ఆధునికీకరించడంతో పాటు, సంస్థకు అదనపు ఆదాయ మార్గాలను సమకూర్చుకోవడానికి ఒక నూతన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. కేవలం టికెట్ల విక్రయం ద్వారా వచ్చే ఆదాయంపైనే ఆధారపడకుండా నాన్-ఫేర్ రెవెన్యూ విధానంలో భాగంగా నగరంలోని ఎలక్ట్రిక్ బస్సుల్లో డిజిటల్ అడ్వర్టైజింగ్, ఇన్ఫోటైన్‌మెంట్ తెరలను అమర్చుతోంది. ఈ సరికొత్త డిజిటల్ వ్యవస్థ ఏర్పాటు కోసం ఆర్టీసీ 'రూట్‌వేవ్' అనే ప్రముఖ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;ప్రాథమికంగా హయత్‌నగర్-2 డిపోకు చెందిన 10 అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ నిర్వహణ కోసం నగరంలో అత్యంత రద్దీగా ఉండే హయత్‌నగర్ నుంచి పటాన్‌చెరు మార్గాన్ని అధికారులు ఎంపిక చేశారు. ఈ రూట్‌లో ప్రయాణించే ఎలక్ట్రిక్ బస్సుల్లో అమర్చిన తెరలపై కేవలం వాణిజ్య ప్రకటనలు మాత్రమే కాకుండా మెట్రో రైళ్ల తరహాలోనే రాబోయే బస్ స్టాప్‌ల వివరాలను, ప్రయాణ మార్గంలోని ప్రధాన స్టేజీలను ముందుగానే ప్రదర్శిస్తున్నారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;హైదరాబాద్ నగరంపై లేదా ఈ మార్గంపై సరైన అవగాహన లేని కొత్త ప్రయాణికులకు, దూరప్రాంతాల నుంచి వచ్చే వారికి తమ గమ్యస్థానం ఎప్పుడు వస్తుందో సులభంగా తెలుసుకోవడానికి, సరైన పాయింట్‌లో సురక్షితంగా దిగడానికి ఈ మెట్రో తరహా ప్రదర్శన ఎంతగానో దోహదపడుతుంది. బస్సుల్లో ఉండే డిజిటల్ తెరలను కేవలం వాణిజ్య ప్రకటనలకే పరిమితం చేయకుండా, ప్రజలకు ఉపయోగపడే కీలక సమాచారాన్ని అందించే వేదికగా కూడా మార్చాలని ఆర్టీసీ యోచిస్తోంది. అదేవిధంగా అత్యవసర మార్గదర్శకాలు, హెల్ప్‌లైన్ నంబర్లను ఈ స్క్రీన్ల ద్వారా నిరంతరం ప్రదర్శిస్తారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;నగరంలో పర్యావరణహిత ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ ప్రయోగం వల్ల వచ్చే నాన్-ఫేర్ రెవెన్యూ, ప్రకటనల ఆదాయం, ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను ఆర్టీసీ ఉన్నతాధికారులు క్షుణ్ణంగా సమీక్షించనున్నారు. హయత్‌నగర్–పటాన్‌చెరు రూట్‌లో చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్ట్ ఆశించిన ఫలితాలను ఇస్తే, రాబోయే రోజుల్లో నగరంలోని మిగిలిన అన్ని డిపోలకు చెందిన ఎలక్ట్రిక్ బస్సులకు కూడా ఈ సాంకేతికతను విస్తరించాలని ఆర్టీసీ యాజమాన్యం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. దీనివల్ల సంస్థ ఆర్థికంగా బలోపేతం కావడానికి మంచి అవకాశం ఏర్పడుతుంది.\u003C\u002Fspan>\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"Screenshot 2026-09-01 125130.jpg",[],{"title":35,"description":36},"TGSRTC కొత్త ప్రయోగం.. బస్సుల్లో మెట్రో తరహా ఏర్పాట్లు!!","తెలంగాణ ఆర్టీసీ(TGRTC) ప్రయాణికులకు అందించే సేవలను మరింత ఆధునీకరించడంతో పాటు, సంస్థకు అదనపు ఆదాయ మార్గాలను సమకూర్చుకోవడానికి ఒక నూతన ప్రాజెక్టుకు శ్రీకారం..",[38,47,53,59,66,72,80,85,91,97],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":44,"published_at":45,"public_read_count":46},"knife-attack-on-police-accused-shot","AP : పోలీసులపై కత్తితో దాడి.. నిందితుడిపై కాల్పులు","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5b32b14d-4ceb-45ed-b9fd-a506b13d512c.jpg","Kumar","3 నిమిషాల పఠనం","2026-09-01T07:27:27+00:00",157,{"slug":48,"title":49,"category":16,"image":50,"author":15,"read_time":25,"published_at":51,"public_read_count":52},"madhuri-rathod-files-complaint-alleging-fraud-folk-dancer-eshwar-sai-absconding","మోసపోయానని మాధురి రాథోడ్ ఫిర్యాదు.. పరారీలో ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3ecef77b-2dcc-4876-8ac7-e01396a5ef13.jpg","2026-09-01T07:44:01+00:00",259,{"slug":54,"title":55,"category":56,"image":57,"author":43,"read_time":25,"published_at":58,"public_read_count":46},"girl-kidnapped-in-patancheru-parents-attacked","Crime :  పటాన్ చెరులో బాలిక కిడ్నాప్..పేరెంట్స్‌పై దాడి!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F46e25576-9949-4393-9b3b-4b44221c3999.jpg","2026-09-01T07:55:04+00:00",{"slug":60,"title":61,"category":16,"image":62,"author":15,"read_time":63,"published_at":64,"public_read_count":65},"chanakya-strategies-1000-days-of-congress-rulewhat-is-the-public-mood-gen-zs-shocking-verdict","Chanakya strategy’s:  వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన.. ప్రజల మూడ్ ఏంటి? జెన్-జీ షాకింగ్ తీర్పు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F733add10-e539-49ec-902a-60ad0f24afe9.png","2 నిమిషాల పఠనం","2026-09-01T08:22:49+00:00",3,{"slug":67,"title":68,"category":16,"image":69,"author":43,"read_time":25,"published_at":70,"public_read_count":71},"minister-konda-sureka-leaves-for-delhi","Breaking : ఢిల్లీకి బయలుదేరిన మంత్రి కొండా","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3051adc2-0a37-4ce0-b176-a20e5afdd7a5.jpg","2026-09-01T08:24:04+00:00",2,{"slug":73,"title":74,"category":75,"image":76,"author":77,"read_time":25,"published_at":78,"public_read_count":79},"varanasi-ott-business","Varanasi: రాజమౌళి సినిమాకి డీల్ కుదరలేదా?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7f8185b7-f6c4-4e22-9486-7b2873cce630.jpg","Anshu","2026-09-01T07:09:51+00:00",55,{"slug":81,"title":82,"category":16,"image":83,"author":43,"read_time":44,"published_at":84,"public_read_count":28},"remand-prisoner-commits-suicide-in-chanchalguda-jail","Hyd :  చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F78e4af72-3122-45c1-a996-2a2c23be8153.jpg","2026-09-01T07:05:34+00:00",{"slug":86,"title":87,"category":88,"image":89,"author":15,"read_time":25,"published_at":90,"public_read_count":28},"is-this-the-reason-for-the-decline-of-pakistan-cricket-former-cricketer-makes-sensational-comments","పాక్ క్రికెట్‌ పతనానికి కారణం ఇదేనా..? మాజీ క్రికెటర్  సంచలన వ్యాఖ్యలు!","sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F88dc5424-22ad-443d-8909-f886ea0bf112.jpg","2026-09-01T06:54:26+00:00",{"slug":92,"title":93,"category":16,"image":94,"author":43,"read_time":25,"published_at":95,"public_read_count":96},"kalyana-lakshmi-shaadi-mubarak-high-court-expresses-anger-over-the-governments-approach","TG : కళ్యాణలక్ష్మి,షాదీముుబారక్‌.. ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఆగ్రహం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7e7c3ba2-c239-4fbe-b0d1-fa89b28e6b39.jpg","2026-09-01T06:50:56+00:00",361,{"slug":98,"title":99,"category":16,"image":100,"author":101,"read_time":102,"published_at":103,"public_read_count":52},"revanth-greater-plan","హైదరాబాద్ చుట్టూ రేవంత్‌ చక్కర్లు.. అసలు లెక్కేంటి?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0b531b5f-b990-4fa6-9578-5eef65a1b6b6.jpg","Kashi","11 నిమిషాల పఠనం","2026-09-01T06:39:19+00:00",[105,110,113,115,117,119],{"title":106,"sponsor":107,"image":108,"url":109},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":111,"sponsor":112,"image":108,"url":109},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":114,"sponsor":112,"image":108,"url":109},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":116,"sponsor":112,"image":108,"url":109},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":118,"sponsor":112,"image":108,"url":109},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":120,"sponsor":112,"image":108,"url":109},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]