[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-telangana-kcr-sensational-decision-entering-the-public-arena-with-that-very-issue-as-a-weapon":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":27,"published_at":28,"updated_at":29,"public_read_count":30,"body":31,"images":32,"video_url":5,"video_urls":35,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":36,"read_next":39,"sponsored_content":101},5253,1781,"telangana-kcr-sensational-decision-entering-the-public-arena-with-that-very-issue-as-a-weapon","Telangana: కేసీఆర్ సంచలన నిర్ణయం.. ఆ అంశమే ఆయుధంగా ప్రజాక్షేత్రంలోకి!..","ఒకవైపు అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్‌ను కడిగిపారేయడం, మరోవైపు రోడ్డెక్కి సర్కార్ వైఫల్యాలను ఎండగట్టడం అనే ద్వంద్వ వ్యూహంతో కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో మొదలవుతున్న అసంతృప్తిని క్యాష్ చేసుకోవడంతో పాటు, ఓటమితో డీలా పడిన తన క్యాడర్‌లో నూతన ఉత్సాహం నింపడమే ఈ మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్న రహస్యంగా తెలుస్తుంది.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdfadd3c6-1dfc-42eb-aeaf-4b12a1ee5d17.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdfadd3c6-1dfc-42eb-aeaf-4b12a1ee5d17.jpg","Venu","telangana","routine",[19,20,21,22,23,24,25,26],"Telangana","Politics","BRS","KCR Padayatra","Erravalli","Farmhouse","congress","revanth reddy","5 నిమిషాల పఠనం","2026-09-06T13:22:15+00:00","2026-09-06T13:23:22+00:00",106,"\u003Cp>తెలంగాణ రాజకీయాలు ఇక నుండి మరింత హీట్ ఎక్కేలా కనిపిస్తున్నాయి.. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య రాజకీయం మళ్లీ పీక్స్‌కు చేరింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఇప్పుడు ఊహించని ఎత్తుగడలతో వ్యూహాలకు పదును పెట్టారు. ఇన్నాళ్లూ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారన్న విమర్శలకు చెక్ పెడుతూ, నేరుగా కాంగ్రెస్ సర్కార్ వైఫ్యల్యాలపై రణభేరి మోగించారు.\u003C\u002Fp>\u003Cp>ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తోందంటూ గళమెత్తిన గులాబీ అధినేత, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, ఏకంగా లక్ష మందితో కలిసి కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను సందర్శిస్తానని ప్రకటించి హస్తం నేతలకు షాక్ ఇచ్చారు.\u003C\u002Fp>\u003Cp>అంతేకాదు, 'నీళ్ల కోసం పాదయాత్ర' పేరిట భారీ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఒకవైపు అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్‌ను కడిగిపారేయడం, మరోవైపు రోడ్డెక్కి సర్కార్ వైఫల్యాలను ఎండగట్టడం అనే ద్వంద్వ వ్యూహంతో కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో మొదలవుతున్న అసంతృప్తిని క్యాష్ చేసుకోవడంతో పాటు, ఓటమితో డీలా పడిన తన క్యాడర్‌లో నూతన ఉత్సాహం నింపడమే ఈ మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్న రహస్యంగా తెలుస్తుంది. \u003C\u002Fp>\u003Cp>ఇన్నాళ్లూ కేసీఆర్ మౌనాన్ని బలహీనతగా భావించిన కాంగ్రెస్ నాయకులకు, ఈ సరికొత్త ఆపరేషన్ పెద్ద సవాలుగా మారనుందనే చర్చలు అప్పుడే మొదలైయ్యాయి.. ఇక రానున్న రోజుల్లో సాగునీటి అంశం పై కేసీఆర్ వేస్తున్న ఈ పావులు తెలంగాణ రాజకీయాల్లో కొత్త కోణాన్ని చూపించబోతున్నాయా? అనేలా సాగుతాయని అంతా భావిస్తున్నారు.. మరోవైపు గతంలో కూడా కేసీఆర్ ప్రజల మధ్యకు వచ్చి.. సమస్యలపై పోరాడుతా అని పెద్ద పెద్ద స్టేట్ మెంట్లు ఇచ్చి మళ్ళీ ఫామ్‌హౌస్ కే పరిమితం అయిన సందర్భాలున్నాయి..\u003C\u002Fp>\u003Cp>తాజాగా నీళ్ల కోసం త్వరలోనే భారీ పాదయాత్ర కూడా చేపడతానని ప్రకటించడం.. గత నేపథ్యాన్ని గమనిస్తే కాస్త విడ్డూరంగా అనిపించవచ్చు. కానీ.. ఇప్పటి నుంచి ప్రజల్లో యాక్టివ్ కాకుండా.. కేవలం ప్రకటనలకే పరిమితమైతే రాజకీయంగా ఎదురుదెబ్బ తప్పదనే భావనతోనే ఆయన కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ప్రజా సమస్యలపై ప్రత్యక్షంగా పోరాటాలు చేస్తూ.. క్షేత్రస్థాయిలో తన ఉనికిని చాటుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ పాదయాత్రతో ప్రజల్లో ఎంతవరకు స్పందన తీసుకురాగలరు.. ఆయన రాజకీయ వ్యూహం ఏ మేరకు వర్కౌట్ అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.\u003C\u002Fp>",[33],{"url":13,"name":34},"CM-KCR-2.jpg",[],{"title":37,"description":38},"కేసీఆర్ సంచలన నిర్ణయం.. ఆ అంశమే ఆయుధంగా ప్రజాక్షేత్రంలోకి!..","ఒకవైపు అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్‌ను కడిగిపారేయడం, మరోవైపు రోడ్డెక్కి సర్కార్ వైఫల్యాలను ఎండగట్టడం అనే ద్వంద్వ వ్యూహంతో కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న",[40,47,52,60,66,71,77,83,88,95],{"slug":41,"title":42,"category":16,"image":43,"author":44,"read_time":27,"published_at":45,"public_read_count":46},"telangana-tenders-for-369-new-public-ev-charging-stations","TG: తెలంగాణలో 369 కొత్త ఛార్జింగ్ స్టేషన్లకు టెండర్లు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcd92523e-470c-45ab-807a-cbdde603aff8.jpg","Mahesh","2026-09-06T13:56:11+00:00",55,{"slug":48,"title":49,"category":16,"image":50,"author":44,"read_time":27,"published_at":51,"public_read_count":46},"kcr-directs-brs-mlas-mlcs-to-target-congress-government-on-public-issues","TG: అసెంబ్లీలో నా గురించి వద్దు.. సమస్యలపైనే పోరాడాలి : కేసీఆర్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F50221f99-b508-44b3-a63a-10b941a9e68c.webp","2026-09-06T14:25:39+00:00",{"slug":53,"title":54,"category":55,"image":56,"author":57,"read_time":58,"published_at":59,"public_read_count":46},"nandamuri-mokshagna","Nandamuri Mokshagna: అగ్ర నిర్మాణ సంస్థలో నందమూరి వారసుడి డెబ్యూ కన్‌ఫర్మ్","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F6fe1e476-900e-499e-9eb7-15caff86c42a.webp","Anshu","4 నిమిషాల పఠనం","2026-09-06T14:37:54+00:00",{"slug":61,"title":62,"category":16,"image":63,"author":44,"read_time":58,"published_at":64,"public_read_count":65},"rs-praveen-kumar-questions-police-over-hyderabad-pub-incident","TG: ‘పబ్‌ ఘటనపై FIR ఎందుకు నమోదు కాలేదు?’: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fc4cf62f8-27e9-46e4-b175-b2c5c9738df8.webp","2026-09-06T15:11:29+00:00",1,{"slug":67,"title":68,"category":55,"image":69,"author":57,"read_time":58,"published_at":70,"public_read_count":65},"balakrishna-nbk111-dada","Balakrishna: \"NBK111\" టైటిల్ రిలీజ్..\"దాదా\" వచ్చేస్తున్నాడు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd2a55d2d-b4ea-4874-8547-a329cbbca712.webp","2026-09-06T15:12:27+00:00",{"slug":72,"title":73,"category":74,"image":75,"author":44,"read_time":27,"published_at":76,"public_read_count":30},"palghar-hospital-attack-shiv-sena-workers-assault-doctors-staff-case-filed","Palghar Hospital Attack: ఐసీయూలోకి చొరబడి.. డాక్టర్లపై శివసేన నాయకుల దాడి","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff38e7951-20ab-4ef2-9dda-ee5322d02dd9.webp","2026-09-06T13:01:18+00:00",{"slug":78,"title":79,"category":55,"image":80,"author":57,"read_time":58,"published_at":81,"public_read_count":82},"krish-jagarlamudi-gen-z-batch","krish Jagarlamudi: ఫ్లాప్స్ ప్రభావం..కొత్త వాళ్ళతో మొదటి సినిమాలా ప్రయత్నం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F147a971f-0276-4f91-a912-d117f68a11a8.jpg","2026-09-06T12:13:05+00:00",208,{"slug":84,"title":85,"category":16,"image":86,"author":44,"read_time":58,"published_at":87,"public_read_count":30},"kcr-should-resign-as-mla-mahesh-kumar-goud-demands-at-indira-park-protest","TG: కేసీఆర్‌పై మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఫైర్.. ప్రతిపక్ష నేత హోదాకు న్యాయం చేయాలని డిమాండ్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ff33258f0-82f0-48ba-a855-b8d82943886f.jpg","2026-09-06T12:10:40+00:00",{"slug":89,"title":90,"category":91,"image":92,"author":93,"read_time":58,"published_at":94,"public_read_count":30},"viral-duleep-trophy-final-tilak-varma-teases-vaibhav-suryavanshi","VIRAL: దులీప్ ట్రోఫీ ఫైనల్.. వైభవ్ సూర్యవంశీని ఆటపట్టించిన తిలక్ వర్మ!","sports","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb745877f-2374-4329-900c-aba187138ba5.jpg","Mamatha puppala","2026-09-06T11:59:00+00:00",{"slug":96,"title":97,"category":16,"image":98,"author":44,"read_time":27,"published_at":99,"public_read_count":100},"ys-sharmila-daughter-anjali-reddy-engaged-to-dr-somala-raghuram-reddy","ys sharmila: వైఎస్ షర్మిల కూతురు వివాహం.. ఎవరీ రఘురామ్..?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5fe8254d-5cbb-490f-ba2e-7d99ee189892.jpg","2026-09-06T11:37:01+00:00",4,[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]