[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-team-india-in-high-spirits-gill-delighted-with-the-series-win-over-sri-lanka":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":37,"sponsored_content":101},4349,1342,"team-india-in-high-spirits-gill-delighted-with-the-series-win-over-sri-lanka","ఫుల్ జోష్‌లో టీమిండియా.. లంకపై సిరీస్ గెలుపుతో గిల్ ఆనందం!","శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తో సొంతం చేసుకోవడంతో టీమిండియా ఫుల్ జోష్‌లో ఉంది. ఈ విజయం పట్ల భారత యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంతోషం వ్యక్తం చేశాడు. రెండో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ, ఈ పర్యటన ద్వారా భారత జట్టుకు పలువురు అత్యుత్తమ యువ ఆటగాళ్లు దక్కారని కొనియాడాడు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F878cb065-33e7-4d18-9b51-fb48ae5d3acf.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F878cb065-33e7-4d18-9b51-fb48ae5d3acf.jpg","Mamatha puppala","sports","routine",[19,20,21,22,23,24,25],"ShubmanGill","DevduttPadikkal","ManavSuthar","INDvsSL","TestCricket","IndianCricket","swechaanews","4 నిమిషాల పఠనం","2026-08-28T08:52:43+00:00","2026-08-28T08:52:59+00:00",106,"\u003Cp>\u003Cspan>&nbsp;శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తో సొంతం చేసుకోవడంతో టీమిండియా ఫుల్ జోష్‌లో ఉంది. ఈ విజయం పట్ల భారత యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంతోషం వ్యక్తం చేశాడు. రెండో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ, ఈ పర్యటన ద్వారా భారత జట్టుకు పలువురు అత్యుత్తమ యువ ఆటగాళ్లు దక్కారని కొనియాడాడు. ముఖ్యంగా బ్యాటింగ్‌లో దేవ్‌దత్ పడిక్కల్, బౌలింగ్‌లో మానవ్ సుతార్ చూపించిన అద్భుత ప్రదర్శనలు టీమిండియాకు కొత్త బలాన్నిచ్చాయని వ్యాఖ్యానించాడు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;సాయి సుదర్శన్ స్థానంలో మూడో నంబర్‌ స్థానంలో బరిలోకి దిగిన దేవ్‌దత్ పడిక్కల్ ఈ సిరీస్‌లో పరుగుల వరద పారించాడు. రెండు భారీ సెంచరీలతో ఏకంగా 328పరుగులు సాధించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. క్రీజులో నిలదొక్కుకున్నాక పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడాలనే ప్రణాళికను పడిక్కల్ మైదానంలో పక్కాగా అమలు చేశాడని గిల్ కొనియాడాడు. మరోవైపు, &nbsp;ఎడమచేతి వాటం స్పిన్ ఆల్‌రౌండర్ మానవ్ సుతార్ బౌలింగ్‌ విభాగాన్ని ముందుండి నడిపించాడు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;ఈ సిరీస్‌లో ఏకంగా 16 వికెట్లు పడగొట్టిన సుతార్, గాలే టెస్టులో ఏకంగా 10వికెట్ల మైలురాయిని అందుకుని భారత్‌ను 165పరుగుల భారీ తేడాతో గెలిపించాడు. భవిష్యత్తులో భారత స్పిన్ విభాగానికి సుతార్ దీర్ఘకాలం నాయకత్వం వహించే సత్తా ఉన్న ఆటగాడని కెప్టెన్ గిల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. రెండో టెస్టు చివరి మూడు రోజులు శ్రీలంక ఆటగాళ్లు కనబరిచిన పోరాటపటిమను ప్రశంసించిన గిల్.. ప్రత్యర్థి వ్యూహాల నుంచి కూడా పాఠాలు నేర్చుకుంటామన్నాడు.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;ఈ పర్యటన అందించిన విజయాలు, అనుభవాలు రాబోయే న్యూజిలాండ్ సిరీస్‌లో జట్టు మరింత మెరుగైన ప్రదర్శన చేయడానికి తోడ్పడతాయని ధీమా వ్యక్తం చేశాడు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ వేగంగా పరుగులు సాధించి డిక్లేర్ చేసినప్పటికీ, శ్రీలంక బ్యాటర్లు నిలకడగా ఆడి మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. అయినప్పటికీ, ఆసియా ఖండంలోని కష్టతరమైన పిచ్‌లపై మన యువ క్రికెటర్లు ఒత్తిడిని జయించి రాణించడం భారత క్రికెట్ భవిష్యత్తుకు శుభసూచకమని విశ్లేషకులు భావిస్తున్నారు.\u003C\u002Fspan>\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"444587-shubman-gill-.jpg",[],{"title":11,"description":36},"శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తో సొంతం చేసుకోవడంతో టీమిండియా ఫుల్ జోష్‌లో ఉంది. ఈ విజయం పట్ల భారత యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంతోషం వ్యక్తం..",[38,47,55,62,69,75,81,86,91,96],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":44,"published_at":45,"public_read_count":46},"minister-ponguleti-srinivas-reddy-participate-in-lottery-lucky-draw-for-indiramma-houses","Indiramma Houses: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు- మంత్రి పొంగులేటి","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F279c91b4-6789-4982-b1b8-31e6e5025127.jpg","NK","5 నిమిషాల పఠనం","0 సెకన్లు క్రితం",0,{"slug":48,"title":49,"category":50,"image":51,"author":52,"read_time":26,"published_at":53,"public_read_count":54},"ap-government-entrusts-key-responsibilities-to-naga-babu","AP: నాగబాబుకు కీలక బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం!..","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F5f9f766d-f792-45f3-b2c7-954a9d8cde8a.webp","Venu","8 నిమిషాలు క్రితం",1,{"slug":56,"title":57,"category":58,"image":59,"author":52,"read_time":44,"published_at":60,"public_read_count":61},"nepal-flood-early-warnings-about-the-nepal-floods","Nepal Flood: నేపాల్ వరదలపై ముందే హెచ్చరికలు!..","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fec1c1e80-4ea3-4b45-a3ae-ec690270b824.jpg","35 నిమిషాలు క్రితం",55,{"slug":63,"title":64,"category":65,"image":66,"author":15,"read_time":26,"published_at":67,"public_read_count":68},"raksha-bandhan-celebrations-across-the-country-children-tie-rakhis-to-prime-minister-modi","దేశమంతా రక్షాబంధన్ వేడుకలు.. ప్రధాని మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు!","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F79da9bc6-8875-4938-9577-a37492bfab99.jpg","1 గంట క్రితం",361,{"slug":70,"title":71,"category":58,"image":72,"author":52,"read_time":73,"published_at":67,"public_read_count":74},"nepal-flood-a-terrible-tragedy-in-history-a-defeat-faced-by-human-intellect","China Flood: చరిత్రలోనే భయానక విషాదం.. ఓడిపోతున్న మానవ మేధస్సు!..","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe292d735-179e-4994-95de-77c657bd4cdf.jpg","7 నిమిషాల పఠనం",973,{"slug":76,"title":77,"category":41,"image":78,"author":79,"read_time":26,"published_at":67,"public_read_count":80},"police-high-handedness-against-opposition-parties-and-the-public-harish-rao","TG : ప్రతిపక్షాలు, ప్రజలపై పోలీసుల జులుం  : హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa663efef-fc18-4202-ad75-ce8b4b32e19a.webp","Kumar",157,{"slug":82,"title":83,"category":50,"image":84,"author":79,"read_time":26,"published_at":67,"public_read_count":85},"english-nanna-nuvvu-jagratha-dampatula-aakhari-maatalu-viral-dad-take-care-couples-final-words-go-viral","AP : నాన్న నువ్వు జాగ్రత్త.. దంపతుల ఆఖరి మాటలు వైరల్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fe1dfce9c-b656-46ca-bddb-4c8f50933bcb.jpg",208,{"slug":87,"title":88,"category":41,"image":89,"author":79,"read_time":26,"published_at":90,"public_read_count":29},"cis-high-handedness-in-kodad-shoving-women-and-creating-a-ruckus-in-the-middle-of-the-road","TG :  కోదాడలో సీఐ దాష్టీకం.. మహిళలను నెట్టేసి నడిరోడ్డుపై వీరంగం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F6b164760-ed86-490f-8184-206c98791879.jpg","2 గంటలు క్రితం",{"slug":92,"title":93,"category":94,"image":95,"author":15,"read_time":26,"published_at":90,"public_read_count":29},"more-than-just-a-bossai-is-deciding-promotions","బాస్ కాదు అంతకు మించి.. ప్రమోషన్లను నిర్ణయిస్తున్న ఏఐ!","World","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F8dba1662-b0ae-4545-9da4-aa004798f904.jpg",{"slug":97,"title":98,"category":99,"image":100,"author":15,"read_time":44,"published_at":90,"public_read_count":29},"14-day-remand-for-mines-ad-jayaraj-in-disproportionate-assets-case","అక్రమాస్తుల కేసులో మైన్స్ ఏడీ జయరాజ్‌కు 14రోజుల రిమాండ్!","Crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3691f2e6-ebdf-49fc-ad28-f4b4faac9ce1.jpg",[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]