[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-swachh-auto-workers-arrested-while-attempting-to-lay-siege-to-the-assembly":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":26,"published_at":27,"updated_at":28,"public_read_count":29,"body":30,"images":31,"video_url":5,"video_urls":34,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":35,"read_next":37,"sponsored_content":96},5853,2075,"swachh-auto-workers-arrested-while-attempting-to-lay-siege-to-the-assembly","అసెంబ్లీ ముట్టడికి యత్నించిన స్వచ్ఛ ఆటో కార్మికుల అరెస్ట్!","రాజధాని హైదరాబాద్‌లో స్వచ్ఛ ఆటో కార్మికులు తమ ఉపాధిని కాపాడుకోవాలని కోరుతూ చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కార్మికులు శాసనసభ ముట్టడికి యత్నించారు.","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4daf6569-32f6-4048-baa2-172e8721745b.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F4daf6569-32f6-4048-baa2-172e8721745b.jpg","Mamatha puppala","telangana","routine",[19,20,21,22,23,24,25],"SwachhAutoWorkers","HyderabadNews","TelanganaAssembly","GHMC","RamkyContract","AssemblySiege","swechaanews","4 నిమిషాల పఠనం","2026-09-12T06:43:44+00:00","2026-09-12T06:44:01+00:00",157,"\u003Cp>&nbsp;రాజధాని హైదరాబాద్‌లో స్వచ్ఛ ఆటో కార్మికులు తమ ఉపాధిని కాపాడుకోవాలని కోరుతూ చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కార్మికులు శాసనసభ ముట్టడికి యత్నించారు. అయితే, బషీర్ బాగ్ సమీపంలోని ఎల్బీ స్టేడియం వద్ద అలర్ట్ అయిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. నిరసనకారులను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి, ముందస్తుగా అరెస్ట్ చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు.\u003C\u002Fp>\u003Cp>&nbsp;గత ఎన్నో ఏళ్లుగా నగరంలో ఇంటింటికీ తిరుగుతూ చెత్త సేకరిస్తున్న తమ పొట్ట కొట్టవద్దని స్వచ్ఛ ఆటో కార్మికులు ఈ సందర్భంగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదలైన తమ ఉపాధి ఆధారమైన చెత్త సేకరణ బాధ్యతలను కార్పొరేట్ సంస్థ అయిన 'రాంకీ'కి కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వారు ఆరోపించారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన లేదా సంస్థలకు ఈ బాధ్యతలు అప్పగిస్తే వేలాది మంది స్వచ్ఛ ఆటో కార్మికుల కుటుంబాలు వీధిపాలు కాక తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు.\u003C\u002Fp>\u003Cp>&nbsp;ఎన్నో ఏళ్లుగా తాము కష్టపడి నగర పారిశుద్ధ్య వ్యవస్థను కాపాడుతున్నామని, తమను తొలగించి ఇతర సంస్థలకు బాధ్యతలు ఇవ్వడం ఏమాత్రం సమంజసం కాదని కార్మిక సంఘాల నేతలు మండిపడ్డారు. పాత పద్ధతిలోనే స్వచ్ఛ ఆటో కార్మికుల ద్వారానే ఇంటింటి చెత్త సేకరణ కొనసాగేలా జీహెచ్‌ఎంసీ (GHMC), రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. బకాయిలు చెల్లించడంతో పాటు తమ ఉపాధికి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.\u003C\u002Fp>\u003Cp>&nbsp;అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో బషీర్ బాగ్, గన్ పార్క్, లక్డీకాపూల్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా పికెటింగ్ నిర్వహించారు. ముందస్తు అరెస్టులతో లక్డీకాపూల్, నాంపల్లి పరిసరాల్లో కాసేపు ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించింది. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని, నగరం అంతటా చెత్త సేకరణను నిలిపివేసి నిరసన తెలుపుతామని స్వచ్ఛ ఆటో కార్మికుల సంఘాలు హెచ్చరించాయి.\u003C\u002Fp>",[32],{"url":13,"name":33},"WhatsApp Image 2026-09-12 at 11.23.20 AM.jpeg",[],{"title":11,"description":36},"రాజధాని హైదరాబాద్‌లో స్వచ్ఛ ఆటో కార్మికులు తమ ఉపాధిని కాపాడుకోవాలని కోరుతూ చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల ముగింపు..",[38,46,51,57,64,71,76,84,91],{"slug":39,"title":40,"category":41,"image":42,"author":43,"read_time":26,"published_at":44,"public_read_count":45},"ssthaman","SS.Thaman: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి థమన్ తప్పుకున్నాడా?","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb2d9e624-a4f3-4993-bf0c-b083962c1e27.webp","Anshu","2026-09-12T06:48:16+00:00",55,{"slug":47,"title":48,"category":16,"image":49,"author":15,"read_time":26,"published_at":50,"public_read_count":29},"talasanis-barbs-in-the-mock-assembly-we-spoke-of-promises-within-100-days-but-did-we-specify-which-100-days","మాక్ అసెంబ్లీలో తలసాని సెటైర్లు.. '100 రోజుల్లో హామీలు అన్నాం.. కానీ ఏ 100 రోజుల్లో చెప్పామా?'","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F73aee595-844a-4b4a-995c-8ca8c61e0807.jpg","2026-09-12T06:57:09+00:00",{"slug":52,"title":53,"category":16,"image":54,"author":15,"read_time":26,"published_at":55,"public_read_count":56},"150-tmc-of-water-into-the-sea-jagadish-reddy-lashes-out-in-the-mock-assembly","సముద్రంలోకి 150టీఎంసీలు.. మాక్ అసెంబ్లీలో జగదీష్ రెడ్డి ధ్వజం!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1e32e215-c2db-4ecc-a56a-c3871f3f6611.jpg","2026-09-12T07:21:44+00:00",361,{"slug":58,"title":59,"category":16,"image":60,"author":15,"read_time":61,"published_at":62,"public_read_count":63},"dont-know-about-cusecs-only-know-about-bank-cheques-pallas-sarcastic-barbs-in-the-mock-assembly","'క్యూసెక్కులు తెలీవు.. బ్యాంకు చెక్కులే తెలుసు'.. మాక్ అసెంబ్లీలో పల్లా వ్యంగ్యాస్త్రాలు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9cd87941-0f5e-450a-b29f-bcff443d308b.jpg","5 నిమిషాల పఠనం","2026-09-12T07:39:30+00:00",208,{"slug":65,"title":66,"category":67,"image":68,"author":15,"read_time":26,"published_at":69,"public_read_count":70},"beef-row-in-canada-indian-woman-arrested-for-attacking-tenant","VIRAL: కెనడాలో బీఫ్ గొడవ.. అద్దెదారుడిపై దాడికి దిగిన భారతీయ మహిళ అరెస్ట్!","viral","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9ff7ff7a-dc65-422e-ba66-3a9b05ead3b4.jpg","2026-09-12T06:19:32+00:00",106,{"slug":72,"title":73,"category":41,"image":74,"author":43,"read_time":26,"published_at":75,"public_read_count":63},"epic-2","Epic 2: ఫ్లాప్ సినిమాకి సీక్వెల్ కూడానా!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F1cc1009e-671a-4da2-8566-24dc76f530b0.jpg","2026-09-12T06:00:34+00:00",{"slug":77,"title":78,"category":79,"image":80,"author":81,"read_time":82,"published_at":83,"public_read_count":29},"beyond-bengaluru","బెంగళూరుకు బ్రేక్..! ఇక ఆ నగరాలే కర్ణాటక కొత్త గ్రోత్‌ ఇంజిన్లు","national","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fd7439fab-c451-4233-97d6-3ad49e5325d6.jpg","Kashi","9 నిమిషాల పఠనం","2026-09-12T05:58:52+00:00",{"slug":85,"title":86,"category":87,"image":88,"author":89,"read_time":26,"published_at":90,"public_read_count":29},"we-will-not-attack-european-countries-russian-president-putin","putin : యూరప్ దేశాలపై దాడులు  చేయం : రష్యా అధ్యక్షుడు పుతిన్","world","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Ffcc9bb22-15f6-408b-b294-48a5acb8a8df.jpg","Kumar","2026-09-12T05:47:28+00:00",{"slug":92,"title":93,"category":16,"image":94,"author":15,"read_time":26,"published_at":95,"public_read_count":63},"mock-assembly-at-telangana-bhavan-talasani-as-cm-manikyarao-as-speaker","తెలంగాణ భవన్‌లో 'మాక్ అసెంబ్లీ'.. సీఎంగా తలసాని.. స్పీకర్‌గా మాణిక్యరావు!","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F87db32ff-d312-4a16-977f-ebbb6d6cf773.jpg","2026-09-12T05:34:18+00:00",[97,102,105,107,109,111],{"title":98,"sponsor":99,"image":100,"url":101},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":103,"sponsor":104,"image":100,"url":101},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":106,"sponsor":104,"image":100,"url":101},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":108,"sponsor":104,"image":100,"url":101},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":110,"sponsor":104,"image":100,"url":101},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":112,"sponsor":104,"image":100,"url":101},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]