[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-tg-politics-konda-surekha-dismissal-revanth-reddy-message-to-congress-leaders":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":84},5233,1771,"tg-politics-konda-surekha-dismissal-revanth-reddy-message-to-congress-leaders","TG Politics: సురేఖ బర్తరఫ్‌.. వాళ్లందరికీ రేవంత్ సైలెంట్ వార్నింగ్‌..?","తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ బర్తరఫ్‌ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడం వెనుక పార్టీ క్రమశిక్షణ అంశం మాత్రమే కాకుండా.. తనపై బహిరంగంగా విమర్శలు చేస్తున్న నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి ఒక పరోక్ష సందేశం ఇచ్చారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4c1c9e89-f3b8-4a60-a8cf-32989435d65b.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4c1c9e89-f3b8-4a60-a8cf-32989435d65b.jpg","Mahesh","telangana","routine",[19,20,21,22,23,24,25],"TG Politics","Telangana Politics","Konda Surekha","Revanth Reddy","Telangana Congress","Congress","Congress Internal Politics","4 నిమిషాల పఠనం","2026-09-06T09:50:17+00:00","2026-09-06T09:52:12+00:00",55,"\u003Cp>TG Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ బర్తరఫ్‌ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడం వెనుక పార్టీ క్రమశిక్షణ అంశం మాత్రమే కాకుండా.. తనపై బహిరంగంగా విమర్శలు చేస్తున్న నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి ఒక పరోక్ష సందేశం ఇచ్చారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా కాంగ్రెస్‌ పార్టీలో సీఎం రేవంత్‌రెడ్డిపై కొందరు సీనియర్ నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. \u003C\u002Fp>\u003Cp>ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు మరికొందరు తెలంగాణ కాంగ్రెస్ నేతలు వివిధ సందర్భాల్లో ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీ వ్యవహారాలపై తమ అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించారు. అయితే ఇప్పుడు అధిష్ఠానం కొండా సురేఖపై తీసుకున్న చర్యతో, ముఖ్యమంత్రి నాయకత్వంపై, కాంగ్రెస్ పార్టీ పాలనపై బహిరంగంగా ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేసే వారు ఇకపై కాస్త జాగ్రత్తగా ఉండాలనే సంకేతం వెళ్లిందా? అనే చర్చ ఇప్పుడు ప్రముఖంగా జరుగుతోంది. \u003C\u002Fp>\u003Cp>ముఖ్యంగా పార్టీ, ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న మంత్రి.. సీఎం నాయకత్వంలో పనిచేస్తూ బహిరంగంగా వివాదానికి కేంద్రంగా మారితే చర్యలు తప్పవనే మెసేజ్‌ను సురేఖ వ్యవహారం ద్వారా ఇచ్చారనే విశ్లేషణలు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. సురేఖ ఎపిసోడ్ తర్వాత కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డిపై బహిరంగ విమర్శలు చేస్తున్న నేతల వైఖరి ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. \u003C\u002Fp>\u003Cp>ఇప్పటి వరకు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించిన ఆ నేతలు.. సురేఖపై అధిష్ఠానం తీసుకున్న చర్యతో తమకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందనే ఆలోచన చేస్తారా? లేక తమ మాటలను గతంలో చెప్పినట్లుగానే కొనసాగిస్తారా? అనేది వేచి చూడాలి. మొత్తంగా కొండా సురేఖ బర్తరఫ్‌ ఒక వ్యక్తిపై తీసుకున్న చర్యగానేనా? లేక కాంగ్రెస్‌లో అంతర్గత క్రమశిక్షణకు రేవంత్‌రెడ్డి గట్టి సంకేతం ఇచ్చారా? అనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"revanth-reddy-1.jpg",[],{"title":36,"description":37},"TG Politics: సురేఖ బర్తరఫ్‌.. వాళ్లందరికీ రేవంత్ సైలెంట్ వార","తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ బర్తరఫ్‌ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడం వెనుక పార్టీ క్రమశిక్షణ",[39,46,53,60,66,73,79],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":44,"read_time":26,"published_at":45,"public_read_count":29},"delhi-pg-pg-hostel-collapses-50-students-trapped-under-the-debris","Delhi: కూలిన PG హోస్టల్..  శిథిలాల కింద చిక్కుకున్న 50 మంది విద్యార్థులు!..","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Feddac82d-fcea-4a23-9afe-f3d251c6bc53.jpg","Venu","2026-09-06T10:30:41+00:00",{"slug":47,"title":48,"category":49,"image":50,"author":15,"read_time":26,"published_at":51,"public_read_count":52},"the-paradise-nani-low-promotions-release-15-days-away","The Paradise: ది ప్యారడైజ్ ప్రమోషన్లు డల్‌.. నాని కావాలనే తగ్గించాడా?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd0cce4ee-fdc6-4f7a-a00f-30215452a698.webp","2026-09-06T10:50:14+00:00",0,{"slug":54,"title":55,"category":16,"image":56,"author":57,"read_time":26,"published_at":58,"public_read_count":59},"date-finalized-for-monsoon-season-paddy-procurement-key-decision-by-the-revanth-government","వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు ముహూర్తం ఖరారు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9ea2b103-a775-4e7c-ba35-e5eacd812882.jpg","Mamatha puppala","2026-09-06T09:29:44+00:00",106,{"slug":61,"title":62,"category":16,"image":63,"author":57,"read_time":26,"published_at":64,"public_read_count":65},"dgp-takes-a-serious-view-of-forced-extortion-by-transgender-individuals-issues-key-directives","ట్రాన్స్‌జెండర్ల బలవంతపు వసూళ్లపై డీజీపీ సీరియస్.. కీలక ఆదేశాలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4a740b9e-157c-4250-b3ff-f98fff21ef02.jpg","2026-09-06T09:13:48+00:00",157,{"slug":67,"title":68,"category":16,"image":69,"author":70,"read_time":71,"published_at":72,"public_read_count":59},"revanths-words-build-castles-in-the-air-while-students-futures-remain-stuck-at-the-doorstep-harish-rao","BRS : రేవంత్ మాటలు కోటలు.. గడప దాటని విద్యార్థుల భవిష్యత్ : హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcedfba72-0f95-4722-8527-bf0651fa4e8e.webp","Kumar","7 నిమిషాల పఠనం","2026-09-06T08:57:54+00:00",{"slug":74,"title":75,"category":16,"image":76,"author":15,"read_time":77,"published_at":78,"public_read_count":29},"konda-surekha-political-future-brs-bjp-no-entry","Konda Surekha: సురేఖను చేర్చుకునేది లేదంటున్న బీఆర్ఎస్‌, బీజేపీ.. ఆమె దారెటు?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4ad42f68-4b6b-4903-8ff6-252a1963ae86.webp","6 నిమిషాల పఠనం","2026-09-06T08:52:36+00:00",{"slug":80,"title":81,"category":42,"image":82,"author":57,"read_time":26,"published_at":83,"public_read_count":59},"creating-wonders-by-learning-from-youtubeprime-minister-praises-kadapa-farmer-in-mann-ki-baat","యూట్యూబ్ చూసి వండర్స్.. మన్ కీ బాత్‌లో కడప రైతుకు ప్రధాని ప్రశంసలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F332a5bcf-0662-4dc6-9041-003bec96446b.jpg","2026-09-06T08:51:19+00:00",[85,90,93,95,97,99],{"title":86,"sponsor":87,"image":88,"url":89},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":91,"sponsor":92,"image":88,"url":89},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":94,"sponsor":92,"image":88,"url":89},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":96,"sponsor":92,"image":88,"url":89},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":98,"sponsor":92,"image":88,"url":89},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":100,"sponsor":92,"image":88,"url":89},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]