[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-telangana-government-efforts-to-trace-and-evacuate-state-residents-stranded-in-nepal-flash-floods":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":25,"published_at":26,"updated_at":27,"public_read_count":28,"body":29,"images":30,"video_url":5,"video_urls":33,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":34,"read_next":37,"sponsored_content":99},4275,1307,"telangana-government-efforts-to-trace-and-evacuate-state-residents-stranded-in-nepal-flash-floods","Nepal Flash Floods: నేపాల్ వరదల్లో తెలంగాణ వాసులు.. ఢిల్లీలో రేవంత్ సర్కార్ ప్రత్యేక హెల్ప్ లైన్, కంట్రోల్ రూమ్","నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలంగాణ పర్యాటకులు, యాత్రికులు, ఇతర పౌరుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణ వాసుల కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు అందించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ప్రాథమికంగా 23 మంది తెలంగాణ వాసులను గుర్తించినట్లు మంత్రి వెల్లడించారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F62bb65fc-a37e-4bff-97ae-a6de72a5db5f.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F62bb65fc-a37e-4bff-97ae-a6de72a5db5f.jpg","NK","telangana","routine",[19,20,21,22,23,24],"Nepal Flash Floods","Telangana Govt","Telangana Tourists","Cm Revanth Reddy","Ponguleti Srinivas Reddy","Swechaa News","8 నిమిషాల పఠనం","2026-08-27T14:50:58+00:00","2026-08-27T14:52:12+00:00",106,"\u003Cp>\u003Cstrong>* నేపాల్ వరదల నేపథ్యంలో తెలంగాణ ప్రజల భద్రతకు రేవంత్ ప్రభుత్వం చర్యలు.. \u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>* ప్రత్యేక హెల్ప్‌లైన్, కంట్రోల్ రూమ్‌\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>* నేపాల్‌లో చిక్కుకున్న 23మంది తెలంగాణ వాసులు\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>* యాత్రికుల వివరాలను కేంద్రానికి పంపిన రాష్ట్ర ప్రభుత్వం\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>* ఢిల్లీలోని తెలంగాణ భవన్, సచివాలయంలో ప్రత్యేక హెల్ప్‌లైన్, కంట్రోల్ రూమ్‌లు\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>* కేంద్ర విదేశాంగ శాఖ, భారత రాయబార కార్యాలయంతో నిరంతర సమన్వయం\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>* కుటుంబ సభ్యులు ఆందోళన చెందొద్దు-మంత్రి పొంగులేటి\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>Nepal Flash Floods: నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలంగాణ పర్యాటకులు, యాత్రికులు, ఇతర పౌరుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణ వాసుల కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు అందించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ప్రాథమికంగా 23 మంది తెలంగాణ వాసులను గుర్తించినట్లు మంత్రి వెల్లడించారు. \u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>కేంద్రానికి తెలంగాణ యాత్రికుల వివరాలు\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>గుర్తించిన వారి వివరాలను కేంద్ర విదేశాంగ శాఖకు పంపామన్నారు. వారి ప్రస్తుత పరిస్థితి, ఆచూకీ తెలుసుకోవడంతో పాటు అవసరమైన సాయం అందించేందుకు కేంద్ర విదేశాంగ శాఖ, కాఠ్మాండు భారత రాయబార కార్యాలయం, నేపాల్ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం సమన్వయం చేస్తోందని మంత్రి వెల్లడించారు.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>ఢిల్లీలో ప్రత్యేక హెల్ప్‌ లైన్, కంట్రోల్ రూమ్\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>నేపాల్‌లో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌ లైన్, కోఆర్డినేషన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. అదే విధంగా హైదరాబాద్‌లోని డా.బీ.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో సాధారణ పరిపాలన శాఖ (NRI విభాగం) ఆధ్వర్యంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, బాధితుల కుటుంబాల నుంచి సమాచారం సేకరించి సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తున్నట్లు వివరించారు. నేపాల్ లో నెలకొన్న పరిస్థితులు, అక్కడ తెలంగాణ వాసులు ఎంతమంది ఉండే అవకాశం ఉంది వంటి అంశాలపై డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధికారులతో గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి పొంగులేటి.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>నేపాల్ లో చిక్కుకున్న 23మంది తెలంగాణ వాసులు\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>నేపాల్‌లో నెలకొన్న పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా పర్యవేక్షిస్తోందని మంత్రి పొంగులేటి తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు అందించిన సమాచారంతో 23 మంది తెలంగాణ వాసులను ప్రాథమికంగా గుర్తించామన్నారు. వారి వివరాలను కేంద్ర ప్రభుత్వానికి పంపించామన్నారు. వారి ఆచూకీ, భద్రతపై కేంద్ర అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తున్నట్లు పేర్కొన్నారు. \u003C\u002Fp>\u003Cp>ఇంకా ఎవరైనా తెలంగాణ వాసులు నేపాల్‌లో చిక్కుకున్నట్లయితే వారి కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వానికి సమాచారం అందించాలని ఆయన కోరారు. బాధితుల పేరు, పాస్‌పోర్ట్ వివరాలు, మొబైల్ నెంబర్, నేపాల్‌లో చివరగా ఉన్న ప్రదేశం, ట్రావెల్\u002Fటూర్ ఆపరేటర్ వివరాలు, కుటుంబ సభ్యుల సంప్రదింపు నెంబర్లు అందిస్తే సంబంధిత అధికారులతో సమన్వయం చేసి అవసరమైన సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి చెప్పారు. \u003C\u002Fp>\u003Cp>తెలంగాణ భవన్ అధికారులు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA), కాఠ్మాండు భారత రాయబార కార్యాలయం, నేపాల్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే వరకు తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి, రాష్ట్రానికి చెందిన ప్రతి ఒక్కరి భద్రతకు అవసరమైన సాయాన్ని అందిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>తెలంగాణ భవన్ ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>📞 9871999044\u003C\u002Fp>\u003Cp>📞 9949351270\u003C\u002Fp>\u003Cp>📞 9618597969\u003C\u002Fp>\u003Cp>\u003Cstrong>తెలంగాణ సచివాలయం ప్రత్యేక కంట్రోల్ రూమ్\u003C\u002Fstrong>\u003C\u002Fp>\u003Cp>నేపాల్‌లో చిక్కుకున్న లేదా ప్రభావితమైన తెలంగాణ ప్రజల కుటుంబ సభ్యులు సమాచారం కోసం అధికారులను సంప్రదించవచ్చు:\u003C\u002Fp>\u003Cp>ఎస్. లక్ష్మీనారాయణ-అసిస్టెంట్ సెక్రటరీ\u003C\u002Fp>\u003Cp>📞 9885371189\u003C\u002Fp>\u003Cp>కె. శ్రీనివాస్ రెడ్డి-సెక్షన్ ఆఫీసర్\u003C\u002Fp>\u003Cp>📞 7997959754\u003C\u002Fp>\u003Cp>ఇ. చిట్టిబాబు-సెక్షన్ ఆఫీసర్\u003C\u002Fp>\u003Cp>📞 9440854433\u003C\u002Fp>\u003Cp>నేపాల్‌లో చోటు చేసుకున్న విషాదకర పరిస్థితులపై మంత్రి పొంగులేటి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విపత్తులో చిక్కుకున్న తెలంగాణ ప్రజలకు సాధ్యమైనంత త్వరగా సాయం అందేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, నేపాల్‌లో చిక్కుకున్న వ్యక్తుల కుటుంబసభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.\u003C\u002Fp>",[31],{"url":13,"name":32},"Nepal Floods.jpg",[],{"title":35,"description":36},"Nepal Flash Floods: నేపాల్ వరదల్లో తెలంగాణ వాసులు.. ఢిల్లీలో","నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలంగాణ పర్యాటకులు, యాత్రికులు, ఇతర పౌరుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష",[38,46,52,61,66,72,79,85,89,94],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":15,"read_time":43,"published_at":44,"public_read_count":45},"cm-revanth-heartfelt-rakhi-purnima-greetings-to-women","అక్క‌ చెల్లెమ్మల‌కు సీఎం రేవంత్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F8b331260-cf4d-475a-a3a3-01b5bccc587e.jpg","2 నిమిషాల పఠనం","48 నిమిషాలు క్రితం",55,{"slug":47,"title":48,"category":41,"image":49,"author":15,"read_time":50,"published_at":51,"public_read_count":45},"acb-officials-raids-targeting-mines-ad-bojja-jayaraj","ACB Raids: తాండూరులో ఏసీబీ సోదాల కలకలం.. మైన్స్‌ ఏడీ బొజ్జ జయరాజ్‌ ఆస్తులపై మెరుపు దాడులు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F074bc4cd-3213-4457-8850-0e199136fc69.jpg","9 నిమిషాల పఠనం","55 నిమిషాలు క్రితం",{"slug":53,"title":54,"category":55,"image":56,"author":57,"read_time":58,"published_at":59,"public_read_count":60},"obc-census-row-cong-vs-bjp","కులగణనపై కొత్త రగడ.. మోదీ సర్కార్‌కు రాహుల్ బిగ్ క్వ‌శ్చ‌న్!","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5c589f7f-7608-4087-9806-3fceab2feef8.jpg","Kashi","10 నిమిషాల పఠనం","1 గంట క్రితం",616,{"slug":62,"title":63,"category":41,"image":64,"author":15,"read_time":25,"published_at":65,"public_read_count":45},"cm-revanth-reddy-reviews-plans-to-develop-mir-alam-tank","Mir Alam Tank: మిర్ ఆలం చెరువుకు స‌ర్కార్ కొత్త హంగులు, ఫ్యామిలీ టూరిస్ట్ హ‌బ్‌గా డెవ‌ల‌ప్‌మెంట్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5e653f23-ea32-4b41-853c-346d67a6d3d6.jpg","2 గంటలు క్రితం",{"slug":67,"title":68,"category":41,"image":69,"author":15,"read_time":70,"published_at":71,"public_read_count":45},"fight-with-govt-for-pending-bills-says-jadcherla-mla-janampalli-anirudh-reddy","Mla Anirudh Reddy: పెండింగ్ బిల్లుల కోసం దీక్షకు దిగుతా, మహిళలు కన్నీరు పెడితే సునామీ వస్తుంది- ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F936aa533-d5c2-445b-9974-9d6d22a72865.jpg","5 నిమిషాల పఠనం","3 గంటలు క్రితం",{"slug":73,"title":74,"category":75,"image":76,"author":77,"read_time":78,"published_at":71,"public_read_count":28},"rajinikanth-vs-vijay-devarakonda-2","Rajinikanth vs Vijay Devarakonda: జైలర్ 2తో రణబాలి పోటీ..తేడా కొడితే?","Cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F701bbaf4-a696-4728-80aa-13900abcb2c6.jpg","Anshu","4 నిమిషాల పఠనం",{"slug":80,"title":81,"category":82,"image":83,"author":15,"read_time":78,"published_at":84,"public_read_count":45},"landt-renewables-business-wins-order-for-battery-energy-storage-system-in-middle-east","L&T: మిడిల్ ఈస్ట్‌లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్.. భారీ ఆర్డర్ దక్కించుకున్న L&T రెన్యూవబుల్స్ వ్యాపార విభాగం","Business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fcb144965-95bd-4304-be63-50661716432b.jpg","4 గంటలు క్రితం",{"slug":86,"title":87,"category":75,"image":88,"author":77,"read_time":78,"published_at":84,"public_read_count":28},"toxic-yash-day-1-150","Toxic-Yash: Day 1 కలెక్షన్స్ 150 కోట్లు..ఇది కేవలం యష్ సత్తా మాత్రమే","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F2a3620e4-2c1c-44e3-9080-89756bd1ca81.jpg",{"slug":90,"title":91,"category":41,"image":92,"author":15,"read_time":93,"published_at":84,"public_read_count":28},"brs-chief-kavitha-sensational-allegations-on-harish-rao","Kavitha: బీఆర్ఎస్‌ను హస్తగతం చేసుకునేందుకు గుంటనక్క కుట్ర- కవిత సంచలన వ్యాఖ్యలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F44148379-8757-498b-9821-87aeb6bb27e9.jpg","13 నిమిషాల పఠనం",{"slug":95,"title":96,"category":75,"image":97,"author":77,"read_time":78,"published_at":98,"public_read_count":45},"toxic-loss-effects","Toxic: వంద కోట్ల లాసైనా భారించాల్సింది వాళ్ళిద్దరే?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F286bc1af-e2a6-4ba9-97a4-79670f6c3faa.jpg","5 గంటలు క్రితం",[100,105,108,110,112,114],{"title":101,"sponsor":102,"image":103,"url":104},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":106,"sponsor":107,"image":103,"url":104},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":109,"sponsor":107,"image":103,"url":104},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":111,"sponsor":107,"image":103,"url":104},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":113,"sponsor":107,"image":103,"url":104},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":115,"sponsor":107,"image":103,"url":104},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]