[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-tg-sridhar-babu-demands-brs-apology-for-comments-on-telangana-speaker":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":87},5386,1848,"tg-sridhar-babu-demands-brs-apology-for-comments-on-telangana-speaker","TG: స్పీకర్‌పై ఆ మాటలేంటి? కేసీఆర్‌ది బాధ్యత కాదా : శ్రీధర్‌బాబు","TG: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ను ఉద్దేశించి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్‌బాబు తీవ్రంగా స్పందించారు. సభ్య సమాజం అసహ్యించుకునేలా మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ స్పందించాల్సిన బాధ్యత ఉందన్నారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa2590a60-64fb-45bc-b51c-6ffaaf0a4d65.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa2590a60-64fb-45bc-b51c-6ffaaf0a4d65.jpg","Mahesh","telangana","routine",[19,20,21,22,23,24,25],"TG Politics","Telangana Politics","Sridhar Babu","Duddilla Sridhar Babu","KCR","K Chandrashekar Rao","swechaanews.","5 నిమిషాల పఠనం","2026-09-07T16:03:32+00:00","2026-09-07T16:17:00+00:00",208,"\u003Cp>TG: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ను ఉద్దేశించి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్‌బాబు తీవ్రంగా స్పందించారు. సభ్య సమాజం అసహ్యించుకునేలా మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ స్పందించాల్సిన బాధ్యత ఉందన్నారు. కేసీఆర్‌ ఖండించకపోతే ఆ వ్యాఖ్యల వెనుక ఆయన ప్రేరణ ఉందనే అనుమానాలు కలుగుతాయని కామెంట్స్ చేశారు. పార్టీ నేతలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>ఆపోలీసులపై దాడి చేశారని రోపణ\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>అసెంబ్లీ వద్ద చోటుచేసుకున్న పరిణామాలపై శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. కేటీఆర్‌ సహా కొందరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలీసులతో నడుచుకున్న తీరు ఘోరం ఉందన్నారు. యూనిఫామ్‌లో ఉన్న అధికారుల కాలర్‌ పట్టుకోవడం, గొంతు నొక్కినట్లు కనిపించడం మీడియా ఛానెల్స్‌లో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా పోలీసులపై ఇలాంటి ఘటనలు జరగలేదని చెప్పారు.\u003C\u002Fp>\u003Cp>అసెంబ్లీలో బ్యాడ్జీలు, నినాదాలు ఉన్న టీషర్టులను అనుమతించకూడదనే నిబంధనలు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే తీసుకొచ్చారని శ్రీధర్ బాబు గుర్తుచేశారు. వాటికి అనుగుణంగానే తాజాగా స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. లోక్‌సభలో రాహుల్‌గాంధీ వ్యవహారాన్ని కేటీఆర్‌ ప్రస్తావించడాన్ని కూడా శ్రీధర్‌బాబు తప్పుబట్టారు. సభా గౌరవానికి భంగం కలిగించే విధంగా బీఆర్‌ఎస్‌ సభ్యులు టీషర్టులపై నినాదాలు ప్రదర్శించారని అన్నారు.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>స్పీకర్‌కు క్షమాపణ చెప్పాల్సిందే\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>మహిళా సభ్యులకు అసౌకర్యం కలిగిందన్న సమాచారం అందిన వెంటనే సీఎం సమీక్ష నిర్వహించారని శ్రీధర్‌బాబు తెలిపారు. ఏవైనా లోపాలు జరిగితే ప్రభుత్వం వాటిని తీవ్రంగా పరిగణిస్తుందని స్పష్టం చేశారు. తాతా మధు చేసిన కామెంట్స్‌పై బీఆర్‌ఎస్‌ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. స్పీకర్‌ కుటుంబాన్ని అవమానించేలా ఆయన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆయన మాటలతో స్పీకర్‌ బాధపడి, కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పారు.\u003C\u002Fp>\u003Cp>అసెంబ్లీని అవమానించేలా కేటీఆర్‌ కామెంట్స్ చేశారని మంత్రి అన్నారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెడతామంటూ చేస్తున్న హెచ్చరికలకు ప్రభుత్వం భయపడదని స్పష్టం చేశారు. ముందుగా బీఆర్ఎస్ నాయకులు స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలని, ఆ తర్వాతే ఇతర అంశాలపై చర్చ ఉంటుందని అన్నారు. అసెంబ్లీ ప్రాంగణానికి సంబంధించిన పూర్తి అధికారాలు స్పీకర్‌, శాసనమండలి ఛైర్మన్‌కే ఉంటాయని శ్రీధర్‌బాబు గుర్తు చేశారు.\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"WhatsApp Image 2026-09-07 at 9.25.13 PM.jpeg",[],{"title":36,"description":37},"TG: స్పీకర్‌పై ఆ మాటలేంటి? కేసీఆర్‌ది బాధ్యత కాదా : శ్రీధర్","TG: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ను ఉద్దేశించి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్‌బాబు తీవ్రంగా స్పందించారు. సభ్య సమాజం అ",[39,47,53,61,68,76,82],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":15,"read_time":44,"published_at":45,"public_read_count":46},"vishwambara-chiranjeevi-vasishta-busy-with-new-projects-release-date-unclear","Vishwambara: ‘విశ్వంభర’ను పక్కన పెట్టారా? వేరే ప్రాజెక్టుల్లో బిజీగా చిరంజీవి-వశిష్ఠ!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa3021682-fe6e-4f1d-8bc0-5cf0f0cd1478.jpg","3 నిమిషాల పఠనం","2026-09-07T16:24:58+00:00",157,{"slug":48,"title":49,"category":16,"image":50,"author":15,"read_time":44,"published_at":51,"public_read_count":52},"tg-bhadrachalam-mla-pa-kalyan-arrested-job-scam-rs-8-crore","TG:  ఉద్యోగాల పేరుతో వసూళ్లు.. ఎమ్మెల్యే పీఏ అరెస్ట్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F585027ec-af01-4121-8102-c4175c7a452e.jpg","2026-09-07T16:40:20+00:00",106,{"slug":54,"title":55,"category":56,"image":57,"author":58,"read_time":44,"published_at":59,"public_read_count":60},"youth-set-fire-self-in-ramayampet-police-station","Fire Self: పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని.. రామాయంపేట పోలీస్ స్టేషన్‌లో కలకలం","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F07788d5c-0097-41d2-a202-a9e1c96190fe.jpg","NK","2026-09-07T15:59:59+00:00",55,{"slug":62,"title":63,"category":42,"image":64,"author":65,"read_time":66,"published_at":67,"public_read_count":52},"sukumar-rc-17-update","Sukumar: RC 17 ఫైనల్ నరేషన్‌కి రెడీ..చరణ్ ఛేంజస్ చెప్పకపోతే డిసెంబర్ నుంచే..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F160824b1-da02-48db-8dc8-86ecee82962e.jpg","Anshu","4 నిమిషాల పఠనం","2026-09-07T15:44:42+00:00",{"slug":69,"title":70,"category":71,"image":72,"author":73,"read_time":74,"published_at":75,"public_read_count":52},"delhi-hostels-deadly-hostels","7 లక్షల మంది.. 8 వేల గదులు..! ఢిల్లీ హాస్ట‌ళ్ల‌లో విద్యార్థుల ప్రాణాలకు లెక్క లేదా?","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff3e401da-853b-45c0-8f06-f2bb9a8e02ba.jpg","Kashi","10 నిమిషాల పఠనం","2026-09-07T15:14:33+00:00",{"slug":77,"title":78,"category":79,"image":80,"author":15,"read_time":26,"published_at":81,"public_read_count":52},"ap-mega-dsc-sports-quota-posts-shap-md-barani-clarity","AP: డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పోస్టులు సరైనవే : శాప్‌ ఎండీ","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2f1acc56-01b5-445b-8f5b-cefd234ad6f7.webp","2026-09-07T15:08:30+00:00",{"slug":83,"title":84,"category":42,"image":85,"author":65,"read_time":66,"published_at":86,"public_read_count":60},"nani-srikanth-odela-x","Nani-Srikanth Odela: ప్యారడైజ్ పోస్ట్ పోన్..(X)లో క్లారిటీ ఇచ్చిన మేకర్స్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F2eaa898f-30a1-44fa-98d0-1f2fc22992f7.webp","2026-09-07T14:57:00+00:00",[88,93,96,98,100,102],{"title":89,"sponsor":90,"image":91,"url":92},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":94,"sponsor":95,"image":91,"url":92},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":97,"sponsor":95,"image":91,"url":92},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":99,"sponsor":95,"image":91,"url":92},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":101,"sponsor":95,"image":91,"url":92},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":103,"sponsor":95,"image":91,"url":92},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]