[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-tg-purification-politics-kcr-silence-causing-more-damage":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":36,"sponsored_content":101},5595,1951,"tg-purification-politics-kcr-silence-causing-more-damage","TG: శుద్ధి రాజకీయాలు.. కేసీఆర్‌ మౌనంతో మరింత డ్యామేజ్‌..?","TG: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా బీఆర్‌ఎస్‌ పక్కా వ్యూహ రచనతో ముందుకు వెళ్లింది. బ్లాక్ టీషర్టులు వేసుకొని అసెంబ్లీకి రావడంతో నిరసనకు శ్రీకారం చుట్టింది గులాబీ దళం. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ అధికార పక్షాన్ని నిలదీయాలన్నది ఆ పార్టీ వ్యూహంగా కనిపించింది. అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు గులాబీ క్యాంపు‌కు అనూహ్యమైన ఇబ్బందులను తీసుకొచ్చాయి.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F09b46f6b-0924-435c-b8ee-b1e5bb6cdb9d.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F09b46f6b-0924-435c-b8ee-b1e5bb6cdb9d.jpg","Mahesh","telangana","routine",[19,20,21,22,23,24],"Telangana Politics","TG News","BRS","KCR","Revanth Reddy","swechaanews","5 నిమిషాల పఠనం","2026-09-09T15:07:21+00:00","2026-09-09T17:11:39+00:00",106,"\u003Cp>TG: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా బీఆర్‌ఎస్‌ పక్కా వ్యూహ రచనతో ముందుకు వెళ్లిందన్న విశ్లేషణ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. బ్లాక్ టీషర్టులు వేసుకొని అసెంబ్లీకి రావడంతో నిరసనకు శ్రీకారం చుట్టింది గులాబీ దళం. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ అధికార పక్షాన్ని నిలదీయాలన్నది ఆ పార్టీ వ్యూహంగా కనిపించింది. అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు గులాబీ క్యాంపు‌నకు అనూహ్యమైన ఇబ్బందులను తీసుకొచ్చాయని చెప్పాలి.\u003C\u002Fp>\u003Cp>అసెంబ్లీ గేటు వద్ద జరిగిన ఉద్రిక్తత సమయంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు.. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు రాజకీయ దుమారం రేపాయి. ఈ వ్యవహారంపై కేసు నమోదు కావడంతో పాటు తాతా మధు, మరో ఎమ్మెల్సీ నవీన్‌ కుమార్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి, అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై రిలీజ్ చేశారు. దీంతో ప్రభుత్వం మీద పోరాటం చేయాలనుకున్న గులాబీ పార్టీ నాయకులు.. తమ నేతల కామెంట్స్‌పై వివరణ ఇవ్వాల్సిన పరిస్థితిలో పడ్డారు.\u003C\u002Fp>\u003Cp>ఇదే సమయంలో ఆ వివాదం కాస్త మరో మలుపు తిరిగింది. కాంగ్రెస్‌ నేతలు, దళిత సంఘాల కార్యకర్తలు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ వైపు డప్పులతో నిరసన చేపట్టారు. తాతా మధు వ్యాఖ్యలపై కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలన్న డిమాండ్‌తో ఈ ఆందోళన జరిగింది. అక్కడ ఉద్రిక్తత నెలకొనగా.. అనంతరం బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కాంగ్రెస్‌ కార్యకర్తలు వెళ్లిన దారిలో పసుపు నీటిని చల్లి ‘శుద్ధి’ చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన సెగ ఇప్పుడు అసెంబ్లీ వరకు చేరింది.\u003C\u002Fp>\u003Cp>తాజా పరిణామాన్ని కాంగ్రెస్‌ రాజకీయంగా పెద్ద అస్త్రంగా మలుచుకుంటోంది. దళితులు తిరిగిన ప్రాంతాన్ని పసుపు నీటితో శుద్ధి చేయడం వారి ఆత్మగౌరవాన్ని అవమానించడమేనని అధికార పార్టీ నేతలు శాసనసభ సాక్షిగా విమర్శిస్తున్నారు. అయితే అసలు సమస్యలను పక్కదారి పట్టించేందుకు హస్తం పార్టీ ఈ అంశాన్ని ఉపయోగించుకుంటోందని బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగింది. దీంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది.\u003C\u002Fp>\u003Cp>ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు అందరి దృష్టి గులాబీ బాస్ కేసీఆర్‌ వైపు మళ్లింది. పార్టీ అధినేతగా ఆయన నుంచి స్పష్టమైన స్పందన వస్తుందా? తాతా మధు వ్యాఖ్యలపై ఏదైనా వివరణ ఇస్తారా? ఎర్రవల్లి ఘటనపై పార్టీ వైఖరిని వెల్లడిస్తారా? అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. మరోవైపు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌తో అసెంబ్లీ పోరు మరింత తీవ్ర రూపం దాల్చింది.\u003C\u002Fp>\u003Cp>ఇలాంటి టైంలో కేసీఆర్‌ మౌనంగా ఉంటే .. కాంగ్రెస్‌కు అది మరింత అవకాశం ఇచ్చినట్లే అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొదట ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్న లక్ష్యంతో మొదలైన బీఆర్‌ఎస్‌ పోరాటం.. ఇప్పుడు నేతల కామెంట్స్, ఎర్రవల్లి శుద్ధి ఘటన చుట్టూ తిరుగుతోంది. ఈ చర్యలతో పార్టీకి వాటిల్లే నష్టాన్ని తగ్గించేందుకు కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగుతారా? లేకపోతే లైట్ తీసుకుంటారా? అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"1788722853946_kcr-to-launch-street-protests-over-kaleshwaram-pa.jpg",[],{"title":11,"description":35},"TG: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా బీఆర్‌ఎస్‌ పక్కా వ్యూహ రచనతో ముందుకు వెళ్లింది. బ్లాక్ టీషర్టులు వేసుకొని అస",[37,44,51,57,62,70,78,84,89,95],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":15,"read_time":25,"published_at":42,"public_read_count":43},"pf-withdrawal-rules-how-many-times-can-you-withdraw-pf-money-new-epfo-rules","PF : డబ్బు ఎన్ని సార్లు తీసుకోవచ్చు? కొత్త రూల్స్ ఇవే!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffb96b4e5-c8cb-4cdf-a91f-3176a9c87615.jpg","2026-09-09T15:43:35+00:00",157,{"slug":45,"title":46,"category":16,"image":47,"author":48,"read_time":25,"published_at":49,"public_read_count":50},"mlc-vijayashanthimlc-vijayashanthi-request-cm-revanth-to-take-action-on-private-hospitals-robbery","ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై విజయశాంతి ఫైర్.. రేవంత్ సర్కార్‌కు కీలక విన్నపం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F50f174c3-0369-4f79-bd4f-762e03b59e85.jpg","NK","2026-09-09T16:19:56+00:00",4,{"slug":52,"title":53,"category":16,"image":54,"author":15,"read_time":55,"published_at":56,"public_read_count":28},"tg-konda-surekha-former-osd-sumanth-granted-anticipatory-bail","TG :  కొండా సురేఖ మాజీ OSD సుమంత్‌కు ముందస్తు బెయిల్..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd31bacf4-c83a-4414-ab27-186375aac406.jpg","4 నిమిషాల పఠనం","2026-09-09T16:21:32+00:00",{"slug":58,"title":59,"category":40,"image":60,"author":15,"read_time":55,"published_at":61,"public_read_count":43},"petrol-diesel-price-hormuz-tensions-crude-oil-price-shock","Petrol-Diesel Price : హార్ముజ్‌లో మళ్లీ టెన్షన్.. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9f3d55f2-f6b2-4e0d-b2da-bce11915686d.jpg","2026-09-09T16:53:57+00:00",{"slug":63,"title":64,"category":40,"image":65,"author":66,"read_time":67,"published_at":68,"public_read_count":69},"ai-powerd-aadhar","ఆధార్‌కు AI పవర్..! ఇక‌పై రోజుకు 30 కోట్ల వెరిఫికేషన్లు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff41994e7-41e8-4fb1-9c94-08a864553cb0.jpg","Kashi","9 నిమిషాల పఠనం","2026-09-09T17:32:14+00:00",1,{"slug":71,"title":72,"category":73,"image":74,"author":75,"read_time":55,"published_at":76,"public_read_count":77},"ranabaali-teaser-vijay","Ranabaali Teaser: సింగనమల బొబ్బిలి 'రణబాలి' గా విజయ్ విశ్వరూపం","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdbf36c37-e44f-4527-8f26-15522aa4d1be.webp","Anshu","2026-09-09T14:26:38+00:00",412,{"slug":79,"title":80,"category":16,"image":81,"author":48,"read_time":82,"published_at":83,"public_read_count":50},"good-news-for-ap-telangana-cabinet-clears-8-railway-multitracking-projects","ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. కొత్త రైల్వే లైన్లకు ఆమోదం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4e45d981-b3a9-4df1-b1bd-620f9ec970a5.jpg","3 నిమిషాల పఠనం","2026-09-09T14:24:27+00:00",{"slug":85,"title":86,"category":16,"image":87,"author":15,"read_time":55,"published_at":88,"public_read_count":28},"alleti-maheshwar-reddy-revanth-reddy-rule-book-suspensions","Alleti Maheshwar Reddy: రేవంత్‌ రెడ్డి కొత్తగా \"రూల్‌ బుక్‌\" ఏమైనా పెట్టుకున్నారా?’.. మహేశ్వర్‌ రెడ్డి ప్రశ్న..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc041fdac-8953-49c7-956b-dc7671aaa7f2.jpg","2026-09-09T14:08:55+00:00",{"slug":90,"title":91,"category":92,"image":93,"author":15,"read_time":25,"published_at":94,"public_read_count":43},"ttd-srivari-bhakthulaku-lic-beema-2-lakshala-bima","TTD: శ్రీవారి భక్తులకు ఎల్‌ఐసీతో బీమా.. గుడ్‌న్యూస్ చెప్పిన టీటీడీ..","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbd9f52c0-5fd2-44e8-892e-1e87e76eb48d.jpg","2026-09-09T13:29:36+00:00",{"slug":96,"title":97,"category":73,"image":98,"author":75,"read_time":55,"published_at":99,"public_read_count":100},"suriya-47-secene","Suriya: నవంబర్ లో 'సీన్' చూపించబోతున్న సూర్య..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3ba4f3ed-a439-4a4b-8161-e477a14b6761.webp","2026-09-09T13:29:25+00:00",55,[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]