[{"data":1,"prerenderedAt":-1},["ShallowReactive",2],{"site-status":3,"swetcha-article-susmitha-challene-to-revanth":6},{"coming_soon":4,"coming_soon_message":5},false,null,{"data":7,"error":5},{"id":8,"story_id":9,"slug":10,"title":11,"summary":12,"hero_image_url":13,"discover_image_url":14,"author":15,"category":16,"priority":17,"tags":18,"read_time":33,"published_at":34,"updated_at":34,"public_read_count":35,"body":36,"images":37,"video_url":5,"video_urls":40,"instagram_url":5,"x_url":5,"youtube_id":5,"youtube_embed_url":5,"youtube_watch_url":5,"youtube_title":11,"seo":41,"read_next":44,"sponsored_content":79},4979,1650,"susmitha-challene-to-revanth","కొండా సురేఖ ఉప ఎన్నికకు సిద్ధమవుతున్నారా..? సుస్మిత సెన్సేషనల్ కామెంట్స్..!","మంత్రి పదవి పోయింది.. కానీ కొండా కుటుంబం పోరాటం మాత్రం ఆగలేదు. పైగా ఇప్పుడు ఆ పోరాటం కాంగ్రెస్‌లో ఉంటూనా.. లేక ప్రజాక్షేత్రానికి వస్తుందా అనే చర్చ మొదలైంది. కొండా సురేఖ కూతురు సుస్మిత నేష‌న‌ల్ మీడియాతో చేసిన తాజా వ్యాఖ్యలు ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి.  ఇంత‌కీ ఆమె ఏమ‌న్నారు..?  కొండా ఫ్యామిలీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి..?","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Ffiles\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3394170c-953e-4a2f-8b9f-8a56d0f8c5f8.jpg","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F3394170c-953e-4a2f-8b9f-8a56d0f8c5f8.jpg","Kashi","telangana","routine",[19,20,21,22,23,24,25,26,27,28,29,30,31,32],"Konda Surekha","Konda Sushmita","Revanth Reddy","Telangana Politics","Telangana Congress","Konda Family","Telangana News","Congress Politics","Warangal Politics","Parkal Politics","Political Fight","Telangana Bypoll","Revanth Reddy News","Konda Surekha News","6 నిమిషాల పఠనం","2026-09-03T18:28:24+00:00",106,"\u003Cp>కాంగ్రెస్‌తో ఇక పోరాట‌మేనా..?\u003C\u002Fp>\u003Cp>కొండా ఫ్యామిలీ ప్లాన్ బి ఏంటి..?\u003C\u002Fp>\u003Cp>మీసం మెలేస్తున్న ముర‌ళీ\u003C\u002Fp>\u003Cp>స‌వాల్ చేస్తున్న సుస్మిత‌\u003C\u002Fp>\u003Cp>కాంగ్రెస్‌కు కొండంత టెన్ష‌న్..?\u003C\u002Fp>\u003Cp>ఓవైపు మీసం మెలేస్తున్న కొండా ముర‌ళీ. మ‌రోవైపు సీఎంకే స‌వాల్ చేస్తున్న సుస్మిత‌. కొండా సురేఖను మంత్రివ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసిన త‌ర్వాత చోటు చేసుకున్న ప‌రిణామాలు ఇవి. అస‌లు కొండా ఫ్యామిలీ వ్యూహ‌మేంటి..?  కాంగ్రెస్‌లోనే ఉంటారా..?  లేక కాంగ్రెస్‌కు పోటీగా రోడ్డెక్కుతారా..? \u003C\u002Fp>\u003Cp>సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే ఎన్నికలకు రావాలి అంటూ సుస్మిత చేసిన స‌వాల్.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నేష‌న‌ల్ మీడియాతో మాట్లాడూతూ ప‌లు సంచ‌న‌ల వ్యాఖ్య‌లు చేశారు కొండా సురేఖ కుమార్తె సుస్మిత‌. ఆమె విసిరిన సవాల్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో క‌ల‌క‌లం రేపుతోంది. ఇంతకీ సుస్మిత ఎందుకు అంత సీరియస్‌గా సవాల్ చేశారు? సురేఖ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఏం జరుగుతుంది? అసలు కొండా కుటుంబం ముందున్న వ్యూహం ఏంటి?\u003C\u002Fp>\u003Cp>సుస్మిత సవాల్‌కు రాజకీయ లెక్క ఉందా?\u003C\u002Fp>\u003Cp>పరకాల అసెంబ్లీ సీటు విషయంలో మొదలైన వివాదం ఇప్పుడు రేవంత్‌రెడ్డి వర్సెస్ కొండా కుటుంబంగా మారింది. పరకాల నుంచి పోటీ చేయాలన్న తన ఆసక్తిని సుస్మిత ఇప్పటికే స్పష్టం చేశారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రస్తుత పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి మద్దతుగా మాట్లాడటంతో వివాదం మరింత ముదిరింది.\u003C\u002Fp>\u003Cp>ఇదే అంశంపై నేష‌న‌ల్ మీడియాతో మాట్లాడిన సుస్మిత.. రేవంత్‌రెడ్డిని నేరుగా టార్గెట్ చేశారు. ఎన్నికల వరకు ఎందుకు వేచి చూడాలని ప్రశ్నిస్తూ.. ఇప్పుడే ఎన్నికలకు వస్తే ఎవరి బలం ఎంతో తేలిపోతుందని సవాల్ చేశారు. అంటే ఇది కేవలం టికెట్ కోసం చేసిన డిమాండ్ కాదని.. ప్రజల్లో తమ బలం ఏమిటో తేల్చుకునే సవాల్‌గా కొండా కుటుంబం ఈ అంశాన్ని తీసుకుంటోందా? అనే చర్చ మొదలైంది.\u003C\u002Fp>\u003Cp>కేబినెట్ నుంచి ఔట్.. ఇప్పుడు ఎమ్మెల్యే పదవి?\u003C\u002Fp>\u003Cp>కొండా సురేఖను కేబినెట్ నుంచి తొలగించారు. కానీ ఆమె కాంగ్రెస్‌ను వీడటం లేదని స్పష్టం చేశారు. అంటే పార్టీ మారడం కంటే.. కాంగ్రెస్‌లోనే ఉంటూ తన రాజకీయ పోరాటాన్ని కొనసాగించే అవకాశం ప్రస్తుతానికి కనిపిస్తోంది. అయితే మంత్రి పదవి పోయిన తర్వాత పరిస్థితి మారింది. ఇప్పుడు సురేఖ చేతిలో ఉన్న ఆయుధం.. ఎమ్మెల్యే పదవి. దీంతో సహజంగానే ఒక ప్రశ్న తెరపైకి వస్తోంది. సురేఖ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే? అనేదే ఆ ప్ర‌శ్న‌. \u003C\u002Fp>\u003Cp>ఉప ఎన్నిక వస్తే.. అది ఎవరి మధ్య పోటీ?\u003C\u002Fp>\u003Cp>ఒకవేళ సురేఖ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే.. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్య‌మ‌వుతుంది. అప్పుడు అది సాధారణ ఉప ఎన్నికగా ఉండదు. ఒకవైపు అధికార కాంగ్రెస్. మరోవైపు కొండా కుటుంబం.\u003C\u002Fp>\u003Cp>అంటే ఎన్నిక మొత్తం రేవంత్ నాయకత్వానికి బలం ఎంత? కొండా కుటుంబానికి ప్రజల్లో ఉన్న ఆద‌ర‌ణ ఎంత‌ అనే ప్రశ్న చుట్టూ తిరిగే అవకాశం ఉంటుంది. అదే అసలు సుస్మిత సవాల్‌లోని రాజకీయ లెక్కగా కనిపిస్తోంది.\u003C\u002Fp>\u003Cp>ఎన్నికలు 2028లో జరుగుతాయని ఎదురుచూడకుండా.. ఇప్పుడే ప్రజల దగ్గరకు వెళ్లి ఎవరి బలం ఎంతో తేల్చుకుందామని ఆమె సవాల్ చేయడం వెనుక ఇదే ఆలోచన ఉందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.\u003C\u002Fp>\u003Cp>రేవంత్‌కు మరో సవాల్ \u003C\u002Fp>\u003Cp>కొండా కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోవాల్సి వస్తే.. అది కేవలం ఒక నాయకురాలితో పోరాటం కాదు. వరంగల్ ప్రాంతంలో కొండా కుటుంబానికి ఉన్న రాజకీయ ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే సురేఖ తదుపరి అడుగు ఏమిటన్నది కాంగ్రెస్‌లోనూ ఆసక్తిగా మారింది.\u003C\u002Fp>\u003Cp>కాంగ్రెస్‌లోనే ఉండి పోరాడతారా? పార్టీ అధిష్ఠానంతో రాజీకి వస్తారా? లేక ఎమ్మెల్యే పదవినే రాజకీయ ఆయుధంగా మార్చుకుంటారా? అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. మొత్తానికి ప్ర‌స్తుతం తెలంగాణ రాజ‌కీయాలు మొత్తం కొండా ఫ్యామిలీ చుట్టే తిరుగుతున్నాయి.\u003C\u002Fp>",[38],{"url":13,"name":39},"konda_political_poster_under_1mb.jpg",[],{"title":42,"description":43},"Konda Surekha vs Revanth Reddy: Political War Intensifies","Konda Surekha's cabinet exit and Sushmita's challenge to Revanth Reddy spark fresh speculation over a possible bypoll and the Konda family's next move.",[45,53,59,65,73],{"slug":46,"title":47,"category":16,"image":48,"author":49,"read_time":50,"published_at":51,"public_read_count":52},"cm-revanth-reddy-kodangal-tour-schedule","Cm Revanth: కొడంగల్‌కు సీఎం రేవంత్.. నియోజకవర్గంలో 2రోజుల పర్యటన","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F9065f03a-b38d-4f05-b030-1447ecd3a33b.jpg","NK","3 నిమిషాల పఠనం","2026-09-03T18:26:41+00:00",4,{"slug":54,"title":55,"category":16,"image":56,"author":49,"read_time":57,"published_at":58,"public_read_count":52},"minister-ponguleti-srinivas-reddy-warns-revenue-department-officials","Ponguleti Srinivas Reddy: మీ వైఖరి మారాలి, లేదంటే మీ పదవులు మారతాయి- రెవెన్యూ శాఖ అధికారులకు మంత్రి పొంగులేటి వార్నింగ్","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fb9e92c08-6b12-4b50-8464-6848b9c51ccd.jpg","14 నిమిషాల పఠనం","2026-09-03T18:07:46+00:00",{"slug":60,"title":61,"category":16,"image":62,"author":49,"read_time":63,"published_at":64,"public_read_count":35},"no-one-can-scare-me-cm-revanth-reddy-interesting-comments-in-saidabad","Cm Revanth: నన్ను ఎవరూ బెదిరించలేరు, ధమ్మీ ఇచ్చి భయపెట్టలేరు-సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002F19d772cd-77d9-4d71-8413-684fe9cce80c.jpg","5 నిమిషాల పఠనం","2026-09-03T17:17:19+00:00",{"slug":66,"title":67,"category":68,"image":69,"author":70,"read_time":71,"published_at":72,"public_read_count":35},"rashmika-mandanna-1","Rashmika Mandanna: నేషనల్ క్రష్ ఇప్పుడు నంబర్ 1..దీపిక కూడా వెనక్కే!","cinema","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fbbf7218f-8b1c-4dcf-8423-90c240cc68b1.jpg","Anshu","4 నిమిషాల పఠనం","2026-09-03T16:12:54+00:00",{"slug":74,"title":75,"category":16,"image":76,"author":49,"read_time":77,"published_at":78,"public_read_count":52},"ktr-announces-padayatra-for-nagarjuna-sagar-water","KTR: ప్రభుత్వానికి కేటీఆర్ 10రోజుల డెడ్‌లైన్.. పాదయాత్రపై కీలక ప్రకటన","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Fapi\u002Fnewsroom\u002Fpublic\u002Fv1\u002Fdiscover-images\u002Fs3\u002Fcms\u002Farticles\u002F2026\u002F09\u002Fdb638a5a-6691-438f-abf2-ad4a142d6fe4.jpg","9 నిమిషాల పఠనం","2026-09-03T15:54:25+00:00",[80,85,88,90,92,94],{"title":81,"sponsor":82,"image":83,"url":84},"పునర్నిర్వచించిన పరిశోధన: భవిష్యత్ ముందంజలో ఎనర్జీ సెంటర్లు","Aramco","https:\u002F\u002Fapi.swetchanews.com\u002Ffrontpage\u002Fplaceholder.svg","#",{"title":86,"sponsor":87,"image":83,"url":84},"ఈటీఎఫ్‌లపై తాజా సమాచారం ఏమిటి?","MarketViews",{"title":89,"sponsor":87,"image":83,"url":84},"కమొడిటీ ధోరణులు, పరిణామాలపై మేటి విశ్లేషణలు తెలుసుకోండి",{"title":91,"sponsor":87,"image":83,"url":84},"బంగారం మార్కెట్ తాజా పరిణామాలతో అప్‌డేట్‌గా ఉండండి",{"title":93,"sponsor":87,"image":83,"url":84},"చమురు మార్కెట్‌లో తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోండి",{"title":95,"sponsor":87,"image":83,"url":84},"రిటైర్‌మెంట్ ప్లానింగ్ వ్యూహాల్లో తాజా ధోరణులను తెలుసుకోండి"]