[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-team-india-fever-on-kiwi-soil-26000-tickets-snapped-up-in-just-48-hours":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":38,"sponsored_content":101},4221,1280,"team-india-fever-on-kiwi-soil-26000-tickets-snapped-up-in-just-48-hours","కీవీస్ గడ్డపై 'భారత్' క్రేజ్.. 48 గంటల్లోనే 26 వేల టికెట్లు స్వాహా!","అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియాకున్న తిరుగులేని క్రేజ్ మరోసారి నిరూపితమైంది. ఈ ఏడాది అక్టోబర్‌లో న్యూజిలాండ్‌లో భారత్ జరపనున్న సుదీర్ఘ పర్యటనపై అక్కడి అభిమానులు వీరతాళ్ళు వేస్తున్నారు. న్యూజిలాండ్ క్రికెట్ (NZC) అంతర్జాతీయ సీజన్ టికెట్ల విక్రయాలను ప్రారంభించగా, 'క్రికెట్ నేషన్' సభ్యుల ప్రీ-సేల్ మొదలైన కేవలం 48 గంటల్లోనే రికార్డు స్థాయిలో 26,000 టికెట్లు అమ్ముడయ్యాయి.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F9a50b587-a2db-45e0-8f50-419654503847.png","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F9a50b587-a2db-45e0-8f50-419654503847.png","Mamatha puppala","sports","routine",[19,20,21,22,23,24,25],"IndiavsNZ","NZCricket","TeamIndia","NZTour2026","CricketTickets","EdenPark","swechaanews","5 నిమిషాల పఠనం","2026-08-27T05:40:58+00:00","2026-08-27T05:41:26+00:00",157,"\u003Cp>\u003Cspan>&nbsp;అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియాకున్న తిరుగులేని క్రేజ్ మరోసారి నిరూపితమైంది. ఈ ఏడాది అక్టోబర్‌లో న్యూజిలాండ్‌లో భారత్ జరపనున్న సుదీర్ఘ పర్యటనపై అక్కడి అభిమానులు వీరతాళ్ళు వేస్తున్నారు. న్యూజిలాండ్ క్రికెట్ (NZC) అంతర్జాతీయ సీజన్ టికెట్ల విక్రయాలను ప్రారంభించగా, 'క్రికెట్ నేషన్' సభ్యుల ప్రీ-సేల్ మొదలైన కేవలం 48 గంటల్లోనే రికార్డు స్థాయిలో 26,000 టికెట్లు అమ్ముడయ్యాయి.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;అక్టోబర్ 22 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో భారత్-న్యూజిలాండ్ జట్లు 12 మల్టీ-ఫార్మాట్ మ్యాచ్‌లలో (T20లు, వన్డేలు, టెస్టులు) తలపడనున్నాయి. ముఖ్యంగా ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో జరిగే 4వ T20, 1వ వన్డే మ్యాచ్‌లకు ఊహించని రీతిలో డిమాండ్ నెలకొంది. క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ స్టేడియం (9,000 సీటింగ్ సామర్థ్యం)లో అక్టోబర్ 22, 24 తేదీల్లో జరిగే తొలి రెండు T20లతో పాటు, సిరీస్ ముగింపు టెస్టు (నవంబర్ 27 - డిసెంబర్ 1) మ్యాచ్ టికెట్లు ఇప్పటికే దాదాపు అమ్ముడైపోయాయి.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;వెల్లింగ్టన్‌లోని హెచ్‌ఎన్‌ఆర్‌వై (HNRY) స్టేడియం, చారిత్రాత్మక బేసిన్ రిజర్వ్‌ వేదికలుగా జరిగే మ్యాచ్‌లకు సైతం క్రేజ్ విపరీతంగా పెరిగింది. టికెట్ల ధరలను పెంచకుండా గత సీజన్ ధరలకే (క్రికెట్ నేషన్ కోడ్‌ ద్వారా 30 న్యూజిలాండ్ డాలర్ల లోపే) అందుబాటులో ఉంచామని, అభిమానుల నుంచి లభించిన అపూర్వ స్పందన పట్ల న్యూజిలాండ్ క్రికెట్ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. అభిమానుల కోసం 'ది ఫోర్', 'ది సిక్స్' గ్రూప్ టికెట్ ప్యాకేజీలను అందుబాటులోకి తేవడమే కాకుండా 15 శాతం రాయితీతో ముందస్తు బుకింగ్ అవకాశాన్ని కల్పించారు. సాధారణ ప్రజల కోసం సెప్టెంబర్ 7వ తేదీ నుంచి టికెట్ల విక్రయాలు ప్రారంభం కానున్నాయి.\u003C\u002Fspan>\u003C\u002Fp>\u003Cp>\u003Cspan>&nbsp;అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 1 వరకు జరిగే ఈ 40 రోజుల పర్యటనలో భారత్, న్యూజిలాండ్ జట్లు మొత్తం 12 మ్యాచ్‌ల్లో (5 T20లు, 5 వన్డేలు, 2 టెస్టులు) తలపడనున్నాయి. భారత్-న్యూజిలాండ్ క్రీడా సంబంధాలు 100ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (NZC) ఈ సిరీస్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. అక్టోబర్ 22న క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా తొలి టీ20తో ఈ పర్యటన ప్రారంభం కానుండగా, నవంబర్ 4న ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో తొలి వన్డే, నవంబర్ 19న వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్‌లో మొదటి టెస్టు జరగనున్నాయి. విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ క్రికెటర్లు న్యూజిలాండ్ మైదానాల్లో దిగుతుండటంతో మ్యాచ్ టికెట్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.\u003C\u002Fspan>\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"Screenshot 2026-08-27 111005.png",[],{"title":36,"description":37},"కీవీస్ గడ్డపై 'భారత్' క్రేజ్.. 48 గంటల్లోనే 26 వేల టికెట్లు","అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియాకున్న తిరుగులేని క్రేజ్ మరోసారి నిరూపితమైంది. ఈ ఏడాది అక్టోబర్‌లో న్యూజిలాండ్‌లో భారత్ జరపనున్న సుదీర్ఘ పర్యటనపై అక్కడి..",[39,48,55,62,68,75,82,87,93,97],{"slug":40,"title":41,"category":42,"image":43,"author":44,"read_time":45,"published_at":46,"public_read_count":47},"tdp-leaders-clash-with-knives-over-women","AP : అమ్మాయిల కోసం కత్తులతో టీడీపీ నేతల పరస్పర దాడులు!","Ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F1e8aac7a-6c65-4f20-8f47-4f085d394a73.jpg","Kumar","4 నిమిషాల పఠనం","1 సెకను క్రితం",0,{"slug":49,"title":50,"category":51,"image":52,"author":44,"read_time":45,"published_at":53,"public_read_count":54},"konda-faces-threat-to-position-will-konda-murali-meet-the-pcc-chief-today","Congress : కొండాకు పదవీ గండం.. నేడు పీసీసీ చీఫ్‌తో కొండా మురళి భేటీ?","Politics","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F7702ab3f-efaa-4884-a86c-d22eeec29107.webp","19 నిమిషాలు క్రితం",2,{"slug":56,"title":57,"category":58,"image":59,"author":15,"read_time":26,"published_at":60,"public_read_count":61},"brics-2026-russian-and-chinese-leaders-to-visit-delhi-a-historic-diplomatic-victory-for-india","BRICS 2026: ఢిల్లీకి రష్యా, చైనా అధినేతలు.. భారత్ చారిత్రాత్మక దౌత్య విజయం!","International","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F11b6b648-5ea7-4908-ab15-d4c9c7a172a4.jpg","21 నిమిషాలు క్రితం",1,{"slug":63,"title":64,"category":65,"image":66,"author":15,"read_time":45,"published_at":67,"public_read_count":29},"flash-floods-sadhguru-concerned-over-missing-kailash-yatra-group-request-to-china","ఆకస్మిక వరదలు.. కైలాష్ యాత్ర బృందం గల్లంతుపై సద్గురు ఆందోళన.. చైనాకు రిక్వెస్ట్!","National","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3299dd3f-29c4-4ce7-8641-473e5f8d7d53.jpg","32 నిమిషాలు క్రితం",{"slug":69,"title":70,"category":71,"image":72,"author":44,"read_time":45,"published_at":73,"public_read_count":74},"acb-raids-the-residence-of-bhupalpally-district-mines-ad-jayaraju","ACB : భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీ జయరాజు నివాసంలో ఏసీబీ సోదాలు!","Telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Fa67cd1da-941c-4e5b-bb17-5af6c6f19e21.webp","37 నిమిషాలు క్రితం",55,{"slug":76,"title":77,"category":78,"image":79,"author":44,"read_time":45,"published_at":80,"public_read_count":81},"trapped-under-the-pretext-of-a-movie-opportunity-young-director-pavan-sadineni-has-a-long-list-of-allegations-against-him","Hyd : సినిమా చాన్స్ పేరిట ట్రాప్..యువ డైరెక్టర్ పవన్ సాదినేని చిట్టా పెద్దదే..!","Crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F3d1149c9-b69a-49d0-a32c-7f00033c0005.jpg","49 నిమిషాలు క్రితం",106,{"slug":83,"title":84,"category":71,"image":85,"author":44,"read_time":26,"published_at":86,"public_read_count":81},"farmers-lands-under-22-ais-this-racket-just-for-commissions-harish-rao","BRS :  22ఏలో రైతుల భూములు.. కమీషన్ల కోసమేనా ఈ దందా? : హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F859433c4-f96e-45ba-847b-d5747013ab61.jpg","1 గంట క్రితం",{"slug":88,"title":89,"category":90,"image":91,"author":15,"read_time":45,"published_at":86,"public_read_count":92},"swiggys-bumper-offer-piping-hot-food-delivered-right-to-your-theatre-seat","స్విగ్గీ బంపరాఫర్..  థియేటర్ సీటు వద్దకే వేడివేడిగా ఫుడ్ డెలివరీ!","Business","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002F45cdeb15-5df3-49ec-a297-4c0ab355b79b.png",208,{"slug":94,"title":95,"category":78,"image":96,"author":44,"read_time":45,"published_at":86,"public_read_count":81},"daughter-commits-a-shocking-act-right-before-her-fathers-eyes-after-being-told-not-to-use-the-phone","Hyderabad : ఫోన్ మాట్లాడొద్దన్నందుకు తండ్రి కళ్లెదుటే కూతురి దారుణం","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ff90dbc17-ebf0-4028-b86e-8c7c393e9ae4.jpg",{"slug":98,"title":99,"category":90,"image":100,"author":15,"read_time":45,"published_at":86,"public_read_count":29},"paid-rs-14000-crore-against-a-loan-of-rs-6000-crore-vijay-mallya-laments","రూ.6వేల కోట్ల అప్పుకి రూ.14వేల కోట్లు చెల్లించా.. విజయ్ మాల్యా ఆవేదన!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F08\u002Ffce8e65a-88f9-4a22-affc-9ec4b9feeb20.jpg",[102,107,110,112,114,116],{"title":103,"sponsor":104,"image":105,"url":106},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":108,"sponsor":109,"image":105,"url":106},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":111,"sponsor":109,"image":105,"url":106},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":113,"sponsor":109,"image":105,"url":106},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":115,"sponsor":109,"image":105,"url":106},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":117,"sponsor":109,"image":105,"url":106},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]