[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-talasanis-barbs-in-the-mock-assembly-we-spoke-of-promises-within-100-days-but-did-we-specify-which-100-days":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":34,"video_urls":35,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":36,"read_next":39,"sponsored_content":86},5857,2077,"talasanis-barbs-in-the-mock-assembly-we-spoke-of-promises-within-100-days-but-did-we-specify-which-100-days","మాక్ అసెంబ్లీలో తలసాని సెటైర్లు.. '100 రోజుల్లో హామీలు అన్నాం.. కానీ ఏ 100 రోజుల్లో చెప్పామా?'","శాసనసభ సమావేశాల సందర్భంగా తమ పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో 'మాక్ అసెంబ్లీ' (నకిలీ సభ) నిర్వహించింది. ఈ మాక్ అసెంబ్లీలో బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి పాత్ర పోషించగా, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు స్పీకర్ స్థానంలో వ్యవహరించారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F73aee595-844a-4b4a-995c-8ca8c61e0807.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F73aee595-844a-4b4a-995c-8ca8c61e0807.jpg","Mamatha puppala","telangana","routine",[19,20,21,22,23,24,25],"BRSMockAssembly","TalasaniSrinivasYadav","TelanganaBhavan","CongressGuarantees","TelanganaPolitics","BRSvsCongress","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-12T06:57:09+00:00","2026-09-12T06:57:23+00:00",157,"\u003Cp>శాసనసభ సమావేశాల సందర్భంగా తమ పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో 'మాక్ అసెంబ్లీ' (నకిలీ సభ) నిర్వహించింది. ఈ మాక్ అసెంబ్లీలో బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి పాత్ర పోషించగా, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు స్పీకర్ స్థానంలో వ్యవహరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, హామీల అమలు తీరుపై సీఎం పాత్రలో ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ పదునైన వ్యంగ్యాస్త్రాలు విసిరారు.\u003C\u002Fp>\u003Cp>\"మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పాం.. కానీ ఏ 100 రోజుల్లో అమలు చేస్తామో చెప్పామా? ఐదేళ్లు కాదు.. 25 ఏళ్లు మేమే ఉంటాం, ఎప్పుడో ఒకప్పుడు హామీలను నెరవేరుస్తాం\" అంటూ సీఎం పాత్రలో తలసాని మాట్లాడిన మాటలు సభలో నవ్వులు పూయించాయి. అసెంబ్లీలో అసలైన ప్రజా సమస్యల గురించి కాకుండా ఇతర అంశాలపై చర్చ జరుగుతోందనే అంశాన్ని ప్రతిబింబిస్తూ.. \"సభలో సబ్జెక్ట్ తప్ప ఏమైనా మాట్లాడుకోవచ్చు. నాకు చాలా సమస్యలు ఉన్నాయి.. ఢిల్లీతో సమస్య, సొంత పార్టీలో సమస్య, ఆఖరికి బీఆర్‌ఎస్‌తో కూడా ప్రశాంతత లేకుండా పోయింది\" అని కాంగ్రెస్ అధిష్ఠానం, వర్గపోరుపై సెటైర్లు వేశారు.\u003C\u002Fp>\u003Cp>అంతేకాకుండా, ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ప్రాజెక్టును ఇందిరాగాంధీ నిర్మించారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం ద్వారా కాంగ్రెస్ నాయకుల ప్రకటనలను ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను నెరవేరుస్తామని మోసపూరిత హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చాక ప్రజలను తీవ్రంగా వంచిస్తోందని విమర్శించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై ప్లకార్డులు చేతపట్టుకుని నిరసన తెలుపుతూ ఈ మాక్ అసెంబ్లీలో పాల్గొన్నారు.\u003C\u002Fp>\u003Cp>గత కొద్దిరోజులుగా అసెంబ్లీలో బీఆర్‌ఎస్ సభ్యుల సస్పెన్షన్, ప్రజా సమస్యలపై చర్చకు అవకాశం ఇవ్వకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో తెలంగాణ భవన్ వేదికగా బీఆర్‌ఎస్ నిర్వహించిన ఈ వినూత్న నిరసన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. హామీల అమలులో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా ఈ మాక్ అసెంబ్లీ ద్వారా బీఆర్‌ఎస్ నేతలు నిరసన తెలిపారు.\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"Screenshot 2026-09-12 122605_edited.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Feeead76c-f3c9-44e3-92c6-12996b3f2de5.mp4",[34],{"title":37,"description":38},"మాక్ అసెంబ్లీలో తలసాని సెటైర్లు.. '100 రోజుల్లో హామీలు ..","శాసనసభ సమావేశాల సందర్భంగా తమ పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో 'మాక్ అసెంబ్లీ' (నకిలీ సభ) ..",[40,46,53,61,66,73,78],{"slug":41,"title":42,"category":16,"image":43,"author":15,"read_time":26,"published_at":44,"public_read_count":45},"150-tmc-of-water-into-the-sea-jagadish-reddy-lashes-out-in-the-mock-assembly","సముద్రంలోకి 150టీఎంసీలు.. మాక్ అసెంబ్లీలో జగదీష్ రెడ్డి ధ్వజం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1e32e215-c2db-4ecc-a56a-c3871f3f6611.jpg","2026-09-12T07:21:44+00:00",361,{"slug":47,"title":48,"category":16,"image":49,"author":15,"read_time":50,"published_at":51,"public_read_count":52},"dont-know-about-cusecs-only-know-about-bank-cheques-pallas-sarcastic-barbs-in-the-mock-assembly","'క్యూసెక్కులు తెలీవు.. బ్యాంకు చెక్కులే తెలుసు'.. మాక్ అసెంబ్లీలో పల్లా వ్యంగ్యాస్త్రాలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9cd87941-0f5e-450a-b29f-bcff443d308b.jpg","5 నిమిషాల పఠనం","2026-09-12T07:39:30+00:00",208,{"slug":54,"title":55,"category":56,"image":57,"author":58,"read_time":26,"published_at":59,"public_read_count":60},"ssthaman","SS.Thaman: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి థమన్ తప్పుకున్నాడా?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb2d9e624-a4f3-4993-bf0c-b083962c1e27.webp","Anshu","2026-09-12T06:48:16+00:00",55,{"slug":62,"title":63,"category":16,"image":64,"author":15,"read_time":26,"published_at":65,"public_read_count":29},"swachh-auto-workers-arrested-while-attempting-to-lay-siege-to-the-assembly","అసెంబ్లీ ముట్టడికి యత్నించిన స్వచ్ఛ ఆటో కార్మికుల అరెస్ట్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4daf6569-32f6-4048-baa2-172e8721745b.jpg","2026-09-12T06:43:44+00:00",{"slug":67,"title":68,"category":69,"image":70,"author":15,"read_time":26,"published_at":71,"public_read_count":72},"beef-row-in-canada-indian-woman-arrested-for-attacking-tenant","VIRAL: కెనడాలో బీఫ్ గొడవ.. అద్దెదారుడిపై దాడికి దిగిన భారతీయ మహిళ అరెస్ట్!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9ff7ff7a-dc65-422e-ba66-3a9b05ead3b4.jpg","2026-09-12T06:19:32+00:00",106,{"slug":74,"title":75,"category":56,"image":76,"author":58,"read_time":26,"published_at":77,"public_read_count":52},"epic-2","Epic 2: ఫ్లాప్ సినిమాకి సీక్వెల్ కూడానా!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1cc1009e-671a-4da2-8566-24dc76f530b0.jpg","2026-09-12T06:00:34+00:00",{"slug":79,"title":80,"category":81,"image":82,"author":83,"read_time":84,"published_at":85,"public_read_count":29},"beyond-bengaluru","బెంగళూరుకు బ్రేక్..! ఇక ఆ నగరాలే కర్ణాటక కొత్త గ్రోత్‌ ఇంజిన్లు","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd7439fab-c451-4233-97d6-3ad49e5325d6.jpg","Kashi","9 నిమిషాల పఠనం","2026-09-12T05:58:52+00:00",[87,92,95,97,99,101],{"title":88,"sponsor":89,"image":90,"url":91},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":93,"sponsor":94,"image":90,"url":91},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":96,"sponsor":94,"image":90,"url":91},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":98,"sponsor":94,"image":90,"url":91},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":100,"sponsor":94,"image":90,"url":91},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":102,"sponsor":94,"image":90,"url":91},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]