[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-tg-eravalli-tension-congress-workers-protest-kcr-farmhouse":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":100},5473,1890,"tg-eravalli-tension-congress-workers-protest-kcr-farmhouse","TG : ఎర్రవల్లిలో హైటెన్షన్.. కేసీఆర్ ఫామ్‌హౌస్‌ వైపు కాంగ్రెస్‌ శ్రేణుల దూకుడు!","TG: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ వద్ద డప్పుల మోత కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ పిలుపునివ్వడంతో భారీ సంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. నిరసనలో భాగంగా డప్పులు మోగిస్తూ ఫామ్‌హౌస్‌ వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. వరదరాజపూర్‌ మీదుగా నర్సారెడ్డి ఆధ్వర్యంలో హస్తం పార్టీ శ్రేణులు  ఎర్రవల్లి  ఫామ్‌హౌస్‌ సమీపానికి చేరుకునే ప్రయత్నం చేశాయి.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F22efb5cb-2dbf-4092-b943-cd368a014f9b.webp","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F22efb5cb-2dbf-4092-b943-cd368a014f9b.webp","Mahesh","telangana","routine",[19,20,21,22,23,24,25],"TG Politics","Telangana Politics","Eravalli","Erravalli","KCR","K Chandrashekar Rao","swechaa news","4 నిమిషాల పఠనం","2026-09-08T09:54:52+00:00","2026-09-08T10:02:15+00:00",55,"\u003Cp>TG : సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ వద్ద డప్పుల మోత కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ పిలుపునివ్వడంతో భారీ సంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. నిరసనలో భాగంగా డప్పులు మోగిస్తూ ఫామ్‌హౌస్‌ వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. వరదరాజపూర్‌ మీదుగా నర్సారెడ్డి ఆధ్వర్యంలో హస్తం పార్టీ శ్రేణులు  ఎర్రవల్లి  ఫామ్‌హౌస్‌ సమీపానికి చేరుకునే ప్రయత్నం చేశాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మార్గమధ్యంలో బారికేడ్లు ఏర్పాటు చేసి, రోప్‌ పార్టీతో వారిని అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు, పోలీసుల మధ్య కొద్దిసేపు తోపులాట చోటుచేసుకుంది.\u003C\u002Fp>\u003Cp>ఈ క్రమంలో కొందరు కాంగ్రెస్‌ కార్యకర్తలు బారికేడ్లను దాటుకుని ముందుకు వెళ్లారు. ఫామ్‌హౌస్‌కు సుమారు అర కిలోమీటర్‌ దూరం వరకు చేరుకుని డప్పులు మోగిస్తూ నిరసన వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని వారిని వెనక్కి తీసుకొచ్చారు. ఆందోళనకారులను నిలువరించే క్రమంలో పలువురు పోలీసులకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. మరోవైపు డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి కూడా పోలీసుల ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుని ఫామ్‌హౌస్‌ వైపు వెళ్లేందుకు యత్నించారు. దీంతో అక్కడ కొద్దిసేపు పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.\u003C\u002Fp>\u003Cp>ఇదిలా ఉండగా మర్కుక్‌ వద్ద బీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీగా మోహరించాయి. ఫామ్‌హౌస్‌ సమీపంలో రైతు దీక్ష పేరుతో గులాబీ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో ఎర్రవల్లి, మర్కుక్‌ పరిసరాల్లో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కార్యక్రమాలతో ఎర్రవల్లి ప్రాంతంలో ఈ రోజు ఉదయం నుంచే ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"erravalli.webp",[],{"title":36,"description":37},"TG: ఎర్రవల్లిలో హైటెన్షన్.. కేసీఆర్ ఫామ్‌హౌపు కాంగ్రెస్‌ శ్ర","TG: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ వద్ద డప్పుల మోత కార్యక్రమానికి కాంగ్రెస్‌ పా",[39,46,53,58,66,71,77,83,90,95],{"slug":40,"title":41,"category":16,"image":42,"author":43,"read_time":26,"published_at":44,"public_read_count":45},"instead-of-apologizing-they-are-sidetracking-the-issue-speaker-prasad-kumar","క్షమాపణ చెప్తారనుకుంటే పక్కదోవ పట్టిస్తున్నారు: స్పీకర్  ప్రసాద్‌ కుమార్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F72d9201c-ffc4-4f94-af64-3c8d2294d21d.jpg","Mamatha puppala","2026-09-08T09:56:12+00:00",208,{"slug":47,"title":48,"category":49,"image":50,"author":51,"read_time":26,"published_at":52,"public_read_count":29},"ntr-neel-rfc","NTR-NEEL: హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో \"డ్రాగన్\" ఎంట్రీ..","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fce50a288-4a96-4bf1-b3f9-70eccf724eda.webp","Anshu","2026-09-08T10:37:49+00:00",{"slug":54,"title":55,"category":16,"image":56,"author":15,"read_time":26,"published_at":57,"public_read_count":29},"telangana-police-jobs-7437-posts-application-deadline-extended","TG: అలర్ట్‌.. పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగింపు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4689fab0-1e2c-4945-b394-a541dfe2ae06.jpg","2026-09-08T10:59:50+00:00",{"slug":59,"title":60,"category":16,"image":61,"author":62,"read_time":63,"published_at":64,"public_read_count":65},"mla-kunamneni-sambasiva-rao-demand-for-action-on-brs-mlc-tata-madhu","క్షమాపణ చెప్పించి ఉంటే కేసీఆర్ హుందాతనం పెరిగేది- కూనంనేబి సాంబశివరావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5c26ad6c-4032-4f95-93af-fcdd72e4c185.jpg","NK","5 నిమిషాల పఠనం","2026-09-08T10:59:59+00:00",4,{"slug":67,"title":68,"category":16,"image":69,"author":62,"read_time":26,"published_at":70,"public_read_count":65},"harish-rao-demand-for-presidents-rule-in-telangana","Harish Rao: తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టాలి- హరీశ్ రావు సంచలన డిమాండ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Feaf6f684-53b5-4929-b81b-918781175dfc.jpg","2026-09-08T11:22:46+00:00",{"slug":72,"title":73,"category":16,"image":74,"author":43,"read_time":26,"published_at":75,"public_read_count":76},"are-these-the-last-five-years-to-make-money-debate-over-elon-musks-comments","డబ్బు సంపాదించడానికి ఈ ఐదేళ్లే ఆఖరి అవకాశమా..? ఎలాన్ మస్క్ వ్యాఖ్యలపై చర్చ!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5d43d355-93e2-4646-8c8c-96fae9a798bd.jpg","2026-09-08T09:22:34+00:00",259,{"slug":78,"title":79,"category":16,"image":80,"author":15,"read_time":63,"published_at":81,"public_read_count":82},"assembly-debate-legislatures-for-public-voice-or-political-battlefield","Assembly Debate: చట్టసభలు.. ప్రజల గొంతుకల కోసమా? రాజకీయ పార్టీల రణరంగం కోసమా?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9f82afdd-90cf-450a-975b-34d213192822.webp","2026-09-08T09:09:55+00:00",157,{"slug":84,"title":85,"category":16,"image":86,"author":87,"read_time":26,"published_at":88,"public_read_count":89},"kcrs-conspiracy-to-push-dalits-125-feet-deep-government-wh","Congress : దళితులను 125 అడుగుల లోతుకు తొక్కేందుకు కేసీఆర్ కుట్ర  : ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb81943ae-7a30-4e1c-92c3-6f01463a697b.jpg","Kumar","2026-09-08T09:05:17+00:00",310,{"slug":91,"title":92,"category":16,"image":93,"author":87,"read_time":63,"published_at":94,"public_read_count":82},"we-know-how-to-protect-kcr-jagadish-reddy","BRS : కేసీఆర్‌ను ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు : జగదీశ్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd0a1b017-2369-4c48-bd7c-ef48dd887ae1.jpg","2026-09-08T08:51:03+00:00",{"slug":96,"title":97,"category":49,"image":98,"author":51,"read_time":63,"published_at":99,"public_read_count":29},"naga-vamshi","Naga Vamshi: హీరోలు, డైరెక్టర్స్ కంటే హీరోయిన్లే బిజీ..!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1a1d1c4f-0c58-442b-8313-1e8fd6ced21d.jpg","2026-09-08T08:47:11+00:00",[101,106,109,111,113,115],{"title":102,"sponsor":103,"image":104,"url":105},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":107,"sponsor":108,"image":104,"url":105},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":110,"sponsor":108,"image":104,"url":105},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":112,"sponsor":108,"image":104,"url":105},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":114,"sponsor":108,"image":104,"url":105},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":116,"sponsor":108,"image":104,"url":105},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]