[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-swayambhu":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":24,"published_at":25,"updated_at":26,"public_read_count":27,"body":28,"images":29,"video_url":5,"video_urls":31,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":32,"read_next":35,"sponsored_content":99},5650,1979,"swayambhu","Swayambhu: నవంబర్ లో నిఖిల్ సిద్ధార్థ్ కూడా..ఇంత పోటీలో అవసరమా?","Swayambhu: టాలీవుడ్ యంగ్ హీరోలలో నిఖిల్ సిద్ధార్థ్ కి మంచి క్రేజ్ ఉంది. ఒక రకంగా, చెప్పాలంటే మాస్ మహారాజ్ రవితేజ లాంటి ఎనర్జీతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు, ఈ యంగ్ హీరో కూడా పీరియాడికల్ సినిమాను చేశాడు. అదే స్వయంభు. చాలా నెలల నుంచి ఈ సినిమా రిలీజ్ విషయంలో రక రకాల వార్తలు వచ్చాయి. ఎట్టకేలకి నవంబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టుగా తాజా సమాచారం.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7c3d7525-06b4-455c-ac7f-142c659f1f05.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F7c3d7525-06b4-455c-ac7f-142c659f1f05.jpg","Anshu","cinema","routine",[19,20,21,22,23],"Swayambhu","Nikhil Siddhartha","Nabha Natesh","Samyuktha Menon","Bharat Krishnamachari","4 నిమిషాల పఠనం","2026-09-10T06:43:04+00:00","2026-09-10T06:43:25+00:00",106,"\u003Cp>\u003Cstrong>Swayambhu: \u003C\u002Fstrong>టాలీవుడ్ యంగ్ హీరోలలో నిఖిల్ సిద్ధార్థ్ కి మంచి క్రేజ్ ఉంది. ఒక రకంగా, చెప్పాలంటే మాస్ మహారాజ్ రవితేజ లాంటి ఎనర్జీతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు, ఈ యంగ్ హీరో కూడా పీరియాడికల్ సినిమాను చేశాడు. అదే స్వయంభు. చాలా నెలల నుంచి ఈ సినిమా రిలీజ్ విషయంలో రక రకాల వార్తలు వచ్చాయి. ఎట్టకేలకి నవంబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టుగా తాజా సమాచారం.  \u003C\u002Fp>\u003Cp>కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన నిఖిల్..శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన హ్యాపీడేస్ ఒక్కసారిగా మంచి క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. వాస్తవానికి వరుణ్ సందేష్ హీరో అయినప్పటికీ ఎక్కువగా మాట్లాడుకుంది..క్రేజ్ దక్కింది మాత్రం నిఖిల్ కే. దాంతో, ఏకంగా హీరో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఆ వచ్చిన వాటిలో మంచి సక్సెస్ సాధించిన సినిమాలుండటం విశేషం. \u003C\u002Fp>\u003Cp>కార్తికేయ, కార్తికేయ 2, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కిర్రాక్ పార్టీ లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. 18 పేజేస్ కూడా మంచి పేరును తెచ్చిపెట్టింది. అయితే, అందరిలాగానే నిఖిల్ కూడా పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్‌ను విస్తరించుకోవాలని బాహుబలి లాంటి కథాంశాన్ని ఎంచుకున్నాడు. ఆ సినిమానే స్వయంభు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలు టెక్నికల్ రీజన్స్ వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. దీంతో, ఈ ఏడాది కూడా స్వయంభు రిలీజ్ ఉండదని వార్తలు వైరల్ అవుతున్నాయి. \u003C\u002Fp>\u003Cp>కానీ, మేకర్స్ స్వయంభు సినిమాను ఈ ఏడాది నవంబర్ నెలలో రిలీజ్ చేయ్యాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ అక్టోబర్ 15, 16 తేదీల్లో రజినీకాంత్ నటించిన ‘జైలర్ 2’, విజయ్ దేవరకొండ నటించిన ‘రణబాలి’ సినిమాలు రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అందుకే, నిఖిల్ సినిమాకి థియేటర్ల కొరత లేకుండా నవంబర్ లో రిలీజ్ చెయ్యాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. నవంబర్ 6న సూర్య సినిమా రాబోతోంది. మరి, నిఖిల్ నటిస్తున్న స్వయంభు కి ఏ డేట్ ని లాక్ చేస్తారో చూడాలి. సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకుడు.\u003C\u002Fp>",[30],{"url":13,"name":10},[],{"title":33,"description":34},"Nikhil Siddhartha's Swayambhu Releasing On November","Swayambhu: టాలీవుడ్ యంగ్ హీరోలలో నిఖిల్ సిద్ధార్థ్ కి మంచి క్రేజ్ ఉంది. ఒక రకంగా, చెప్పాలంటే మాస్ మహారాజ్ రవితేజ లాంటి ఎనర్జీతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్ప",[36,45,51,56,62,67,74,80,86,92],{"slug":37,"title":38,"category":39,"image":40,"author":41,"read_time":42,"published_at":43,"public_read_count":44},"assembly-sessions-political-war-over-22a-lands-brs-stages-walkout-from-the-assembly","Assembly Sessions: 22ఏ భూములపై పొలిటికల్ వార్‌.. అసెంబ్లీ నుండి బీఆర్‌ఎస్ వాకౌట్!..","telangana","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F0f0f3316-a9b4-4275-b425-5c4d1ecce4b1.webp","Venu","6 నిమిషాల పఠనం","2026-09-10T06:44:30+00:00",55,{"slug":46,"title":47,"category":39,"image":48,"author":49,"read_time":24,"published_at":50,"public_read_count":44},"where-is-the-24-hour-power-supply-farmers-stage-a-surprise-protest-in-revanth-reddys-native-village","24 గంటల కరెంట్ ఏదీ?.. రేవంత్ రెడ్డి స్వగ్రామంలో రైతుల మెరుపు ధర్నా..!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb4193915-dec0-4b3b-bad2-2d5672645677.jpg","Mamatha puppala","2026-09-10T06:47:49+00:00",{"slug":52,"title":53,"category":16,"image":54,"author":15,"read_time":24,"published_at":55,"public_read_count":44},"nbk-112-100","NBK 112: కొరటాల కోసం బాలయ్య 100 రోజులు డేట్స్!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F143765ca-a341-437f-98a8-0add519d44bc.jpg","2026-09-10T07:06:54+00:00",{"slug":57,"title":58,"category":59,"image":60,"author":49,"read_time":24,"published_at":61,"public_read_count":27},"big-relief-for-city-residents-during-the-ganesh-immersionmetro-services-to-run-past-midnight","గణేశ్ నిమజ్జనం వేళ నగరవాసులకు బిగ్ రిలీఫ్.. అర్ధరాత్రి దాటినా మెట్రో సేవలు!","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F5feed162-45cd-4222-80f9-619094f89376.jpg","2026-09-10T07:12:01+00:00",{"slug":63,"title":64,"category":16,"image":65,"author":15,"read_time":24,"published_at":66,"public_read_count":44},"418-censor-report","'418'-Censor Report: ఈ హారర్ థ్రిల్లర్ పెద్దలకి మాత్రమే!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F39b3a040-639b-4e8c-939f-a5994ac051c6.webp","2026-09-10T07:29:58+00:00",{"slug":68,"title":69,"category":39,"image":70,"author":71,"read_time":24,"published_at":72,"public_read_count":73},"tesseract-blow-to-cm-revanth-ktr-and-harish-rao-deliver-a-big-shock","BRS : సీఎం రేవంత్‌కు ‘టెస్సరాక్ట్’ దెబ్బ..బిగ్‌షాక్ ఇచ్చిన కేటీఆర్, హరీశ్ రావు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F73d165e1-52be-4268-8ac3-b35fc5fb5ea8.jpg","Kumar","2026-09-10T06:40:09+00:00",310,{"slug":75,"title":76,"category":77,"image":78,"author":49,"read_time":24,"published_at":79,"public_read_count":27},"accident-on-national-highway-fire-breaks-out-in-dcm-truck-driver-and-200-goats-burnt-alive","జాతీయ రహదారిపై ప్రమాదం.. డీసీఎంలో మంటలు.. డ్రైవర్, 200మేకలు సజీవ దహనం!","crime","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffe61ae93-3570-47ad-add4-2dcc6319bd38.jpg","2026-09-10T06:20:42+00:00",{"slug":81,"title":82,"category":39,"image":83,"author":71,"read_time":24,"published_at":84,"public_read_count":85},"cctv-cameras-in-rtc-buses-minister-ponnam-clarifies","TG : ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలు.. మంత్రి పొన్నం క్లారిటీ","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fcae13a5c-a856-460a-bf82-c108b1f0d785.jpg","2026-09-10T06:11:11+00:00",259,{"slug":87,"title":88,"category":77,"image":89,"author":41,"read_time":90,"published_at":91,"public_read_count":27},"hyderabad-massive-fire-breaks-out-at-midnight-in-boduppal-three-food-courts-gutted","Hyderabad: బోడుప్పల్‌లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం.. మూడు ఫుడ్ కోర్టులు దగ్ధం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb891ac10-9ebe-4843-83c6-596e6856f7d9.webp","3 నిమిషాల పఠనం","2026-09-10T06:00:50+00:00",{"slug":93,"title":94,"category":95,"image":96,"author":49,"read_time":97,"published_at":98,"public_read_count":27},"warship-manufacturing-worth-8000-crore-another-massive-project-for-ap","రూ.8,000 కోట్లతో యుద్ధనౌకల తయారీ.. ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్!","ap","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fe9b9451b-8664-46f9-befa-19bf13e24bb4.jpg","5 నిమిషాల పఠనం","2026-09-10T05:53:57+00:00",[100,105,108,110,112,114],{"title":101,"sponsor":102,"image":103,"url":104},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":106,"sponsor":107,"image":103,"url":104},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":109,"sponsor":107,"image":103,"url":104},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":111,"sponsor":107,"image":103,"url":104},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":113,"sponsor":107,"image":103,"url":104},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":115,"sponsor":107,"image":103,"url":104},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]