[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-tg-politics-congress-brs-bjp-public-meetings-telangana-political-heat":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":32,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":33,"read_next":36,"sponsored_content":90},5155,1734,"tg-politics-congress-brs-bjp-public-meetings-telangana-political-heat","TG Politics: ప్రజల్లోకి అన్ని పార్టీలు.. హీటెక్కుతున్న తెలంగాణ రాజకీయాలు","తెలంగాణలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ.. మూడు పార్టీలు ఒకేరోజు ప్రజల్లోకి దిగి పరస్పర విమర్శలతో హీట్ పెంచాయి. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విపక్షాలు మాట్లాడితే.. తమ పాలనను ఎలివేట్ చేస్తూ అధికార కాంగ్రెస్ పార్టీ కౌంటర్ అటాక్‌కి దిగడంతో రాష్ట్రంలో పొలిటికల్ ఫైట్ మరింత రసవత్తరంగా మారింది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff2947a56-473e-4a09-bd57-0c5efbd37b1f.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff2947a56-473e-4a09-bd57-0c5efbd37b1f.jpg","Mahesh","telangana","routine",[19,20,21,22,23],"Telangana Politics","TG Politics","Telangana Congress","BRS","BJP Telangana","5 నిమిషాల పఠనం","2026-09-05T16:45:36+00:00","2026-09-05T16:46:30+00:00",55,"\u003Cp>TG Politics: తెలంగాణలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ.. మూడు పార్టీలు ఒకేరోజు ప్రజల్లోకి దిగి పరస్పర విమర్శలతో హీట్ పెంచాయి. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విపక్షాలు మాట్లాడితే.. తమ పాలనను ఎలివేట్ చేస్తూ అధికార కాంగ్రెస్ పార్టీ కౌంటర్ అటాక్‌కి దిగడంతో రాష్ట్రంలో పొలిటికల్ ఫైట్ మరింత రసవత్తరంగా మారింది. శనివారం రాష్ట్రంలో జరిగిన మూడు పార్టీల కార్యక్రమాలు.. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలు మరింత హీట్ ఎక్కబోతున్నాయనే సంకేతాలు ఇచ్చినట్లు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.\u003C\u002Fp>\u003Cp>కరీంనగర్‌లో బీఆర్ఎస్ యువ సమరభేరీ \u003C\u002Fp>\u003Cp>కరీంనగర్‌లో నిర్వహించిన యువ సమరభేరీలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేయడాన్ని ప్రశ్నించారు. నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించిన ఆయన.. నోటిఫికేషన్ల పేరుతో ‘లూటిఫికేషన్’ జరుగుతోందంటూ మండిపడ్డారు. ఒక్క మంత్రిని కాదు.. త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వాన్నే ప్రజలు బర్తరఫ్ చేస్తారని వ్యాఖ్యానించారు.\u003C\u002Fp>\u003Cp>హైదరాబాద్‌లో బీజేపీ మహాధర్నా \u003C\u002Fp>\u003Cp>మరోవైపు హైదరాబాద్‌లో బీజేపీ నిర్వహించిన మహాధర్నాలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండింటినీ టార్గెట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 22ఏ నిషేధిత జాబితా పేరుతో ప్రజల భూములను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం భూములు అమ్మడమేనని విమర్శించారు.\u003C\u002Fp>\u003Cp>నకిరేకల్ సభలో సీఎం కౌంటర్\u003C\u002Fp>\u003Cp>ఇక ఈ రోజు నకిరేకల్ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌పై ఎదురుదాడికి దిగారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తూ.. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన ప్రజలకు వివరించారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో సిరిసిల్ల, సిద్దిపేటలోనూ కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మొత్తంగా.. మూడు ప్రధాన పార్టీలు ఒకేరోజు ప్రజల్లోకి రావడం, పరస్పర విమర్శలకు దిగడంతో తెలంగాణ రాజకీయాల్లో రాబోయే ఎన్నికల వేడి కొంచెం ముందుగానే మొదలైనట్లుగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఎన్నికల నాటికి ఈ వేడి మరింత పెరిగే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయని వారు చెబుతున్నారు.\u003C\u002Fp>",[30],{"url":13,"name":31},"4efebbb3-bf09-4597-9166-e6df9a9f88eb.jpg",[],{"title":34,"description":35},"TG Politics: ప్రజల్లోకి అన్ని పార్టీలు.. హీటెక్కుతున్న తెలంగ","తెలంగాణలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ.. మూడు పార్టీలు ఒకేరోజు ప్రజల్లోకి దిగి పరస్పర విమర్శలతో హీట్ పెంచాయి. ప్రభుత్వాన్ని ట",[37,45,53,59,67,73,78,83],{"slug":38,"title":39,"category":40,"image":41,"author":42,"read_time":43,"published_at":44,"public_read_count":27},"modi-warning-to-pak","ఘర్ మే ఘుస్కే మారేంగే! పాక్‌కు మోదీ స్ట్రాంగ్ వార్నింగ్","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6fc08e14-c8b9-4485-80ad-e655cef705cf.jpg","Kashi","8 నిమిషాల పఠనం","2026-09-05T17:02:12+00:00",{"slug":46,"title":47,"category":16,"image":48,"author":49,"read_time":50,"published_at":51,"public_read_count":52},"govt-special-focus-on-kollapur-development-says-minister-jupally-krishna-rao","Jupally Krishna Rao: రహదారుల అభివృద్ధికి రూ.600 కోట్లు.. రూ.200కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్.. కొల్లాపూర్‌ సమగ్ర అభివృద్ధే లక్ష్యం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fba16de59-48ef-498f-9d3e-5cab10359188.jpg","NK","10 నిమిషాల పఠనం","2026-09-05T17:07:23+00:00",4,{"slug":54,"title":55,"category":16,"image":56,"author":49,"read_time":57,"published_at":58,"public_read_count":27},"will-not-leave-revanth-reddy-govt-bjp-mp-eatala-rajender-strong-warning","Eatala Rajender: రేవంత్ సర్కార్ గద్దె దిగేవరకు విశ్రమించేది లేదు- ఈటల శపథం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0017d57b-7a0f-4b9a-9ebe-8af2d36a87fd.jpg","12 నిమిషాల పఠనం","2026-09-05T17:24:40+00:00",{"slug":60,"title":61,"category":62,"image":63,"author":64,"read_time":65,"published_at":66,"public_read_count":27},"vaishnavi-chaitanya-epic","Vaishnavi Chaitanya: అప్పుడు అవమానించారు..ఇప్పుడు హీరోయిన్ అంటున్నారు!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6fddafce-0c2e-423c-92c6-1365265bb2da.jpg","Anshu","4 నిమిషాల పఠనం","2026-09-05T16:38:34+00:00",{"slug":68,"title":69,"category":70,"image":71,"author":15,"read_time":65,"published_at":72,"public_read_count":52},"tg-safe-raids-719-476-150-1760-21-12-14","TG SAFE Raids: పనీర్‌లో పామాయిల్.. డెయిరీల్లో బొద్దింకలు! హైదరాబాద్‌ సోదాల్లో బయటపడ్డ షాకింగ్ నిజాలు..","health","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa8668f45-cc81-4b36-a556-30d4782e4acc.webp","2026-09-05T16:34:48+00:00",{"slug":74,"title":75,"category":16,"image":76,"author":49,"read_time":65,"published_at":77,"public_read_count":52},"cm-revanth-reddy-open-challenge-to-ktr-and-harish-rao-in-nakrekal-public-meeting","Cm Revanth Reddy: ఇక దండయాత్రే.. సిరిసిల్ల, సిద్ధిపేట వస్తున్నా- సీఎం రేవంత్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fda9c2543-01ac-47e9-8860-7fe56660ae61.jpg","2026-09-05T16:18:57+00:00",{"slug":79,"title":80,"category":16,"image":81,"author":15,"read_time":65,"published_at":82,"public_read_count":52},"telangana-politics-komatireddy-rajagopal-reddy-closeness-with-revanth-reddy-sparks-cabinet-expansion-talk","TG Politics: రేవంత్ - రాజగోపాల్ రెడ్డి మంతనాలు.. మంత్రి పదవి ఖాయమేనా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc6771609-0b62-407a-9be7-c1c710cd4263.jpg","2026-09-05T15:48:02+00:00",{"slug":84,"title":85,"category":16,"image":86,"author":87,"read_time":88,"published_at":89,"public_read_count":27},"cm-revanth-reddy-makes-key-remarks-on-free-bus-travel","Revanth Reddy: ఉచిత బస్సు ‎పై సీఎం రేవంత్ రెడ్డి కీలకవ్యాఖ్యలు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fec00b4a1-4cfa-471d-bad8-328bed1ff55a.png","Venu","3 నిమిషాల పఠనం","2026-09-05T15:40:09+00:00",[91,96,99,101,103,105],{"title":92,"sponsor":93,"image":94,"url":95},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":97,"sponsor":98,"image":94,"url":95},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":100,"sponsor":98,"image":94,"url":95},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":102,"sponsor":98,"image":94,"url":95},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":104,"sponsor":98,"image":94,"url":95},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":106,"sponsor":98,"image":94,"url":95},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]