[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-telangana-politics-komatireddy-rajagopal-reddy-closeness-with-revanth-reddy-sparks-cabinet-expansion-talk":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":103},5147,1730,"telangana-politics-komatireddy-rajagopal-reddy-closeness-with-revanth-reddy-sparks-cabinet-expansion-talk","TG Politics: రేవంత్ - రాజగోపాల్ రెడ్డి మంతనాలు.. మంత్రి పదవి ఖాయమేనా?","తెలంగాణ రాజకీయాల్లో తాజాగా ఓ ఆసక్తికర సీన్ చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. నకిరేకల్ సభలో మాత్రం అందుకు భిన్నంగా కనిపించారు. సీఎం రేవంత్ రెడ్డి పక్కనే కూర్చొని ఆయనతో పదేపదే మాట్లాడుతూ కనిపించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc6771609-0b62-407a-9be7-c1c710cd4263.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc6771609-0b62-407a-9be7-c1c710cd4263.jpg","Mahesh","telangana","routine",[19,20,21,22,23,24],"Telangana Politics","Revanth Reddy","Komatireddy","Rajagopal Reddy","Telangana Congress","Congress MLAs","4 నిమిషాల పఠనం","2026-09-05T15:48:02+00:00","2026-09-05T15:49:12+00:00",4,"\u003Cp>TG:తెలంగాణ రాజకీయాల్లో తాజాగా ఓ ఆసక్తికర సీన్ చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. నకిరేకల్ సభలో మాత్రం అందుకు భిన్నంగా కనిపించారు. సీఎం రేవంత్ రెడ్డి పక్కనే కూర్చొని ఆయనతో పదేపదే మాట్లాడుతూ కనిపించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు.. తన ప్రసంగం ప్రారంభంలో రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరును ప్రస్తావించగానే సభలో కాంగ్రెస్ కార్యకర్తలు ఈలలు, అరుపులతో హోరెత్తించారు. దీంతో సీఎం కాసేపు తన ప్రసంగాన్ని నిలిపివేయాల్సి వచ్చింది.\u003C\u002Fp>\u003Cp>ఇటీవల వరకు రేవంత్ ప్రభుత్వ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, కొన్ని సందర్భాల్లో సీఎంపైనే నేరుగా విమర్శలు చేసిన నేతగా రాజగోపాల్ రెడ్డి పేరు వినిపించింది. అలాంటి నేత ఇప్పుడు సీఎంతో ఇంత సన్నిహితంగా కనిపించడం వెనుక రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా? అనే చర్చ మొదలైంది. \u003C\u002Fp>\u003Cp>ముఖ్యంగా ఇటీవల చోటుచేసుకున్న మాజీ మంత్రి కొండా సురేఖ వ్యవహారం కూడా ఈ చర్చకు మరింత ఊతమిస్తోంది. కొండా దంపతులకు రాజగోపాల్ రెడ్డి మద్దతు ఉందనే వాదనలు అప్పట్లో రాజకీయ వర్గాల నుంచి వినిపించాయి. కొండా సురేఖ కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సురేఖ మంత్రి పదవిని కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల మధ్య త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉండొచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే రాజగోపాల్ రెడ్డి పేరు మంత్రి పదవి రేసులో వినిపిస్తోంది. తాజాగా నకిరేకల్ సభలో రేవంత్‌తో ఆయన కనిపించిన తీరు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.\u003C\u002Fp>\u003Cp>అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖరారైందనే విషయంపై అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. సీఎం రేవంత్ రెడ్డితో ఆయన సాన్నిహిత్యం కేవలం రాజకీయ మర్యాద మాత్రమేనా.. లేక కేబినెట్ విస్తరణకు ముందు జరిగిన కీలక మంతనాలా అన్నది మాత్రం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది. చూడాలి మరి ఎప్పటి నుంచో మంత్రి కావాలని కలలు కంటున్న రాజగోపాల్ రెడ్డికి ఈ సారి అదృష్టం కలిసి వస్తుందా లేదా అనేది.\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"WhatsApp Image 2026-09-05 at 9.05.26 PM.jpeg",[],{"title":35,"description":36},"TG Politics: రేవంత్ - రాజగోపాల్ రెడ్డి మంతనాలు.. మంత్రి పదవి","తెలంగాణ రాజకీయాల్లో తాజాగా ఓ ఆసక్తికర సీన్ చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిర",[38,44,50,58,64,73,80,85,90,96],{"slug":39,"title":40,"category":16,"image":41,"author":42,"read_time":25,"published_at":43,"public_read_count":28},"cm-revanth-reddy-open-challenge-to-ktr-and-harish-rao-in-nakrekal-public-meeting","Cm Revanth Reddy: ఇక దండయాత్రే.. సిరిసిల్ల, సిద్ధిపేట వస్తున్నా- సీఎం రేవంత్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fda9c2543-01ac-47e9-8860-7fe56660ae61.jpg","NK","2026-09-05T16:18:57+00:00",{"slug":45,"title":46,"category":47,"image":48,"author":15,"read_time":25,"published_at":49,"public_read_count":28},"tg-safe-raids-719-476-150-1760-21-12-14","TG SAFE Raids: పనీర్‌లో పామాయిల్.. డెయిరీల్లో బొద్దింకలు! హైదరాబాద్‌ సోదాల్లో బయటపడ్డ షాకింగ్ నిజాలు..","health","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fa8668f45-cc81-4b36-a556-30d4782e4acc.webp","2026-09-05T16:34:48+00:00",{"slug":51,"title":52,"category":53,"image":54,"author":55,"read_time":25,"published_at":56,"public_read_count":57},"vaishnavi-chaitanya-epic","Vaishnavi Chaitanya: అప్పుడు అవమానించారు..ఇప్పుడు హీరోయిన్ అంటున్నారు!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6fddafce-0c2e-423c-92c6-1365265bb2da.jpg","Anshu","2026-09-05T16:38:34+00:00",55,{"slug":59,"title":60,"category":16,"image":61,"author":15,"read_time":62,"published_at":63,"public_read_count":57},"tg-politics-congress-brs-bjp-public-meetings-telangana-political-heat","TG Politics: ప్రజల్లోకి అన్ని పార్టీలు.. హీటెక్కుతున్న తెలంగాణ రాజకీయాలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff2947a56-473e-4a09-bd57-0c5efbd37b1f.jpg","5 నిమిషాల పఠనం","2026-09-05T16:45:36+00:00",{"slug":65,"title":66,"category":67,"image":68,"author":69,"read_time":70,"published_at":71,"public_read_count":72},"modi-warning-to-pak","ఘర్ మే ఘుస్కే మారేంగే! పాక్‌కు మోదీ స్ట్రాంగ్ వార్నింగ్","international","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6fc08e14-c8b9-4485-80ad-e655cef705cf.jpg","Kashi","8 నిమిషాల పఠనం","2026-09-05T17:02:12+00:00",1,{"slug":74,"title":75,"category":16,"image":76,"author":77,"read_time":78,"published_at":79,"public_read_count":57},"cm-revanth-reddy-makes-key-remarks-on-free-bus-travel","Revanth Reddy: ఉచిత బస్సు ‎పై సీఎం రేవంత్ రెడ్డి కీలకవ్యాఖ్యలు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fec00b4a1-4cfa-471d-bad8-328bed1ff55a.png","Venu","3 నిమిషాల పఠనం","2026-09-05T15:40:09+00:00",{"slug":81,"title":82,"category":53,"image":83,"author":15,"read_time":25,"published_at":84,"public_read_count":28},"shekar-master-complaint-against-jani-master-wife-sumalatha-and-senior-dancer-lakshmi","Shekar Master: జానీ మాస్టర్ భార్యపై శేఖర్ మాస్టర్ ఫిర్యాదు.. అసలు వివాదం ఏంటంటే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F66719081-c2a3-4410-ad34-24f4223727d7.webp","2026-09-05T15:21:58+00:00",{"slug":86,"title":87,"category":16,"image":88,"author":42,"read_time":78,"published_at":89,"public_read_count":28},"cm-revanth-reddy-open-challenge-to-kcr","90 సీట్లు.. లేదంటే 117 సీట్లు.. దేక్ లేంగే కేసీఆర్- సీఎం రేవంత్ సవాల్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3a5a14b0-c8f0-4fc2-9be2-c652ea5d732b.jpg","2026-09-05T15:15:57+00:00",{"slug":91,"title":92,"category":93,"image":94,"author":77,"read_time":25,"published_at":95,"public_read_count":57},"vijayawada-gold-scam-at-indrakeeladri-behavior-unchanged-despite-suspension","Vijayawada: ఇంద్రకీలాద్రిపై గోల్డ్ స్కాం.. సస్పెండ్ చేసినా మారని తీరు!..","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F506fab8f-a0fa-485e-876d-d95e787f209d.webp","2026-09-05T14:44:01+00:00",{"slug":97,"title":98,"category":99,"image":100,"author":15,"read_time":101,"published_at":102,"public_read_count":28},"sir-effect-reunites-brothers-after-35-years-in-haryanasir-effect-35","SIR Effect: 35 ఏళ్ల తర్వాత అన్నదమ్ములను కలిపిన \"సర్\"","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7222e672-515a-4c69-b854-0637d40e4ab9.jpg","6 నిమిషాల పఠనం","2026-09-05T14:31:23+00:00",[104,109,112,114,116,118],{"title":105,"sponsor":106,"image":107,"url":108},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":110,"sponsor":111,"image":107,"url":108},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":113,"sponsor":111,"image":107,"url":108},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":115,"sponsor":111,"image":107,"url":108},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":117,"sponsor":111,"image":107,"url":108},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":119,"sponsor":111,"image":107,"url":108},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]